భారతరత్న
భారతరత్న | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | జాతీయ పౌరపురస్కారం | |
మొదటి బహూకరణ | 1954 | |
క్రితం బహూకరణ | 2024
| |
మొత్తం బహూకరణలు | 45 | |
బహూకరించేవారు | భారత ప్రభుత్వం | |
ముఖభాగం | రావి ఆకుపై సూర్యుడి చిత్రం, దేవనాగరి లిపిలో "భారతరత్న" అనే అక్షరాలు | |
వెనుకవైపు | ప్లాటినం భారత జాతీయ చిహ్నందానిక్రింద దేవనాగరి లిపిలో వ్రాయబడ్డ సత్యమేవ జయతే అనే అక్షరాలు | |
రిబ్బను |
భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రధానం చేస్తారు. ఇప్పటివరకు నలభై ఐదు మందికి ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది.
ఎలాంటి జాతి, ఉద్యోగం, స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారగ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది.
భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది (మొదటిది ఆరూ- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాన మంత్రి, ముఖ్య న్యాయాధీశులు). కానీ ఈ గౌరవం వలన ఎలాంటి అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులూ రావు.
ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధిగా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987), నెల్సన్ మండేలా (1990) ఉన్నారు.
చరిత్ర
[మార్చు]1954, జనవరి 2వ తేదీన రెండు పౌర పురస్కారాలను ప్రారంభిస్తున్నట్లు భారత రాష్ట్రపతి యొక్క కార్యదర్శి కార్యాలయం నుండి ఒక ప్రకటన జారీ అయ్యింది. వాటిలో మొదటిది అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కాగా రెండవది దానికన్నా తక్కువ స్థాయి గల మూడంచెల పద్మవిభూషణ్ పురస్కారం. పద్మవిభూషణ్ పురస్కారం ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్గాలుగా విభజించారు[1]. 1955, జనవరి 15న పద్మవిభూషణ్ పురస్కారాన్ని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు వేర్వేరు పురస్కారాలుగా పునర్వర్గీకరించారు[2].
భారతరత్న పురస్కారం కేవలం భారతీయులకే ప్రధానం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరీసాకు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు 1987లో, నెల్సన్ మండేలాకు 1990లో ప్రధానం చేశారు[3]. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్‌కు తన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో ఇతనే అతి పిన్నవయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు.[4] సాధారణంగా భారతరత్న పురస్కార ప్రధాన సభ రాష్ట్రపతి భవన్, ఢిల్లీలో జరుగుతుంది. కానీ 1958, ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధొండొ కేశవ కర్వేకు అతని 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇతడు జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్నవారిలో అతి పెద్ద వయస్కుడు.[5] 2015 నాటికి ఈ పురస్కారాన్ని మొత్తం 45 మందికి అందజేయగా వారిలో 12 మందికి మరణానంతరం లభించింది[6].
చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు చేయబడింది[7]. మొదటి సారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977, జూలై 13వ తేదీన అన్ని పౌరపురస్కారాలను రద్దుచేశారు. తరువాత ఈ పురస్కారాలు 1980, జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత పునరుద్ధరించబడ్డాయి[8][9]. 1992లో ఈ పురస్కారాల "రాజ్యాంగ సాధికారత"ను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో అత్యున్నత న్యాయస్థానం ఈ పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది[10][11].
