నసీరుద్దీన్ షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నసీరుద్దీన్ షా
2011 లో నసీరుద్దీన్ షా
జననం
నసీరుద్దీన్ షా

(1949-07-20) 1949 జూలై 20 (వయసు 74)
or (1950-08-16) 1950 ఆగస్టు 16 (వయసు 73)
బారాబంకీ, ఉత్తరప్రదేశ్
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, పర్యావరణవేత్త
క్రియాశీల సంవత్సరాలు1972–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
కర్మ (సినిమా),మీర్జా గాలిబ్ (1989) ది పర్ఫెక్ట్ మర్డర్, ఎ వెన్స్ డే, సర్ఫరోష్, ఖుదా కేలియే, మాన్ సూన్ వెడ్డింగ్, మసూమ్,జిందా భాగ్, ది లీగ్ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ జెంటిల్మన్, ఇక్బాల్
జీవిత భాగస్వామిపర్వీన్ మురాద్ (మనారా సిక్రీ - చనిపోయింది)
రత్నా పాఠక్ (1982–ప్రస్తుతం)
పిల్లలుహీబా షా
ఇమాద్ షా
వివాన్ షా
బంధువులుజమీరుద్దీన్ షా (సోదరుడు)
దీనా పాఠక్ (అత్త)
సుప్రియా పాఠక్ (మరదలు)
మహమ్మద్ ఆలీ షా (మేనల్లుడు)
పురస్కారాలుపద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారం, జాతీయ సినిమా పురస్కారం
సంతకం
నసీరుద్దీన్ షా సంతకం

నసీరుద్దీన్ షా (జులై 20 1949 లేదా 1950 ఆగస్టు 16[1] ఒక ప్రముఖ భారతీయ నటుడు, దర్శకుడు. 1975 లో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆయన సుమారు 100కి పైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించాడు. ప్రధానంగా హిందీ భాషతో పాటు కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లో కూడా నటించాడు. ఆయన మూడు నేషనల్ అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారాలతో పాటు పలు పురస్కారాలు అందుకున్నాడు. నటనా రంగంలో ఆయన కృషికి భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

జీవిత విశేషాలు[మార్చు]

పద్మశ్రీపురస్కారం

నసీరుద్దీన్ షా ఉత్తర ప్రదేశ్ లోని బారాబంకీ అనే ఊళ్ళో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన 19వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ సేనాధిపతి జాన్ ఫిషాన్ ఖాన్ వంశంలో జన్మించాడు. జాన్ ఫిషాన్ మొట్ట మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో పాల్గొన్నాడు. అంతేకాక 1857 లో జరిగిన మొదటి సిపాయిల తిరుగుబాటును అణిచివేయడంలో ఆంగ్లేయులకు సహకరించాడు.[2] సెయింట్ ఆన్సెల్మ్ అజ్మీర్ పాఠశాలలో షా తన ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత నైనిటాల్ లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదివాడు. 1971 లో ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఇబ్రహీం అల్కాజీ వద్ద శిక్షణ పొందాడు.[3]

సినిమారంగం[మార్చు]

షా బాలీవుడ్ పరిశ్రమలోనే కాక, సమాంతర సినిమాలోనూ విజయవంతం అయ్యాడు. అంతర్జాతీయ సినిమాల్లో కూడా నటించాడు. ది లీగ్ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ జెంటిల్మన్ అనే సినిమాలో ఆయన పోషించిన కెప్టెన్ నీమో ఆయనకు పేరు తెచ్చిన పాత్ర.

ఆయన అన్న రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ప్రస్తుతం ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సిలర్. జమీరుద్దీన్ షా కొడుకు మహమ్మద్ ఆలీ షా ఒక నటుడు.[4]

నటించిన చిత్రాలు[మార్చు]

 1. నిశాంత్ (తొలిచిత్రం)[5]
 2. దేవూళ్
 3. చక్ర
 4. భూమిక
 5. అర్ధ్ సత్య (1983)
 6. పొంతన్ మదా

మూలాలు[మార్చు]

 1. Shah, Naseeruddin (2014). And then one day: A memoir. Hamish Hamilton. p. 1. ISBN 978-0670087648.
 2. Obituary of Idries Shah, The Independent (London) of 26 November 1996.
 3. "Profile: "I Was Recognised For My Genius"". The Outlook. 18 December 1996.
 4. "Bbuddah Hoga Terra Baap – Audience Reviews .. Must Watch .. :) | NG". Naachgaana.com. Archived from the original on 8 ఫిబ్రవరి 2013. Retrieved 22 October 2012.
 5. Ziya Us Salam (4 October 2012). "Nishant (1975)". The Hindu. Retrieved 1 July 2019.