ధొండొ కేశవ కర్వే
మహర్షి ధొండొ కేశవ కర్వే (ఏప్రిల్ 18, 1858 - నవంబర్ 9, 1962).ఈయన తన జీవితాంతము మహిళా ఉద్ధరణకై పాటుపడినాడు. ఈయన మహిళలకై ఒక కళాశాల ప్రారంభించాడు.ఈయన ప్రప్రథమ మహిళా విశ్వవిద్యాలయమైన ఎస్.ఎన్.డీ.టి మహిళా విశ్వవిద్యాలయమును 1916లో ముంబైలో స్థాపించాడు. 1958లో ఈయన్ను భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నతో సత్కరించారు. అభిమానులు ఈయన్ను అన్నా లేదా అన్నాసాహెబ్ అని పిలిచేవారు.
ఆరంభ జీవితం
[మార్చు]కర్వే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా, ఖేడ్ తాలూకాకు చెందిన షేరావళిలో ఏప్రిల్ 18, 1858న ఒక చిత్‌పవన్ బ్రాహ్మణ కుటుంబములో కేశవ్ బాపున్న కర్వే, లక్ష్మీబాయి దంపతులకు జన్మించాడు. ఈయన స్వస్థలం కొంకణ్ ప్రాంతంలోని మురుద్ (రత్నగిరి జిల్లా). బాల్యం అంతా దారిద్రముతో బహు ఆర్థిక ఇబ్బందులతో గడిచింది.
కర్వే ముంబాయిలోని విల్సన్ కళాశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. [1] ఆ తరువాత ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుండి గణిత శాస్త్రములో బి.ఎ. పట్టా పొందాడు. గోఖలే రనడే, దాదాభాయి నవరోజి వంటి వారి స్ఫూర్తితో పూణేలో ఫర్గుసన్ కళాశాలలో గణితాచార్యుడిగా పనిచేశాడు. ఒకసారి డెక్కన్ వార్షిక సదస్సు నిర్వహిస్తూ ఉండగా ముందు వరుసలో కూర్చున్న ఒకానొక విధవరాలును కార్యకర్తలు బలవంతంగా వెనక్కు నెట్టగా అదిచూసి చలించిన కేశవ కర్వే అది అమానుషీయము భావించి వారి రక్షణకు గాను సహకారం చేయుట ఆరంభించారు. అనాధా బాలికలకు, విధవలకు ఆశ్రమాన్ని నెలకొల్పి వారి వసతికి జీవనోపాధికి సరిపడ్డ అవకాశాలు కల్పించారు. [2].
కర్వేకు 14 యేళ్ళ వయసులో 8 సంవత్సరాల బాలిక అయిన రాధాబాయినిచ్చి పెళ్ళిచేశారు. కానీ వైవాహిక జీవితము 20 యేళ్ళు నిండిన తర్వాతనే ప్రారంభించాడు. రాధాబాయి చిన్నవయసులోనే 1891లో మరణించింది. మొదటి వివాహంలో కర్వేకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ రోజుల్లో సమాజంలో వితంతువుల కష్టాలు చూసి, వితంతు పునర్వివావాహాల గురించి ఆలోచించాడు. 1893లో 8వ యేటనే వితంతువైన 23యేళ్ళ గోదూబాయిని కర్వే వివాహమాడి సాంప్రదాయక మహారాష్ట్ర సమాజంలో ఒక ఉదాహరణగా నిలిచాడు.[3][4] . ఇతని మరదలు పార్వతిబాయి అథవాలే కూడా వితంతు పద్ధతులకు వ్యతిరేకంగా కృషి చేసింది. ఆయన చేస్తున్న సమాజ సేవకు గాను ప్రజలు ఆయనను మహర్షి అన్న బిరుదినిచ్చి అలానే పిలవసాగారు. స్త్రీలకు ఉన్నతోద్యాగాలు కల్పించాలి, సమాజిక గౌరవం కల్పించాలి అని కేశవ కర్వే చేత వ్రాయబడిన అనేక లేఖల వలన గాంధీగారికి ప్రీతిపాత్రుడు అయ్యాడు. చేతిలో భిక్షా పాత్రను స్వీకరించి ప్రజలలో చందాలు స్వీకరించి పదిహైనుకు పైగా ప్రాథమిక పాఠశాలలు నిర్మించారు. అనేక విశ్వవిద్యాలయ ద్వారా మహోమహోపాధ్యాయ వంటి బిరుదలతో అలకించబడ్డారు.
కర్వే 1962 నవంబర్ 9 న పూణేలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Vikram Karve's Notes on his great-grand father". Archived from the original on 2007-08-22. Retrieved 2006-08-01.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Notes on Asia Times". Archived from the original on 2007-10-15. Retrieved 2006-08-04.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "NCTE - Comparison of Tilak with other reformers including Karve". Archived from the original on 2006-11-06. Retrieved 2006-08-01.
- ↑ "Maharshi Karve Stree Shikshan Samstha". Retrieved 2006-08-01.[permanent dead link]
- All articles with dead external links
- భారతరత్న గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1858 జననాలు
- 1962 మరణాలు
- పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు
- సంఘసంస్కర్తలు
- 100 ఏళ్లకు పైగా జీవించిన వ్యక్తులు