నిబంధనలు
[మార్చు]భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి, లింగ బేధాలను పాటించకుండా ప్రధానం చేయబడుతుంది.[12] 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసినవారికి ఇచ్చేవారు.[1] 2011, డిసెంబరులో ఈ నిబంధనలను మార్చి "మానవజాతి అభివృద్ధికి పాటుపడే ఏ రంగానికైనా" అనే పదాన్ని చేర్చారు.[13] 1954 నాటి నిబంధనలు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించడాన్ని అనుమతించేవి కావు. కానీ 1955 జనవరిలో ఈ నిబంధనను సడలించారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మొట్టమొదటి సారి మరణానంతరం ఈ పురస్కారాన్ని పొందాడు.[2][14] ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేనప్పట్టికీ, ప్రధానమంత్రి మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని మాత్రం సిఫారసు చేయవచ్చు. కానీ 1999లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రధానం చేశారు. ఈ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక "సనదు(పట్టా)", ఒక పతకం ప్రధానం చేస్తాడు. ఈ పురస్కారం క్రింద ఎలాంటి నగదు మంజూరు చేయరు. భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 18 (1) ప్రకారం ఈ పురస్కార గ్రహీతలెవ్వరూ తమ పేరు ముందు, వెనుక భారతరత్న అని పేర్కొనరాదు,[12][15] భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది.[16]
భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఎన్ని ప్రకటనలు వెలువడినా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రచురించే గెజిట్‌లో అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు.[1][2]
నిర్దేశాలు
[మార్చు]1954 నిర్దేశాల ప్రకారం 1 3⁄8 ఇంచుల (35మిల్లీ మీటర్ల) వ్యాసార్థం కలిగిన వృత్తాకార బంగారు పతకాన్ని ఈ పురస్కార సమయంలో బహూకరిస్తారు. పతకం ముఖభాగంలో సూర్యుని బొమ్మ ఉండి, కింది భాగంలో వెండితో "భారత రత్న" అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. వెనకవైపు మధ్యభాగంలో ప్లాటినం లోహంలో భారత చిహ్నం, కింది భాగంలో వెండితో భారత జాతీయ నినాదం "సత్యమేవ జయతే" అని రాసి ఉంటుంది.[1]
ఒక ఏడాది తరువాత దీని రూపాన్ని మార్చారు. అప్పుడు మార్చిన దానినే ఇప్పటికీ వాడుతున్నారు. ఇప్పటి నకలు ప్రకారం రావి ఆకు ఆకారంలో ఉండి 2 5⁄16 ఇంచులు (59 మి.మీ.) పొడవు, 1 7⁄8 ఇంచుల (48 మి.మీ.) వెడల్పు and 1⁄8 ఇంచుల (మి.మీ.) మందం కలిగి ఉండి ప్లాటినం చట్రం కలిగి ఉంటుంది. పతకం ముందుభాగంలో మధ్యలో సూర్యుని బొమ్మ చిత్రీకరించబడి ఉంటుంది. ప్లాటినం లోహంతో తయారు చేసిన ఈ బొమ్మ 5⁄8 ఇంచుల (16 మి.మీ.) వ్యాసార్థం కలిగి ఉండి, సూర్యుని కేంద్ర బిందువు నుంచి 5⁄6 ఇంచులు (21 మి.మీ.) నుంచి 1⁄2 దాకా (13 మి.మీ.) కిరణాలు విస్తరించి ఉంటాయి. ముందుభాగంలో భారతరత్న అన్న పదాలు, వెనుక వైపు భారత జాతీయ చిహ్నం, నినాదం సత్యమేవ జయతే 1954 డిజైన్ లోనే ఉంచేశారు. మెడలో వేయడానికి వీలుగా 2 ఇంచ్ వెడల్పు, 51 ఎం.ఎం. గల తెలుపు రిబ్బన్ ను పతకానికి కడతారు.[2][7][17] 1957లో, వెండి పూత మార్చి ఎండిన కాంస్యం వాడటం ప్రారంభించారు.[1][18] భారత రత్న పతకాలను కలకత్తాలోని అలిపోర్ ప్రభుత్వ ముద్రణశాలలో ముద్రిస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ, పరమ వీర చక్ర, వంటి పౌర, సైనిక పురస్కారలకు ఇచ్చే పతకాలు కూడా ఇక్కడే ముద్రిస్తుంటారు.[19]
వివాదాలు
[మార్చు]భారతరత్న పురస్కార ప్రధానంపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు నమోదు కాబడ్డాయి[10][20][21][22][23].
- సుభాష్ చంద్రబోస్ (1992)
1992, జనవరి 23వ తేదీన రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి సుభాష్ చంద్రబోస్‌కు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో ఈ పురస్కారాన్ని ఉపసంహరించుకోవాలని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది.[20] 1945, ఆగష్టు 18 నాడు సుభాష్ చంద్రబోస్ మరణించాడనే విషయాన్ని భారతప్రభుత్వం ఇంతవరకూ అధికారికంగా అంగీకరించలేదని, అలాంటి సమయంలో అతనికి మరణానంతర పురస్కారం ఎలా ఇస్తారని ఫిర్యాది ప్రశ్నించాడు. సుభాస్ చంద్రబోస్ ఆచూకీని షానవాజ్ కమిటీ (1956), ఖోస్లా కమిషన్ (1970) నివేదికల ఆధారంగా కనిపెట్టాలని ఫిర్యాది తన వ్యాజ్యంలో అభ్యర్థించాడు. సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులు ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేశారు.[24][25]
