ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
c. 1890 – 1988

Leader of the non-violent independence movement in British India's Northwest Frontier, known as the Frontier Gandhi.
ఇతర పేర్లు: బాద్ షాహ్ ఖాన్
జన్మస్థలం: ఉస్మాన్ జయీ, చర్సద్దా, బ్రిటిషు ఇండియా
నిర్యాణ స్థలం: పెషావర్, పాకిస్తాన్
ఉద్యమం: భారత స్వాతంత్ర్య ఉద్యమం
ప్రధాన సంస్థలు: ఖుదాయి ఖిద్మత్‌గార్, జాతీయ అవామీ పార్టీ

ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (పష్తో/ఉర్దూ: خان عبد الغفار خان) (జననం : హష్త్ నగర్ (ఉస్మాన్ జయీ, పెషావర్), వాయవ్య సరిహద్దు రాష్ట్రం, బ్రిటిషు ఇండియా, జననం 6 ఫిబ్రవరి, 1890 – మరణం పెషావర్, NWFP, పాకిస్తాన్, 20 జనవరి 1988.

బాద్షా ఖాన్ గా సరిహద్దు గాంధీ గా పేరుగాంచాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. భారతరత్న పురస్కారమును పొందిన తొలి భారతేతరుడు. "ఎర్రచొక్కాల ఉద్యమం" ప్రారంభించిన ప్రముఖుడు. ఇతని అనుచరులను "ఖుదాయీ ఖిద్మత్‌గార్" (భగవత్సేవకులు) అని పిలిచేవారు. ఇతను పష్తో లేదా పక్తూనిస్తాన్ కు చెందిన రాజకీయ, ధార్మిక నాయకుడు.

ఖుదాయీ ఖిద్మత్‌గార్ (భగవత్సేవకులు)
మహాత్మాగాంధీతో బాద్షా ఖాన్.‎
కేబినెట్ మిషన్ తరువాత, గఫార్ ఖాన్, నెహ్రూ నడచి వచ్చే దృశ్యం.

భారత విభజనకు తీవ్రంగా వ్యతిరేకించినవాడు. భారత రాజకీయనాయకులతో కలసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. భారతదేశ రాజకీయనాయకులతో మరీ ముఖ్యంగా గాంధీ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీతో కలసి పోరాటం సలిపాడు. సరిహద్దు ప్రాంతపు ముస్లింలీడర్లు, ఇతను ముస్లింల ద్రోహి అని 1946 లో హత్యా ప్రయత్నం చేసారు. దేశ విభజనను ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రయత్నాలు చేయలేదు. ఇటు సరిహద్దు ప్రాంతవాసులకు ద్వేషి అయ్యాడు, అటు దేశ విభజన ఆగలేదు. అబ్దుల్ గఫార్ ఖాన్ పరిస్థితి అగమ్యగోచరమయ్యింది. బాద్షా ఖాన్, అనుయాయులు, భారత పాకిస్తాన్ లు మమ్మల్ని తీవ్రంగా ద్రోహం చేశాయని భావించారు. కాంగ్రెస్ పార్టీని, భారత రాజకీయ నాయకులను ఉద్దేశించి బాద్షాహ్ ఖాన్ అన్న ఆఖరి మాటలు, "మీరు మమ్మల్ని తోడేళ్ళ ముందు విసిరేసారు" .[1]

మూలాలు[మార్చు]

Footnotes[మార్చు]

బయటి లింకులు[మార్చు]