Jump to content

నానాజీ దేశ్‌ముఖ్

వికీపీడియా నుండి
భారతరత్న, రాష్ట్ర ఋషి
నానాజీ దేశ్‌ముఖ్
2017 లో భారత తపాలా శాఖ విడుదల చేసిన తపాలా బిళ్ళ
భారత పార్లమెంటు సభ్యుడు
In office
1977–1979 [1]
అంతకు ముందు వారుచంద్ర భాల్ మణి తివారీ
తరువాత వారుచంద్ర భాల్ మణి తివారీ
నియోజకవర్గంబలరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం, ఉత్తర ప్రదేశ్
రాజ్యసభ సభ్యుడు
In office
1999–2005
నియోజకవర్గంనామినేట్ చేయబడినవాడు
వ్యక్తిగత వివరాలు
జననం
చండికాదాస్ అమృత్‌రావు దేశ్‌ముఖ్

(1916-10-11)1916 అక్టోబరు 11
కడోలీ, హింగోలీ, మహారాష్ట్ర, బ్రిటిష్ ఇండియా
మరణం2010 ఫిబ్రవరి 27(2010-02-27) (వయసు 93)
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనసంఘ్
కళాశాలబిర్లా కళాశాల (బిట్స్ పిలానీ)
పురస్కారాలుభారతరత్న (జనవరి 2019), పద్మవిభూషణ

చండికాదాస్ అమృతరావు దేశ్‌ముఖ్ (1916 అక్టోబరు 11 - 2010 ఫిబ్రవరి 27) "నేతాజీ దెశ్‌ముఖ్"గా సుపరితితుడు. అతను భారతదేశంలో సామాజిక ఉద్యమకారుడు. అతను విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వావలంబన రంగాలలో కృషిచేసాడు.అతను 1999లో పద్మవిభూషణ, 2019 జనవరిలో భారతరత్న పురస్కారాలను భారత ప్రభుత్వంచే అందుకున్నాడు. అతను భారతీయ జనసంఘ్ నాయకుడు, భారత రాజ్యసభ సభ్యుడు.[2][3]

ప్రారంభ జీవితం

[మార్చు]

నానాజీ మరాఠీ భాష మాట్లాడే దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో 1916 అక్టోబరు 11న వషిమ్‌ జిల్లాలోని కడోజీ అనే చిన్న పట్టణంలో జన్మించాడు.[4][5] అతనికి విద్యాభ్యాసం పొందాలనే అభిలాష ఎక్కువగా ఉన్నప్పటికీ డబ్బు లేకపోవడంతొ అది సాధ్యం కాలేదు. అందువలన అతడు కాయగూరల దుకాణంలో పనిచేసి డబ్బు సంపాదించి తన విద్యాధ్యయనానికి ఖర్చు చేసాడు. అతను బాల గంగాధర్ తిలక్కు ప్రభావితుడైనాడు.[6]

అతను "సికార్"కు చెందిన రావురాజా గారి ఉపకార వేతనంతో సికార్ లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. అతను బిర్లా కళాశాల (ప్రస్తుతం బిట్స్ పిలానీ) లో చదివాడు. అదే సంవత్సరం అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) లో చేరాడు.[7]

The Prime Minister, Shri Narendra Modi paying floral tributes to Nanaji Deshmukh, on the Birth Centenary Celebrations of Nanaji Deshmukh, at IARI, New Delhi on 11 October 2017

అతను మహారాష్ట్రలో జన్మించినప్పటికీ అతని కార్యకలాపాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగేవి.

అతని అంకితభావం చూసిన ఆర్.ఎస్.ఎస్. సరసంఘన్‌చాలక్ అయిన ఎం.ఎస్.గోల్వంకర్ అతనిని ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ కు ప్రచారక్ గా పంచాడు. అతను ఉరప్రదేశ్ మొత్తానికి సహ ప్రాంత ప్రచారక్ గా ఎదిగాడు.

ఆర్.ఎస్.ఎస్.కార్యకర్తగా

[మార్చు]
The Vice President, Bhairon Singh Shekhawat presenting Shri Naresh Samata Puraskar to Shri Nanaji Deshmukh, in New Delhi on 8 April 2006.