సుజాత వి.మనోహర్, జి.బి.పట్నాయక్‌లతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ప్రత్యేక విభాగ ధర్మాసనం ఈ కేసును పరిశీలిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాల ప్రధానంలో కొన్ని నిబంధనలను పాటించడం లేదని గుర్తించింది. పురస్కార గ్రహీతల పేర్లు గెజిట్ ఆఫ్ ఇండియాలో తప్పక ప్రచురించాలని, రాష్ట్రపతి అజమాయిషీలో ఒక రిజిస్టర్ నిర్వహించాలనీ, దానిలో ఈ పురస్కార గ్రహీతల పేర్లు నమోదు చేయాలని స్పష్టం చేసింది.[1] అంతే కాక అప్పటి రాష్ట్రపతులు ఆర్.వెంకట్రామన్ (1987-92), శంకర్ దయాళ్ శర్మ (1992-97)లు వారి సంతకం, ముద్రలతో కూడిన "సనదు" (పట్టా)ను ప్రధానం చేయలేదని గుర్తించింది.[24]
1997, ఆగష్టు 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇస్తూ, ఈ పురస్కార ప్రధానం జరగలేదు కాబట్టి, రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి వెలువడిన ప్రకటనను కొట్టివేసింది. బోసు మరణం గురించి కాని, మరణానంతర ప్రస్తావన గురించి కాని ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించింది.[24];[26] "బిరుదులు"గా పౌరపురస్కారాలు (1992)
1992లో మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఒకటి, కేరళ ఉన్నత న్యాయస్థానంలో మరొకటి రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇద్దరు ఫిర్యాదుదారులూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం ఈ పౌరపురస్కారాలను బిరుదులుగా పరిగణించడాన్ని సవాలు చేశారు. 1992, ఆగష్టు 25వ తేదీన మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను జారీ చేస్తూ అన్ని పౌరపురస్కారాలను తాత్కాలికంగా రద్దు చేసింది[10]. అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసుల గురించి ఎ.ఎం.అహ్మది, కుల్‌దీప్ సింగ్, బి.పి.జీవన్‌రెడ్డి, ఎన్.పి.సింగ్, ఎస్.సాఘిర్ అహ్మద్ అనే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక విభాగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక విభాగ ధర్మాసనం 1995, డిసెంబరు 15న ఈ పౌరపురస్కారాలను పునరుద్ధరిస్తూ, ఈ పౌరపురస్కారాలు "బిరుదులు"గా పరిగణించరాదని పేర్కొంది.[11]
- సి.ఎన్.ఆర్.రావు, సచిన్ టెండూల్కర్ (2013)
సి.ఎన్.ఆర్.రావు, సచిన్ టెండూల్కర్‌లకు భారతరత్న పురస్కారం ఇస్తున్నట్లు 2013, నవంబరులో ప్రకటన వెలువడగానే అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయబడ్డాయి. సి.ఎన్.ఆర్. రావుకు వ్యతిరేకంగా వేయబడిన పిల్‌లో హోమీ భాభా, విక్రం సారాభాయ్ వంటి అనేక శాస్త్రజ్ఞులు రావు కంటే ఎక్కువ సేవలను అందించారని, 1400 పరిశోధనా పత్రాలను ప్రచురించినట్లు రావు చేస్తున్న దావా "భౌతికంగా అసాధ్యం" అని వాదించారు. రావు "భావ చౌర్యాని"కి పాల్పడినట్లు నిరూపితమైనదని, అతనికి భారతరత్న పురస్కారం ప్రధానం చేయరాదని, ఈ ప్రతిపాదనను కొట్టివేయాలని కోరారు.[21] టెండూల్కర్‌కు వ్యతిరేకంగా వేయబడిన వ్యాజ్యంలో అతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేయబడిన సభ్యుడని, అతనికి భారతరత్న పురస్కార నిర్ణయం ఆ సమయంలో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరాంలలో జరుగుతున్న ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.[22] టెండూల్కర్‌కు వ్యతిరేకంగా వేసిన మరొక వ్యాజ్యంలో భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆరోపించారు.[23][a]
2013, డిసెంబరు 4న ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరుగని రాష్ట్రాలలోని ప్రజలకు పౌరపురస్కారాలు ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం క్రింద రాదని పేర్కొంటూ వినతిని తిరస్కరించింది.[27] మిగిలిన ఉన్నత న్యాయస్థానాలు కూడా సి.ఎన్.ఆర్.రావు, టెండూల్కర్‌లకు వ్యతిరేకంగా వేసిన వ్యాజ్యాలను తిరస్కరించాయి.[28]
విమర్శలు
