ధొండొ కేశవ కర్వే

వికీపీడియా నుండి
(ధొండొ కేశవ కార్వే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ధొండొ కేశవ కర్వే
Dhondo Keshav Karve 1958 stamp of India.jpg
తపాలా బిళ్ళపై కర్వే
జననం(1858-04-18)1858 ఏప్రిల్ 18
షేరావళి, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర
మరణం1962 నవంబరు 9(1962-11-09) (వయస్సు 104)
వృత్తివిద్యావేత్త
మహిళోద్ధారకుడు
సుపరిచితుడుఎస్.ఎన్.డీ.టి మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడు
పురస్కారాలుభారతరత్న పురస్కారం

మహర్షి ధొండొ కేశవ కర్వే (ఏప్రిల్ 18, 1858 - నవంబర్ 9, 1962).ఈయన తన జీవితాంతము మహిళా ఉద్ధరణకై పాటుపడినాడు. ఈయన మహిళలకై ఒక కళాశాల ప్రారంభించాడు.ఈయన ప్రప్రథమ మహిళా విశ్వవిద్యాలయమైన ఎస్.ఎన్.డీ.టి మహిళా విశ్వవిద్యాలయమును 1916లో ముంబైలో స్థాపించాడు. 1958లో ఈయన్ను భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నతో సత్కరించారు. అభిమానులు ఈయన్ను అన్నా లేదా అన్నాసాహెబ్ అని పిలిచేవారు.

ఆరంభ జీవితం[మార్చు]

కర్వే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా, ఖేడ్ తాలూకాకు చెందిన షేరావళిలో ఏప్రిల్ 18, 1858న ఒక చిత్‌పవన్ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈయన స్వస్థలం కొంకణ్ ప్రాంతంలోని మురుద్ (రత్నగిరి జిల్లా). ఈయన తండ్రి పేరు కేశవ్ బాపున్న కర్వే.

కర్వే ముంబాయిలోని విల్సన్ కళాశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. [1] ఆ తరువాత ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుండి గణిత శాస్త్రములో బి.ఎ. పట్టా పొందాడు. [2].

కర్వేకు 14 యేళ్ళ వయసులో 8 సంవత్సరాల బాలిక అయిన రాధాబాయినిచ్చి పెళ్ళిచేశారు. కానీ వైవాహిక జీవితము 20 యేళ్ళు నిండిన తర్వాతనే ప్రారంభించాడు. రాధాబాయి చిన్నవయసులోనే 1891లో మరణించింది. మొదటి వివాహంలో కర్వేకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ రోజుల్లో సమాజంలో వితంతువుల కష్టాలు చూసి, వితంతు పునర్వివావాహాల గురించి ఆలోచించాడు. 1893లో 8వ యేటనే వితంతువైన 23యేళ్ళ గోదూబాయిని కర్వే వివాహమాడి సాంప్రదాయక మహారాష్ట్ర సమాజంలో ఒక ఉదాహరణగా నిలిచాడు.[3][4] .

కర్వే 1962 నవంబర్ 9పూణేలో మరణించాడు.

మూలాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. "Vikram Karve's Notes on his great-grand father". Archived from the original on 2007-08-22. Retrieved 2006-08-01.
  2. "Notes on Asia Times". Archived from the original on 2007-10-15. Retrieved 2006-08-04.
  3. "NCTE - Comparison of Tilak with other reformers including Karve". Archived from the original on 2006-11-06. Retrieved 2006-08-01.
  4. "Maharshi Karve Stree Shikshan Samstha". Retrieved 2006-08-01.[permanent dead link]