అతను భారత స్వాతంత్ర్యసమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జాతీయవాదానికి ప్రభావితుడై సామాజిక సేవలు, ఉద్యమాలపై అభిరుచిని పెంచుకున్నాడు. అతని కుటుంబంతో డా. కేశవరావు బలిరాం హెగ్డేవార్ కు నిత్య సంబంధాలు ఉండేవి. హెగ్డేవార్ అతని సేవాదృక్పధాన్ని గుర్తించి అతనిని ఆర్.ఎస్.ఎస్ శాఖలలో చేరేందుకు ప్రోత్సాహాన్ని అందించాడు.[8]

1940లో హెగ్డేవార్ మరణం తరువాత అనేక మంది యువకులు అతని ప్రభావం వలన మహారాష్ట్రలోని ఆర్.ఎస్.ఎస్ లో చేరారు. తమ జీవితమంతా దేశసేవ కోసం ఉత్సుకతతో ఆర్.ఎస్.ఎస్.లోచేరిన యువకులతో పాటు దేశ్‌ముఖ్ కూడా చేరాడు. అతనిని ఉత్తరప్రదేశ్ లో ప్రచారక్ గా ఆర్.ఎస్.ఎస్ పంపింది. ఆగ్రాలో అతను దీన్ దయాళ్ ఉపాద్యాయను మొదటిసారి కలిసాడు. తరువాత అతను గోరఖ్ పూర్ కు ప్రచారక్ గా వెళ్లాడు. అక్కడ అతను తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఆర్.ఎస్.ఎస్. భావజాలాన్ని పరిచయం చేయడం కోసం శ్రమించాడు. ఆ కాలంలో సంఘ్ లో నిధులు లేకపోవడం వలన రోజువారీ ఖర్చులకు కూడా సరిపోయినంత డబ్బు లేక సేవచేయడానికి కష్టంగా ఉండేది. అతను ధర్మశాలలలో ఉంటూ తన ప్రచారాన్ని కొససాగించాడు. ఒక ధర్మశాలలో వరుసగా మూడురోజుల కంటే ఎక్కువ ఉండరాదనే నియమం వల్ల వివిధ ధర్మశాలలకు మారుతూ తన సేవలను కొనసాగించాడు. చివరికి అతనికి బాబా రాఘవదాస్ తనకు కూడా వారితో పాటు భోజనం వండాలనే నిబంధనపై ఆశ్రయం కల్పించాడు.[9] మూడు సంవత్సరాలలో అతని కృషి ఫలించి సుమారు 250 సంఘ ప్రచారకులు గోరఖ్ పూర్ పరిసర ప్రాంతాలనుండి చేరారు. నానాజీ ఎల్లప్పుడూ విద్యకు అధిక ప్రాముఖ్యతనిచ్చేవాడు. అతను 1950లో భారతదేశంలో మొట్టమొదటి సారిగా గోరఖ్‌పూర్ లో "సరస్వతి శిశు మందిర్"ను స్థాపించాడు.[10][11]

1947లో ఆర్.ఎస్.ఎస్ "రాష్ట్రధర్మ", "పాంచజన్య" అనే రెండు జర్నల్స్ ను, "స్వదేశ్" అనే వార్తాపత్రికలను ప్రారంభించాలని నిర్ణయించింది. వాటికి భారత పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంపాదకునిగా, నానాజీ మేనేజింగ్ డైరక్టరుగా వ్యవహరించారు.

ప్రచురణలను బయటకు తీసుకురావడానికి సంస్థకు డబ్బు ఖర్చుపెట్టడం కష్టసాధ్యంగా ఉన్నందున ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ అది వారి కార్యక్రమాలను మందగించలేకపోయింది. వారి ప్రచురణలలోని బలమైన జాతీయ విషయాల వలన జనాదరణ, గుర్తింపు పొందాయి.[12]

మహాత్మాగాంధీ హత్య మూలంగా ఆర్.ఎస్.ఎస్. పై నిషేధం విధించడం మూలంగా వారి ప్రచురణలకు ఆటంకం ఏర్పడింది. ఈ నిషేధాన్ని మదిలో ఉన్న నేతాజీ వేరొక వ్యూహంలో భాగంగా అజ్ఞాత ప్రచురణలను నిర్వహించాడు.[13]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆర్.ఎస్.ఎస్ పై నిషేధం ఎత్తివేసిన తరువాత అది ఒక రాజకీయ సంస్థ భారతీయ జనసంఘ్ ను ఏర్పరచాలని నిర్ణయించింది. దేశ్ ముఖ్ భారతీయ జనసంఘ్ కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా శ్రీగురు చే నియమించబడ్డాడు. ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనసంఘ్ సంస్థను మూలాలనుండి అభివృద్ధి చేయడానికి యిదివరకు అతను ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ గా పనిచేయడం ఎంతో సహాయపడింది. 1957లో ఉత్తరప్రదేశ్ లోణి ప్రతీ జిల్లాలో కూడా జనసంఘ్ శాఖలు విస్తరించాయి. దీనికి నానాజీ కృషి ఎంతో ఉంది.