[మార్చు]1988లో చలనచిత్రనటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌కు భారతరత్న ప్రకటించడం త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికే అని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీపై విమర్శలు వచ్చాయి.[29][30]బి.ఆర్.అంబేద్కర్, వల్లభభాయ్ పటేల్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల కన్నా ముందే ఎం.జి.రామచంద్రన్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించడం విమర్శలకు దారితీసింది.[31]రవిశంకర్ ఈ పురస్కారానికై పైరవీలు చేశాడని,[32] 1977లోకె.కామరాజ్‌కు ఈ పురస్కారాన్ని ఇవ్వాలని ఇందిరా గాంధీ నిర్ణయించడం తమిళ ఓటర్లను ప్రభావితం చేయడానికి అనే ఆరోపణలు వినిపించాయి. దళితులను ప్రసన్నం చేసుకోవడానికి వి.పి.సింగ్ అంబేద్కరుకు మరణానంతరం భారతరత్న ఇప్పించాడని విమర్శలు వెలువడ్డాయి.[33][29]
భారత స్వాతంత్ర్య సంగ్రామానికంటే, అంటే 1947 కంటే ముందు, లేదా ఈ పురస్కారం ప్రారంభించిన ఏడాది 1954 కంటే ముందు మరణించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రకటించడాన్ని పలువురు చరిత్రకారులు తప్పుబట్టారు.[34] ఇటువంటి ప్రధానాలు మౌర్య చక్రవర్తి అశోకుడు,[35] మొఘల్ చక్రవర్తి అక్బర్, మరాఠా వీరుడు శివాజీ, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్,[36] హిందూ ఆధ్యాత్మికవాది స్వామి వివేకానంద,,[37] స్వాతంత్ర్య యోధుడు బాలగంగాధర తిలక్[38] వంటి అనేకులకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్లకు వీలు కల్పించాయి. అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు 1991లో వల్లభభాయి పటేల్‌కు అతడు మరణించిన 41 సంవత్సరాల తర్వాత ఈ పురస్కారం ప్రకటించడాన్ని, 1945 నుండి ఆచూకీ లేని సుభాష్ చంద్రబోస్‌కు 1992లో ప్రకటించడాన్ని విమర్శించారు.[38][39] అలాగే 2015లో నరేంద్ర మోడీ 1946లో మరణించిన మదన్ మోహన్ మాలవ్యాకు ఇవ్వాలని నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనార్థన్ ద్వివేది తప్పుపట్టాడు. మాలవ్యా వారణాశిలో ఎక్కువగా పనిచేశాడని, మోడీ వారణాశి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు కావాలని ఉద్దేశ పూర్వకంగా మాలవ్యాను ఈ పురస్కారానికి ఎంపిక చేశాడని ఆరోపించాడు.[40]
కొందరిని ప్రపంచం గుర్తించిన తర్వాత కాని ఈ పురస్కారానికి ఎంపిక చేయలేదనే విమర్శలు వెలువడ్డాయి.[41] మదర్ థెరెసాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన తరువాతి సంవత్సరం భారతరత్న ప్రకటించారు. సత్యజిత్ రేకు ఆస్కార్ పురస్కారం అందిన తర్వాతనే భారతరత్న ప్రకటించారు.[42][43] అలాగే అమర్త్య సేన్‌కు నోబెల్ బహుమతి వచ్చిన తర్వాతనే భారతరత్న ఇవ్వబడింది.[44][45]
ప్రముఖ డిమాండ్లు
[మార్చు]నిబంధనల ప్రకారం భారతరత్న పురస్కారానికి రాష్ట్రపతికి, ప్రధానమంత్రి మాత్రమే సిఫార్సులు చేసే హక్కు ఉంది.[12] వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రముఖ నాయకుల పేర్లను ఎన్నోసార్లు సిఫార్సుకు డిమాండ్లు చేస్తూనే ఉన్నాయి. 2008 జనవరిలో, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్.కె.అద్వానీ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయికు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు.[46][47] ఇది జరిగిన వెంటనే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) తమ నాయకుడు, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసుకు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. బసు భారతదేశంలోనే అత్యంత ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకునిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి. అయితే తనకు భారత రత్న వద్దనీ, అందుకు తాను అర్హుణ్ణి కాదనీ, దాని వల్ల ఆ పురస్కారానికి గౌరవం తగ్గుతుంది అని వ్యాఖ్యానించారు.[48][49] తెలుగు దేశం పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ వంటి ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా తమ తమ నాయకులైన ఎన్.టి.రామారావు, కాన్షీరామ్, ప్రకాష్ సింగ్ బాదల్ లకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.[50] 2015 సెప్టెంబరులో, ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన శివసేన, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్కు పురస్కారం ఇవ్వాలని డిమాండు చేసింది. ఆయనను మునుపటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని పేర్కొంది. అయితే వినాయక్ కుటుంబసభ్యులు ఈ అభ్యర్థనను తాము సమర్ధించబోమనీ, వినాయక్ కు పురస్కారం రావాలని తాము డిమాండు చేయట్లేదనీ, స్వాతంత్ర్యం కోసం దేశానికి ఆయన చేసిన సేవలను భారతరత్న ఇవ్వకపోతే జాతి మరచిపోదని స్పష్టం చేయడం విశేషం.[51]
