అబ్దుల్ హమీద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంఫెనీ క్వార్టర్‌మాస్టర్ హవిల్దార్
అబ్దుల్ హమీద్
PVC
Soldier Abdul Hamid 2000 stamp of India.jpg
అబ్దుల్ హమీద్ జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం విడుదల చేసిన స్టాంపు
జననం(1933-06-01)1933 జూన్ 1 [1]
ధంపూర్, ఘజియాపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశం. [1]
మరణం1965 సెప్టెంబరు 10(1965-09-10) (వయసు 32)[1]
చీమ, ఖేం కరణ్ సెక్టారు, తార్న్ తారన్ సాహిబ్
రాజభక్తి India
సేవలు/శాఖ Indian Army
సేవా కాలం1954–1965[1]
ర్యాంకుCompany Quartermaster Havildar.gif
Company Quartermaster Havildar
యూనిట్4 Grenadiers
పోరాటాలు / యుద్ధాలుSino-Indian War
Indo-Pakistani War of 1965
Battle of Asal Uttar
పురస్కారాలుParam-Vir-Chakra-ribbon.svg Param Vir Chakra
IND Samar Seva Star Ribbon.svg Samar Seva Medal
IND Raksha Medal Ribbon.svg Raksha Medal
IND Sainya Seva Medal Ribbon.svg Sainya Seva Medal

కంపెనీ క్వార్టెర్‌మాస్టర్ హవీల్దార్ అబ్దుల్ హమిద్ PVC (1 జూలై 1933 – 10 సెప్టెంబరు 1965) భారత సైనిక దళం నకు చెందిన ద గ్రనేడర్స్ యొక్క నాల్గవ బెటాఅలియన్ కు చెందిన సైనికుడు. ఆయన 1965లో ఖేం కరణ్ సెక్టారులో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఆయనకు మరణానంతరం భారతదేశ అత్యున్నత మిలిటరీ పురస్కారమైన పరమ వీర చక్ర ను భారత ప్రభుత్వం ఇచ్చింది. దేశంకోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహాసాహసి ఆయన.

ప్రారంభ జీవితం[మార్చు]

ఆయన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాపూర్ జిల్లాకు చెందిన ధాముపూర్ గ్రామంలో జూన్ 1, 1933 న జన్మించాడు. ఆయన తండ్రి మొహమ్మద్ ఉస్మాన్[1]

సైన్యంలో[మార్చు]

మొదట ఇతడు 1954 డిసెంబర్ 27న "ద గ్రెనేడియర్స్ ఇన్ ఫంటీ" యను సైనికదళంలో ఒక సైనికునిగా చేరాడు. [1]తరువాత ఇతడు 4వ బెటాలియన్లోకి మార్చబడ్డాడు. ఆపై చివరిదాకా అక్కడే పనిచేశాడు. అలా సైన్యంలో ఉంటూనే ఆగ్రా. అమృత్‌సర్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, రాయగఢ్ మొదలైన ప్రాంతాలన్నీ తిరిగివచ్చాడు. బ్రిగేడియర్ "కాన్ డాల్వీ" నాయకత్వంలో మనకూ చైనాకూ మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. కాలినడకన "భూటాన్" కూ, "మిసామరి" కి వెళ్చాచ్చాడు. ఇతడు గొప్ప "షూటర్" (తుపాకీ వీరుడు) కావడంవల్ల 106 పూరింగ్ బెటాలియన్ కు పంపించబడ్డాడు.[2]

ఇండో-పాక్ యుద్ధం 1965లో[మార్చు]

