గోవింద్ వల్లభ్ పంత్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గోవింద్ వల్లభ్ పంత్
Govind-Vallabh-Panth.png
గోవింద్ వల్లభ్ పంత్
జననం గోవింద్ వల్లభ్ పంత్
1887 సెప్టెంబరు 10
మరణం 1961 మార్చి 7
ఇతర పేర్లు గోవింద్ వల్లభ్ పంత్
ప్రసిద్ధి స్వాంతంత్ర్య సమరయోధుడు

గోవింద్ వల్లభ్ పంత్ (1887 సెప్టెంబరు 10 - 1961 మార్చి 7 ) భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ నాయకుడు. హిందీని భారత దేశ అధికార భాషగా చేయడానికి ఈయన కృషి చేశాడు.

ఒక పేద కుటుంబములో జన్మించిన పంత్, వకీలు వృత్తిని ఎంచుకుని 1914లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యాజ్యములో విజయం సాధించాడు. 1921లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి గెలవడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టాడు. 1937-39, 1946-50 లలో సంయుక్త రాజ్యాలకు (United Provinces: యునైటెడ్ ప్రావిన్సెస్) ముఖ్యమంత్రిగా, ఆ పైన ఉత్తర్ ప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1950-54 లలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1955 లో కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈయనకు 1957లో భారతరత్న పురస్కారం లభించింది.

Political offices
Preceded by
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
26 జనవరి 1950 – 27 డిసెంబర్ 1954
Succeeded by
సంపూర్ణానంద్