వ.సంఖ్య | పేరు | సంవత్సరం | |
1 | సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) | 1954 | |
2 | చక్రవర్తుల రాజగోపాలాచారి (1878-1972) | 1954 | |
3 | సి.వి.రామన్ (1888-1970) | 1954 | |
4 | భగవాన్ దాస్ (1869-1958) | 1955 | |
5 | మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) | 1955 | |
6 | జవహర్ లాల్ నెహ్రూ (1889 -1964) | 1955 | |
7 | గోవింద్ వల్లభ్ పంత్ (1887-1961) | 1957 | |
8 | ధొండొ కేశవ కార్వే (1858-1962) | 1958 | |
9 | బి.సి.రాయ్ (1882-1962) | 1961 | |
10 | పురుషోత్తమ దాస్ టాండన్ (1882-1962) | 1961 | |
11 | రాజేంద్ర ప్రసాద్ (1884-1963) | 1962 | |
12 | జాకీర్ హుస్సేన్ (1897-1969) | 1963 | |
13 | పాండురంగ వామన్ కాణే (1880-1972) | 1963 | |
14 | లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (1904-1966) | 1966 | |
15 | ఇందిరాగాంధీ (1917-1984) | 1971 | |
16 | వి.వి.గిరి (1894-1980) | 1975 | |
17 | కె.కామరాజు (మరణానంతరం) (1903-1975) | 1976 | |
18 | మదర్ థెరీసా (1910-1997) | 1980 | |
19 | వినోబా భావే (మరణానంతరం) (1895-1982) | 1983 | |
20 | ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1890-1988) | 1987 | |
21 | ఎం.జి.రామచంద్రన్ (మరణానంతరం) (1917-1987) | 1988 | |
22 | బి.ఆర్.అంబేద్కర్ (మరణానంతరం) (1891-1956) | 1990 | |
23 | నెల్సన్ మండేలా (జ. 1918) | 1990 | |
24 | రాజీవ్ గాంధీ (మరణానంతరం) (1944-1991) | 1991 | |
25 | సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం) (1875-1950) | 1991 | |
26 | మొరార్జీ దేశాయి (1896-1995) | 1991 | |
27 | మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం) (1888-1958) | 1992 | |
28 | జె.ఆర్.డి.టాటా (1904-1993) | 1992 | |
29 | సత్యజిత్ రాయ్ (1922-1992) | 1992 | |
30 | సుభాష్ చంద్ర బోస్ (1897- ------) (తరువాత ఉపసంహరించబడింది) | 1992 | |
31 | ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (జ. 1931-2015) | 1997 | |
32 | గుర్జారీలాల్ నందా (1898-1998) | 1997 | |
33 | అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (1906-1995) | 1997 | |
34 | ఎం.ఎస్.సుబ్బలక్ష్మి (1916-2004) | 1998 | |
35 | సి.సుబ్రమణ్యం (1910-2000) | 1998 | |
36 | జయప్రకాశ్ నారాయణ్ (1902-1979) | 1998 | |
37 | రవి శంకర్ (జ. 1920) | 1999 | |
38 | అమర్త్య సేన్ (జ. 1933) | 1999 | |
39 | గోపీనాథ్ బొర్దొలాయి (జ. 1927) | 1999 | |
40 | లతా మంగేష్కర్ (జ. 1929) | 2001 | |
41 | బిస్మిల్లా ఖాన్ (జ 1916) | 2001 | |
42 | భీమ్ సేన్ జోషి (జ. 1922) | 2008 | |
43 | సచిన్ టెండుల్కర్ | 2014 | |
44 | సి. ఎన్. ఆర్. రావు | 2014 | |
45 | మదన్ మోహన్ మాలవ్యా | 2015 | |
46 | అటల్ బిహారీ వాజపేయి | 2015 | |
47 | ప్రణబ్ ముఖర్జీ | 2019 | |
48 | నానాజీ దేశ్‌ముఖ్ | 2019 | |
49 | భూపెన్ హజారిక | 2019 | |
50 | కర్పూరీ ఠాకూర్ (మరణానంతరం) (1924 - 1988) | 2024[52] | |
51 | లాల్ కృష్ణ అద్వానీ | 2024[52] | |
52 | యం.యస్.స్వామినాధన్ (మరణానంతరం) (1925 - 2023) | 2024[52] | |
53 | చౌదరి చరణ్ సింగ్ (మరణానంతరం) (1902 - 1987) | 2024[52] | |
54 | పి.వి. నరసింహారావు (మరణానంతరం) (1921 - 2004) | 2024[52] |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Lal, Shavax A. (1954). "The Gazette of India—Extraordinary—Part I" (PDF). The Gazette of India. The President's Secretariat (published 2 January 1954): 2. Archived from the original (PDF) on 14 May 2014. Retrieved 12 May 2014.
