పరమ వీర చక్ర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పరమ వీర చక్ర
Param veer chakra.gif
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం యుద్ధ సమయంలో సాహసాలకు
వ్యస్థాపితం 1950
మొదటి బహూకరణ 1947
క్రితం బహూకరణ 1999
మొత్తం బహూకరణలు 21
బహూకరించేవారు భారతీయ ప్రభుత్వం
Ribbon Param-Vir-Chakra-ribbon.svg
మొదటి గ్రహీత(లు) మేజర్ సోమనాధ్ శర్మ
(మరణానంతరం)
క్రితం గ్రహీత(లు) కెప్టెన్ విక్రమ్ బాత్రా
(మరణానంతరం)
Award Rank
భారత్ రత్న ← పరమ వీర చక్రమహా వీర చక్ర

పరమ వీర చక్ర అనేది భారతదేశంలో అత్యునత త్రివిధ దళాలు పురస్కారం. ఈ పురస్కారం యుధ్ద సమయంలో అత్యునత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు అందచేయబడును. పేరుకు అర్థం "అత్యునత ధైర్య చక్రం",[1] ఈ పురస్కారం అమెరికాకు చెందిన "మెడల్ అఫ్ హానర్" మరియు బ్రిటిష్‌కు చెందిన "విక్టోరియా క్రాస్"కు సమానం.[2][3]

అశోక్‌చక్ర అనే మరో పురస్కారం దేశ శాంతి సమయాలలో పరమ వీర చక్ర కు సమానం. పరమ వీర చక్ర కేవలం త్రివిధ దళాలలో పని చేసే వారికి మాత్రమే ఇవ్వబడుతుంది, కానీ అశోక్ చక్ర మాత్రం ఏ భారతీయనికైనా పురస్కరించవచ్చు. పరమ వీర చక్రకు మాదిరి గానే అశోక్ చక్ర కూడా చనిపోయిన తరువాత కూడా పురస్కరించ వచ్చు.[4] పురస్కార గ్రహీతల కు కేంద్ర మరియు రాష్త్ర ప్రభుత్వాల నుండి అనేక భత్యాలు అందచేయబడతాయి. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి భత్యాలు అందిస్తున్నాయి.

చరిత్ర[మార్చు]

పరమ వీర చక్ర 26 జనవరి 1950 (గణతంత్ర దినోత్సవం)న భారత రాష్ట్రపతి చే స్థాపించబడింది. కానీ ఈ పురస్కారం 15 ఆగస్ట్ 1947 (స్వతంత్ర దినోత్సవం) నుండి పరిగణలో ఉన్నటు చట్టం స్థాపించబడింది.[1][5] ఈ పురస్కారం త్రివిధ దళాలకు సంబంధించిన ఏ సైనికుడికైనా మరియు సైన్య అధికారుడికైనా అందించవచ్చు.[6] ఈ పురస్కారాన్ని ఒకే వ్యక్తికి రెండు సార్లు అందించే వెసులుబాటు ఉంది. ఒక సైనికుడికి రెండోసారి ఈ పురస్కారం అందచేయబడితే పరమ వీర చక్ర రిబ్బన్ కు ఒక గీత జమ చేయబడుతుంది, మరియు ఒక వజ్రపు ఖడ్గం నమున కూడా అందచేయబడుతుంది.[1] ఇప్పటి దాకా ఏ సైనికుడికి రెండు సార్లు ఈ పురస్కారం అందించలేదు. గ్రహీతలు తమ పేరు తరువాత "PVC" అని ఆంగ్లంలో జమ చేసుకోవచ్చు.[5]

రూపకల్పన[మార్చు]

సావిత్రి ఖణోల్కర్, సిక్కు రెజిమెంట్ కు చెందిన సైన్యాదిరకారి విక్రమ్ ఖణోల్కర్ భార్య, ఈ పురస్కారాన్ని రూపొందించారు.[7] సావిత్రి గారు ఈ పురస్కారాన్ని అప్పటి భారతీయ సైన్య అడఁజూటంట్ జనరల్, మేజర్ జనరల్ హిర లాల్ అటల్, కోరిక మీద రూపొందించారు. స్వతంత్రం తరువాత, మేజర్ జనరల్ అటల్, బ్రిటిష్ కు చెందిన "విక్టోరియా క్రాస్"కు సమానమైన పురస్కారాన్ని రూపొందించే బాధ్యతను వహించారు. యాదృచ్ఛికంగా ఈ పురస్కారం సావిత్రి గారి అల్లుడైన లెఫ్టినెంట్ జనరల్ సురిందర్ నాథ్ శర్మ అన్నయ్య, మేజర్ సోమనాథ్ శర్మకు ఈ పురస్కారం మొదటి సారి పురస్కరించబడింది. మేజర్ సోమనాథ్ శర్మ 1947 పాకిస్తాన్ తో యుద్ధంలో, కాశ్మీర్ లో ధైర్యసాహసాలకు ఈ పురస్కారం అండ చేయబడింది.