మనకూ పాకిస్తాన్ కు జరిగిన యుద్ధంలో 1965 సెప్టెంబర్ 10న ఉదయం 8 గంటలకు పాకిస్థాన్ సైనిక దశాలు బిక్కివిండీ అమృత్‌సర్ రోడ్డు మీద "చీమా" గ్రామం"పై దాడిచేసారు. ఈ ప్రాంతం "భమెకరన్" విభాగంలో ఉంది. ఉదయం 9 గంటలయ్యేసరికి వారు మరింత ముందుకు వచ్చారు. ఇంకా ఇంకా ముందుకు భారత సైన్యం మిదకు తుఫానులా వస్తున్న ట్యాంకులను చూసి ప్రమాదాన్ని పసిగట్టాడాయన. వెంటనే తన తుపాకీతో సివంగిలా తన జీపులోకి దూకి ముందుకెళ్చాడు. అప్పడతను తన దళానికి కమాండరుగా ఉన్నాడు. శత్రుసైనికులు బాంబులతో, ట్యాంకులతో అగ్ని వర్షం కురిపించసాగారు. ఏమాత్రం బెదరకుండా ఆయన ఎదుర్కొన్నాడు. చూస్తుండగానే తన సాధారణ తుపాకీతో మూడు ట్యాంకులను పేల్చివేసాడు. ఇది గమనించిన శత్రుసైనికులు నాల్గవ ట్యాంకును పేల్చబోతుండగా మిషన్ గన్ తో కాల్చి చంపారు.

ఆయనకు సెప్టెంబరు 16, 1965న భారతదేశ అత్యున్నత మిలిటరీ పురస్కారం పరమవీర చక్రను భారత ప్రభుత్వం ప్రకటించింది. 1966, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా హమీద్ సతీమణి "రసూలన్" కు రాష్ట్రపతి సర్వేపల్లి రాథాకృష్ణన్ గారు అందజేసారు.

సైనిక పురస్కారాలు[మార్చు]

మూస:Ribbon devices/alt
మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt
పరమ వీర చక్ర
సమర సేవా స్టార్
రక్షా మెడల్
సైన్య సేవా మెడల్

తదనంతర పరిణామాలు[మార్చు]

ఆ తరువాత ఉత్తర ప్రదేశ్ లోని "అసల్ ఉత్తల్" లో అతని సమాధిపై ఒక స్మారక స్థూపం నిర్మించబడినది. ప్రతీ సంవత్సరం అక్కడ "మేళా" నిర్వహిస్తారు. హమీద్ పేరుమీద ఒక పాఠశాల, గ్రంథాలయం, ఆసుపత్రినీ నెలకొల్పారు. "ఆర్మీ పోస్టల్ సర్వీసు" హమీద్ పేరిట ఒక పోస్టల్ కవర్ ను సెప్టెంబరు 10, 1979న జారీచేసింది.[3]

1988లో చేతన్ ఆనంద్ యొక్క టెలివిజన్ సీరియల్ "పరమ వీర చక్ర" లో ఆయన పాత్రలో నసీరుద్దీన్ షా నటించారు.[4]

మూడు రూపాయల విలువ గల పోస్టల్ స్టాంపును భారత ప్రభుత్వం జనవరి 28, 2000 న జారీచేసారు. ఆ స్టాంపుపై హమీద్ ఒక జీప్ పై నుండి ట్యాంకులను కాల్చుతున్నట్లు చిత్రం ఉంటుంది.[5]

2008లో హమీద్ భార్య రసూలన్ బీబీ అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ను కలిసి వారి గ్రమంలో మిలిటరీ రిక్రూట్ మెంటు సెంటరు నెలకొల్పవలసినదిగా కోరారు. అదే విధంగా దుల్లాపూర్ లోని ఆయన గృహాన్ని స్మారక భవనంగా చేయాలని కోరారు.[6]

ఇతర లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Gandhi, S. S., ed. (2006). Portraits of Valour – India's Gallantry Awards and their recipients (3= ed.). New Delhi: The Defence Review. p. 132.
  2. "మహాయోధుడు అబ్దుల్ హమీద్" (PDF). Archived from the original (PDF) on 2020-11-26. Retrieved 2016-11-21.
  3. Palsokar, R. D. (1980). The Grenadiers – A Tradition of Valour. Jabalpur: Grenadiers Regimental centre. pp. 337–338.
  4. "The episode on Youtube".
  5. Unattributed (n.d.). "January 2000". Maharshtra Post. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 20 February 2012.
  6. Pradhan, Sharat (24 September 2008). "War hero's widow beseeches President for a stamp". Rediff News. Retrieved 20 February 2012.