The President is pleased to institute an award to be designated Bharat Ratna and to make the following Regulations
- ↑ 2.0 2.1 2.2 2.3 Ayyar, N. M. (1955). "The Gazette of India—Extraordinary—Part I" (PDF). The Gazette of India. The President's Secretariat (published 15 January 1955): 8. Archived from the original (PDF) on 18 May 2014. Retrieved 18 May 2014.
The President is pleased to make the following revised regulations for the award of the decoration Bharat Ratna in supersession of those published in Notification No. 1-Pres./54, dated the 2nd January, 1954
- ↑ Guha 2001, p. 176.
- ↑ "Tendulkar receives Bharat Ratna". ESPNcricinfo. 4 February 2014. Archived from the original on 26 June 2014. Retrieved 20 May 2014.
- ↑ "Profile: Dhondo Keshav Karve". Encyclopædia Britannica. Archived from the original on 1 December 2011. Retrieved 20 May 2014.
- ↑ 6.0 6.1 "List of recipients of Bharat Ratna (1954–2015)" (PDF). Ministry of Home Affairs (India). Archived from the original (PDF) on 9 ఫిబ్రవరి 2018. Retrieved 28 మార్చి 2018.
- ↑ 7.0 7.1 Hoiberg & Ramchandani 2000, p. 96.
- ↑ Madappa, K. C. (1980). "The Gazette of India—Extraordinary—Part I" (PDF). The Gazette of India. The President's Secretariat (published 25 జనవరి 1980): 2. Archived from the original (PDF) on 19 జూన్ 2016. Retrieved 19 జూన్ 2016.
The President is pleased to cancel the President's Secretariat Notification No. 65-Pres/77 dated the 8th August, 1977 by which the Civilian Awards "Bharat Ratna', 'Padma Vibhushan', 'Padma Bhushan' and 'Padma Shri' were cancelled and to direct that the said Awards shall be re-instituted with immediate effect.
- ↑ Bhattacherje 2009, p. A253.
- ↑ 10.0 10.1 10.2 Edgar 2011, p. C-105.
- ↑ 11.0 11.1 "Balaji Raghavan S. P. Anand Vs. Union of India: Transfer Case (civil) 9 of 1994". Supreme Court of India. 4 August 1997. Archived from the original on 19 May 2014. Retrieved 14 May 2014.
- ↑ 12.0 12.1 12.2 "Bharat Ratna Scheme" (PDF). Ministry of Home Affairs (India). Archived from the original (PDF) on 9 ఫిబ్రవరి 2018. Retrieved 28 మార్చి 2018.
- ↑ "Govt changes criteria for Bharat Ratna; now open for all". The Hindu. New Delhi. Press Trust of India. 16 December 2011. Archived from the original on 28 December 2013. Retrieved 16 December 2011.
- ↑ Gundevia, Y. D. (1966). "The Gazette of India—Extraordinary—Part I" (PDF). The Gazette of India. The President's Secretariat (published 11 January 1966): 2. Archived from the original (PDF) on 14 May 2014. Retrieved 12 May 2014.
The President is pleased to award the Bharat Ratna posthumously to:—Shri Lal Bahadur Shastri
- ↑ "The Constitution of India" (PDF). Ministry of Law and Justice (India). p. 36. Archived from the original (PDF) on 9 September 2014. Retrieved 19 May 2014.
- ↑ "Indian order of precedence" (PDF). Rajya Sabha Secretariat. p. 1. Archived from the original (PDF) on 4 July 2014. Retrieved 19 May 2014.
- ↑ "Crafting Bharat Ratna, Padma Medals at Kolkata Mint" (Press release). Press Information Bureau (PIB), India. 21 January 2014. Archived from the original on 17 May 2014. Retrieved 13 May 2014.
- Ranjan, Amitav (4 February 2014). "Sachin's Bharat Ratna today a medal from 2000". The Indian Express. New Delhi. Archived from the original on 28 April 2014. Retrieved 13 May 2014.
- ↑ Sainty 2011.
- ↑ "Crafting Bharat Ratna, Padma Medals at Kolkata Mint". Press Information Bureau. 26 జనవరి 2014. Archived from the original on 8 డిసెంబరు 2015. Retrieved 5 నవంబరు 2015.
- "History of the Alipore Mint". India Govt Mint, Kolkota. Archived from the original on 29 June 2008. Retrieved 15 September 2008.
- ↑ 20.0 20.1 Basu 2010, p. 132.
- ↑ 21.0 21.1 Haque, Amir (5 December 2013). "PIL against Bharat Ratna to CNR Rao dismissed, petitioners warned". Headlines Today. New Delhi: India Today. Archived from the original on 17 May 2014. Retrieved 16 May 2014.
- ↑ 22.0 22.1 Sengupta, Subhajit (19 November 2013). "RTI activist moves EC against Sachin Tendulkar getting Bharat Ratna". IBN Live. Archived from the original on 19 December 2013. Retrieved 16 May 2014.