క్రమంగా జనసంఘ్ ఉత్తరప్రదేశ్ లో బలమైన శక్తిగా ఎదిగింది. 1967లో బి.జె.ఎస్ ఉత్తరప్రదేశ్ లోని చౌదరి చరణ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగమయింది. చరణ్ సింగ్, రాం మనోహర్ లోహియా లతో మంచి సంబంధాలను కల్పించి ప్రభుత్వంలో భాగం పంచుకొనే కార్యక్రమంలో నానాజీ కీలక పాత్ర పోషించాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంలో వివిధ రాజకీయ నేపథ్యం కలిగిన నాయకులనూ ఒకే వేదికపైకి తేవడంలో దేశ్ ముఖ్ విజయవంతమైన పాత్ర పోషించాడు.

బలమైన రాజకీయ నయకుడైన ఉత్తరప్రదేశ్ పూర్వపు ముఖ్యమంత్రి చంద్రబాను గుప్తా తన రాజకీయ జీవితంలో తనను మూడుసార్లు బయటకు పంపించిన దేశ్ ముఖ్ తో పెద్ద సవాలును ఎదుర్కొన్నాడు.

ఒక సందర్భంగా దేశ్ ముఖ్ కాంగ్రెస్ చే నామినేట్‌చేయబడిన, గుప్తాకు యిష్టమైన వ్యక్తికి రాజ్యసభలో ఓడించడానికి వ్యూహానికి పథకం వేసాడు. గుప్తా తనకు తాను 1957లో లక్నో నుండి ఎన్నికలకు పోటీచేసాడు. నానాజీ సోషలిస్టు గ్రూపులతో పొత్తు పెట్టుకొని, బాబూ త్రిలోకీ సింగ్ కు సహాయం చేసి గుప్తాపై విజయం సాధించేటట్లు చేసాడు. మరొక సారి ఉత్తరప్రదేశ్ లోని మాదహా నియోజకవర్గంలో కూడా గుప్తా ఓడిపోవడానికి నానాజీ వ్యూహం ఫలించింది.

దీన్ దయాళ్ ఉపాద్యాయ కృషి, అటల్ బిహారి వాజిపేయి నైపుణ్యం, దేశ్‌ముఖ సంస్థాగత పనుల మూలంగా ఉత్తరప్రదేశ్ లో బి.జె.ఎస్ బలపడి రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించింది. దేశ్ ముఖ్ తనపార్టీ నేతల తోనే కాకుండా ప్రత్యర్థి పార్టీ నేతలతో కూడా మంచి సంబంధాలను కలిగి ఉండేవాడు. దేశముఖ్ చేతిలో గుప్తా అనేక అపజయాలను పొందినప్పటికి అతనికి గౌరవించి అతనిని "నానా పదన్విస్"గా పిలిచేవాడు. రాం మనోహర్ లోహియాతో అతని సంబంధం దేశ రాజకీయాలలో మార్పులను తెచ్చి పెట్టింది. అతను మొట్టమొదటి సారిగా దీన్ దయాళ్ ఉపాద్యాయను కలిసిన బి.జె.ఎస్ కార్యకర్త సమ్మేళనానికి రాం మనోహర్ లోహియాకు కూడా ఆహ్వానించాడు. ఆ సమావేశం తరువాత బి.జె.ఎస్ ను కాంగ్రెస్ అరాచకాలను బహిర్గతం చేస్తున్న సోషలిస్టు పార్టీలకు దగ్గరయింది.

అతను ఆచార్య వినోభాభావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలోకూడా పాల్గొన్నాడు.[10] రెండు నెలలపాటు వినోభాబావేతో కలసి గడిపిన తరువాత ఆ ఉద్యమం విజయానికి ప్రభావితుడైనాడు.