ఈ పురస్కార పథకం వృత్తాకార కాంస్య రూపంలో ఉంటుంది. వృత్తాకార వ్యాసం 1.375 అంగుళాలు. ముందువైపున భారతదేశ చిహ్నం, దాని చుట్టూ నాలుగు వజ్ర నమూనాలు ఏర్పాటు చేయబడ్డాయి. వజ్ర నమూనాలకు మూలాంశం దధీచి ఋషి త్యాగానికి చిహ్నం, దధీచి తన శరీర ఎముకలను వజ్రాయుధం రూపొందించడానికి త్యాగం చేసారు. ఈ పథకాన్ని ఒక తిన్నని లోహపు ముక్క మీద వేలాడతీయబడుతుంది. వెనుకవైపున, పరమ వీర చక్ర అని హిందీలో (परमवीर चक्र) మరియు ఆంగ్లంలో (Param Vir Chakra) అని రెండు కమలాల మధ్య లిఖితమైనది.[3][8] ఊదా రంగు రిబ్బను ఈ పురస్కారానికి చిహ్నం.[3]

పురస్కార గ్రహీతలు[మార్చు]

ఈ పథకం ఇప్పటి దాక 21 సార్లు పురస్కరించబడింది, వీటిల్లో 14 పథకాలు సైనికుడు చనిపోయిన తరువాత పురస్కరించబడ్డాయి, మరియు 16 పథకాలు భారత్-పాకిస్తాన్ యుధాలలో సైనికుల ధైర్యసాహసాలకు పురస్కరించబడ్డాయి. 21 గ్రహీతలలో, 20 మంది తళ సేనకు చెందిన వారు, ఒకరు వాయు సేన చెందిన వారు. తళ సేనకు చెందిన గ్రెనెడియర్ యూనిట్లకు పథకం అత్యంత ఎక్కువ సార్లు పురస్కరించబడింది. గ్రోర్ఖ రైఫిల్ రెజిమెంట్లకు మూడు సార్లు ఈ పథకం పురస్కరించబడింది.[9]

ఫ్లైయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ కు మాత్రమే ఇప్పటి దాక వాయు సేనలో ఈ పథకం పురస్కరించబడింది. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో నిర్మల్ జిత్ ధైర్యసాహసాలకు పురస్కరించబడింది.[1][9][10] నాయిబ్ సుబేదార్ సంజయ్ కుమార్ మరియు సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్ అనే ఇద్దరు సైనికులు మాత్రమే పరమ వీర చక్ర గ్రహీతలు మాత్రమే ఇంకా సైన్యంలో సేవలందిస్తున్నారు.[11]

పురస్కార గ్రహీతలకు భత్యాలు[మార్చు]

పథాకమే కాకుండా పురస్కార గ్రహీతలకు, పురస్కారంతో పాటు లెఫ్టినెంట్ క్రింది స్థాయి సైనికులకు నగదు భత్యం కూడా లభిస్తుంది. ఒకవేళ గ్రహీత చనిపోయి ఉంటె, ఆ భత్యం అతని భార్యకు, ఆమె చనిపోయేంత వరుకు లేదా మల్లి పెళ్ళి అయ్యేంత వరుకు లభిస్తుంది. గ్రహీతకు భార్య లేకపోతే అతని తల్లితండ్రులకు ఆ భత్యం చెందుతుంది. గ్రహీతకు పెళ్ళి అయ్యిఉండి భార్య చనిపోయి ఉంటె ఆ భత్యం అతని కొడుకు లేదా పెళ్ళి కాని కూతురుకు లభిస్తుంది.[12] గ్రహీత బతికే ఉంటె నెలకు 10,000 రూపాయలు భత్యం లభిస్తుంది. ఈ పురస్కారం ద్వారా లభించే మొత్తం ఆదాయపు పన్ను నుండి మినహాయింపబడుతుంది. ఇదే కాకుండ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక మంత్రిత్వ శాఖలు కూడా అనేక భత్యలు లభిస్తాయి. రైల్వే మంత్రిత్వ శాఖ గ్రహీత మరియు గ్రహీతతో పాటు ఉండే ఒక్కలకు జీవిత కాలం ఏ వసూలు లేకుండ మొదటి తరగతి రైలు ప్రయాణం చేసే వెసులుబాటు కలిపిస్తుంది. రవాణా మంత్రిత్వ శాఖ గ్రహీతలకు టోల్ పన్నును తొలిగించింది. ఇండియన్ ఎయిర్లైన్స్, గ్రహీతలకు 75% రాయితీని అందిస్తుంది.[13]