- ↑ 23.0 23.1 "Case filed against Bharat Ratna award to Tendulkar". Rediff.com. 19 November 2013. Archived from the original on 17 May 2014. Retrieved 16 May 2014.
- "Bharat Ratna controversy: Cases filed against Manmohan, Sushil Kumar Shinde, Sachin Tendulkar". The Economic Times. Muzaffarpur. 19 November 2013. Archived from the original on 23 July 2014. Retrieved 16 May 2014.
- ↑ 24.0 24.1 24.2 "Union of India Vs. Bijan Ghosh and ORS: Special Leave Petition (civil) 628 of 1994". Supreme Court of India. 4 August 1997. Archived from the original on 14 May 2014. Retrieved 14 May 2014.
- ↑ Basu 2010, p. 102.
- ↑ "SC cancels note on Bharat Ratna for Subhash Bose". Press Trust of India. New Delhi: The Indian Express. 5 August 1997. Archived from the original on 18 December 2013. Retrieved 17 November 2013.
- ↑ "Govt didn't violate model code in naming Sachin for Bharat Ratna: EC". Hindustan Times. New Delhi. 4 December 2013. Archived from the original on 22 December 2013. Retrieved 16 May 2014.
- ↑ "Court reserves order on Sachin Tendulkar's Bharat Ratna". Daily News and Analysis. Lucknow. Indo-Asian News Service. 25 November 2013. Archived from the original on 17 May 2014. Retrieved 16 May 2014.
- "Madras HC dismisses PIL against Sachin Tendulkar getting Bharat Ratna". Chennai: IBN Live. 3 December 2013. Archived from the original on 18 మే 2014. Retrieved 28 మార్చి 2018.
- "HC dismisses PIL challenging Bharat Ratna to Sachin, Rao". The Hindu. Chennai. 4 November 2013. Archived from the original on 17 May 2014. Retrieved 16 May 2014.
- ↑ 29.0 29.1 Guha 2001, p. 169.
- ↑ Hattangadi, Shekhar (11 February 2011). "It's time to junk the sullied Padma awards". Daily News and Analysis. Mumbai. Archived from the original on 18 October 2014. Retrieved 17 May 2014.
- ↑ Patranobis, Sutirtho (13 January 2008). "'Politicking' over the Bharat Ratna award". Hindustan Times. New Delhi. Archived from the original on 18 October 2014. Retrieved 16 May 2014.
- ↑ Ramachandran, Sudha (24 January 2008). "India's top award misses congeniality". Asia Times Online. Bangalore. Archived from the original on 16 అక్టోబరు 2014. Retrieved 28 మార్చి 2018.
- ↑ Chatterjee, Saibal; Prakash, Amit (1996). "An Honourable Judgement: A Supreme Court ruling aims to restore the sanctity of the nation's highest awards". Outlook (published 10 January 1996). Archived from the original on 15 May 2014. Retrieved 14 May 2014.
- ↑ "The Needler: Bharat Ratna to Pandit Malviya can lead to more demands". Mail Today. 27 డిసెంబరు 2014. Archived from the original on 8 డిసెంబరు 2015. Retrieved 8 నవంబరు 2015.
- ↑ Sharma, Sandipan (25 డిసెంబరు 2014). "Bharat Ratna for Vajpayee, Malaviya: Govt needs to stop politicising the reward". Firstpost. Archived from the original on 26 జనవరి 2015. Retrieved 8 నవంబరు 2015.
- ↑ Sopariwala, Dorab R. (28 జనవరి 2015). "A Bharat Ratna for Mahatma Gandhi?". NDTV. Archived from the original on 29 అక్టోబరు 2015. Retrieved 8 నవంబరు 2015.
- ↑ Ramaswami, T. R. (7 January 2012). "Let us not degrade country's highest civilian honour Bharat Ratna". The Economic Times. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 8 November 2015.
- ↑ 38.0 38.1 Diwanji, Amberish K. (24 డిసెంబరు 2014). "Mr Modi, why not a Bharat Ratna for the Mahatma?". Rediff.com. Archived from the original on 19 నవంబరు 2015. Retrieved 8 నవంబరు 2015.
- ↑ ""Netaji stature bigger than Bharat Ratna": Kin say best way to honour him is to declassify govt files on his disappearance". The Indian Express. Kolkata. 11 ఆగస్టు 2014. Archived from the original on 8 డిసెంబరు 2015. Retrieved 8 నవంబరు 2015.
- ↑ Agnihotri, Amit (5 జనవరి 2015). "'No posthumous Bharat Ratna should be given' says Congress veteran Dwivedi". DailyMail. Archived from the original on 8 డిసెంబరు 2015. Retrieved 8 నవంబరు 2015.