ప్రముఖ సామాజిక కార్యకర్త స్వాతంత్ర్య సమరయోధుడు జయప్రకాష్ నారాయణ్ నాడు ఇందిరా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమంలో నానాజీ కీలక పాత్ర పోషించాడు. లోక్‌సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శిగా నానాజీ దేశ్‌ముఖ్ జయప్రకాష్ నారాయణ్‌కు కుడిభుజంగా ఉండి పనిచేశాడు. 1975 జూలై 29న జరిగిన పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో నానాజీ దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేయడం జరిగింది. అంతకుముందుఎమర్జెన్సీ సమయంలో సుబ్రహ్మణియన్ స్వామి, ఎంఎల్ ఖురానా, రవీంద్రవర్మ, దత్తోపంత్ తెంగడి లాంటి నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని సూచించాడు. దీనికి ఆపరేషన్ టేక్ఓవర్ అని పేరు పెట్టి పలు రాష్ట్ర రాజధానుల్లో ఆయన పర్యటించాడు. ఆ తర్వాత 1975 జూలై 29లో నానాజీని పోలీసులు అరెస్టు చేశారు. జైల్లో 17 నెలల పాటు గడిపిన నానాజీ అతని మిత్రుడు ప్రముఖ జాతీయపత్రిక అధినేత రామ్‌నాథ్ గోయెంకా తన విడుదలకు ఇందిరాగాంధీతో చర్చలు జరిపి సక్సెస్ అయ్యారని చెప్పాడు. 1977లో తను ఎన్నికల్లో నిలబడాల్సిందిగా రామ్‌నాత్ గోయెంకా సలహా ఇచ్చాడు.[14]

పురస్కారాలు

[మార్చు]

అతనికి 2019 (మరణానంతరం) భారత ప్రభుత్వం భారతరత్నపురస్కారాన్ని అందించింది. అంతకు ముందు 1999లో పద్మవిభూషణ పురస్కరాన్ని పొందాడు.[15]

మరణం

[మార్చు]

నానాజీ దేశ్‌ముఖ్ తన 95 ఏళ్ల వయస్సులో 2010 ఫిబ్రవరి 27లో కన్నుమూశాడు.[10]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha condoles Nanaji Deshmukh's death. The Hindustantimes. Retrieved 10 March 2010.
  2. "Bharat Ratna for Pranab Mukherjee, Nanaji Deshmukh and Bhupen Hazarika". Times Now. 25 January 2019. Archived from the original on 31 ఆగస్టు 2020. Retrieved 25 January 2019.
  3. "Who was Nanaji Deshmukh?". The Indian Express. Retrieved 11 October 2017.
  4. New Quest, Issues 25–30. The Indian Association for Cultural Freedom. p. 8.
  5. Christophe Jaffrelot (2010). Religion, Caste, and Politics in India. Primus Books. p. 194. ISBN 978-1849041386.
  6. "BJP Today, Volume 14". Bhartiya Janata Party. 2005. p. 459. Born on October 11,1916 in a modest Maharashtrian family at Kadoli, a small town in Parbhani district, Nanaji had little money to pay for his tuition fees and books. But he had such a burning zeal and desire for education and knowledge that he did not shy away from working as a vendor and selling vegetables to raise money for realising his objective. Nanaji was deeply inspired by Lokamanya Tilak and his nationalist ideology {{cite magazine}}: Cite magazine requires |magazine= (help)
  7. Preeti Trivedi. Architect of A Philosophy. Bhartiya Sahitya Inc. p. 37. Retrieved 1 December 2017.
  8. BJP Today, Volume 14. Bharatiya Janata Party. 2005. p. 459. Nanaji family was in close contact with Dr. Hedgewar who was a regular visitor to the family of Nanaji.
  9. Anil Kumar 'Salil'. Pandit Deen Dayal Upadhyaya. Prabhat Prakashan. p. 5.
  10. 10.0 10.1 10.2 Social activist Nanaji Deshmukh dead Archived 2016-03-05 at the Wayback Machine. The New Indian Express. 28 February 2010
  11. Christophe Jaffrelot (2010). Religion, Caste, and Politics in India. Primus Books. p. 193. ISBN 978-1849041386.
  12. Dattopant Bapurao Thengadi (1988). Pandit Deendayal Upadhyaya: An inquest, introductory part. Suruchi Prakashan. p. 9. its auspices were published the magazine 'Rashtra Dharma', the weekly ' Panchajanya' and the daily 'Swadesh'. Of these the last two were edited by Panditji. Nanaji Deshmukh was the managing director of publication
  13. BJP Today, Volume 14. Bharatiya Janata Party. 2005. p. 459. A different strategy was adopted keeping the ban in mind and Nanaji was the brain behind underground publication work by the RSS those days.
  14. "'భారత రత్నం' నానాజీ దేశ్‌ముఖ్: ఎవరీ వ్యక్తి.. ఆయన దేశానికి అందించిన సేవలేంటి..?".
  15. Utilise human resources judiciously: Kalam Archived 2012-10-23 at the Wayback Machine. Times of India. 19 October 2001

బయటి లంకెలు

[మార్చు]