రాష్త్ర ప్రభుత్వాలు అందించే భత్యాలు[మార్చు]

కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్త్ర ప్రభుత్వాలు కూడా భత్యాలు అందచేస్తున్నాయి.[14]

Cash amount States awarding
₹3.1 million హర్యానా
₹3 million పంజాబ్
₹2.5 million
₹2 million
₹1.5 million
₹1 million
₹22,500

రద్దు[మార్చు]

అవసరమైతే రాష్త్రపతి పురస్కరించబడిన పథకాన్ని రద్దు చేయవచ్చు. అలా జరిగినచొ, అతని లేదా ఆమె పేరు నమోదు పత్రం నుండి తొలగింపబడును, మరియు ఆ పథకాన్ని గ్రహీత తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. రాష్త్రపతి రద్దుని కూడా ఉపసంహరించుకోవచ్చు. ఏ సందర్భంలో అయిన మార్పును "ది గాజెట్టే అఫ్ ఇండియా"లో ప్రచురించబడుతంది.[12]

జనరంజక సంస్కృతిలో[మార్చు]

1990 లో, పరమ వీర చక్ర గ్రహీతల జీవిత చరిత్రలు ఆధారంగా ఆంగ్లంలో టెలివిజన్ సిరీస్ రూపొందించబడ్డాయి.[15][16][17] వీటికి చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించారు. 2003 లో, "LOC Kargil" అనే హిందీ సినిమాలో కార్గిల్ యుద్ధంలో పరమ వీర చక్ర గ్రహీతల ఆధారంగా రూపొందించబడింది.[18]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "పరమ వీర చక్ర జాతీయ సమితి". India: National Portal of India. Retrieved 13 August 2014. 
  2. NCERT 2016, p. 11.
  3. 3.0 3.1 3.2 ప్రియా అరోరా (27 December 2013). "పరమ వీర చక్ర గురించి ఏడు విషయాల". Topyaps. Retrieved 4 September 2016. 
  4. "అవార్డ్స్ హోమ్ శాఖ" (PDF). warb-mha. p. 1. Retrieved 5 September 2016. 
  5. 5.0 5.1 "పరమ వీర చక్ర గురించి 11 విషయాల". Indiatimes. Retrieved 4 September 2016. 
  6. "పరమ వీర చక్ర భారతీయ సేన". Indian Army. Retrieved 4 September 2016. 
  7. Satyindra Singh (20 June 1999). "అత్యంత సాహసికులు గౌరవం". The Tribune, Chandigarh. Retrieved 13 August 2014. 
  8. Sumit Walia (23 January 2009). "మొదటి పరమ వీర చక్ర". Sify.com. Retrieved 13 August 2014. 
  9. 9.0 9.1 INDIATIMES NEWS NETWORK (25 January 2008). "Param Vir Chakra winners since 1950". Times of India. Retrieved 5 September 2016. 
  10. "Indian Air Force :: Param Vir Chakra". Bharat Rakshak. Retrieved 13 August 2014. 
  11. "Other States / West Bengal News : Living with war memories that never fade". The Hindu. 8 August 2010. Retrieved 10 July 2013. 
  12. 12.0 12.1 Chakravorty 1995, p. 48.
  13. "Param Vir Chakra IN". indiannavy.nic.in. Retrieved 5 September 2016. 
  14. "మెన్ ఇన్ యూనిఫామ్". Factly. 18 August 2015. Retrieved 4 September 2016. 
  15. Madhu Jain (15 August 1990). "కాశ్మీర్ సీరియల్". India Today. Retrieved 13 August 2014. 
  16. "గోల్డిఈ కమాండ్స్ గౌరవం". www.sunday-guardian.com. Retrieved 5 September 2016. 
  17. "మేకర్ అఫ్ మీనింగ్ఫుల్ మూవీస్". The Hindu (in ఆంగ్లం). 15 June 2007. Retrieved 5 September 2016. 
  18. "LOC కార్గిల్". www.thehindu.com. Retrieved 5 September 2016. 

పుస్తకాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]