- ↑ "Bharat Ratna cry for Bose". The Telegraph (Calcutta). New Delhi. 6 September 2012. Archived from the original on 19 May 2014. Retrieved 18 May 2014.
- ↑ Guha 2001, p. 170.
- ↑ "Acceptance Speeches: Satyajit Ray". Academy of Motion Picture Arts and Sciences. Archived from the original on 9 June 2014. Retrieved 18 May 2014.
- ↑ "Bharat Ratna for Amartya Sen". Frontline. 16 (3). The Hindu. 1999. Archived from the original on 19 May 2014. Retrieved 18 May 2014.
- ↑ Tripathi, Salil (23 August 2013). "Freedom of Expression: Indians are Becoming Increasingly Intolerant". Forbes India Magazine. Archived from the original on 19 May 2014. Retrieved 18 May 2014.
- ↑ "Prime Ministers of India". Prime Minister's Office (India). Archived from the original on 9 October 2014. Retrieved 12 May 2014.
- ↑ Chatterjee, Manini (10 January 2008). "Uneasy lies crown that awaits Ratna—Advani proposes Vajpayee's name, method and timing fuel murmurs". The Telegraph (Calcutta). Calcutta. Archived from the original on 21 May 2014. Retrieved 19 May 2014.
- ↑ "Premiers/Chief Ministers of West Bengal". West Bengal Legislative Assembly. Archived from the original on 12 May 2014. Retrieved 10 May 2014.
- ↑ "Jyoti Basu can be given Bharat Ratna: CPI (M)". Kolkata: Daily News and Analysis. Press Trust of India. 11 January 2008. Archived from the original on 21 May 2014. Retrieved 19 May 2014.
- "Jyoti Basu "not in the race"". The Hindu. Kolkata. Press Trust of India. 13 January 2008. Archived from the original on 31 March 2014. Retrieved 19 May 2014.
- ↑ "Bharat Ratna losing its sanctity?". The Statesman. 24 November 2013. Archived from the original on 20 May 2014. Retrieved 19 May 2014.
- ↑ "Shiv Sena starts drive to collect 10 lakh signatures to get Bharat Ratna for Vinayak Damodar Savarkar". The Economic Times. 15 September 2015. Archived from the original on 9 జూన్ 2016. Retrieved 7 November 2015.
- "Shiv Sena demands Bharat Ratna for Veer Savarkar". Mid-Day. New Delhi. Press Trust of India. 14 సెప్టెంబరు 2015. Archived from the original on 26 సెప్టెంబరు 2015. Retrieved 7 నవంబరు 2015.
- "Savarkar doesn't need an award for recognition, says grand-nephew". The Indian Express. Mumbai. Archived from the original on 19 అక్టోబరు 2015. Retrieved 7 నవంబరు 2015.
- ↑ 52.0 52.1 52.2 52.3 52.4 Andhrajyothy (9 February 2024). "15 రోజుల్లో ఐదుగురికి భారతరత్న.. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డ్..!". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ ప్రజాప్రయోజన వ్యాజ్యం అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, క్రీడామంత్రి భన్వర్ జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిలపై నిందారోపణ చేసింది.
గ్రంథసూచి
[మార్చు]- Basu, Kanailal (2010). Netaji: Rediscovered. AuthorHouse. ISBN 978-1-4490-5569-1.
- Bhattacherje, S. B. (2009). Encyclopaedia of Indian Events & Dates. Sterling Publishers Pvt. Ltd. ISBN 978-81-207-4074-7.
- Daniel, P. (1958). The Indian Review. Vol. 58. G.A. Natesan & Company.
- Edgar, Thorpe (2011). The Pearson General Knowledge Manual 2011. Pearson Education India. ISBN 978-81-317-5640-9.
- Guha, Ramachandra (2001). An Anthropologist Among the Marxists and Other Essays. Orient Blackswan. ISBN 978-81-7824-001-5.
- Gulzar; Nihalani, Govind; Chatterjee, Saibal, eds. (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. ISBN 978-81-7991-066-5.
- Hoiberg, Dale; Ramchandani, Indu (2000). Students' Britannica India. Vol. 1–5. Popular Prakashan. ISBN 978-81-7156-112-4.
- Osnes, Beth (2013). Theatre for Women's Participation in Sustainable Development. Routledge. ISBN 978-1-136-72846-4.
- Sainty, Guy Stair (2011). World Orders of Knighthood and Merit. University of Michigan Press. ISBN 978-0-9711966-7-4.
- Taneja, V. R.; Taneja, S. (2000). Educational Thinkers. Atlantic Publishers & Dist. ISBN 978-81-7156-112-4.
- Weber, Thomas (2004). Gandhi as Disciple and Mentor. Cambridge University Press. ISBN 978-1-139-45657-9.
|}