Jump to content

దేవూళ్

వికీపీడియా నుండి
దేవూళ్
దేవూళ్ సినిమా పోస్టర్
దర్శకత్వంఉమేష్ వినాయక్ కులకర్ణి
రచనగిరీష్ కులకర్ణి
స్క్రీన్ ప్లేగిరీష్ కులకర్ణి
నిర్మాతఅభిజీత్ ఘోలాప్
తారాగణంనానా పటేకర్
దిలీప్ ప్రభావల్కర్
గిరీష్ కులకర్ణి
శర్వాణి పిళ్ళై
సోనాలి కులకర్ణి
ఛాయాగ్రహణంసుధాకర్ రెడ్డి యక్కంటి
కూర్పుఅభిజిత్ దేశ్‌పాండే
సంగీతంమంగేష్ ధక్డే
నిర్మాణ
సంస్థ
దేవిషా ఫిల్మ్స్
విడుదల తేదీs
2011, అక్టోబరు 10 (పుసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, దక్షిణ కొరియా)
2011, నవంబరు 4 (భారతదేశం)
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషమరాఠి

దేవూళ్, 2011 అక్టోబరు 10న విడుదలైన మరాఠీ డార్క్ కామెడీ సినిమా. అభిజీత్ ఘోలాప్ నిర్మాణ సారధ్యంలో ఉమేష్ వినాయక్ కులకర్ణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గిరీష్ కులకర్ణి, నానా పటేకర్, దిలీప్ ప్రభావల్కర్, శర్వాణి పిళ్ళై, సోనాలి కులకర్ణి ముఖ్య పాత్రల్లో నటించారు.[1] భారతదేశంలోని చిన్న పట్టణాలు, భారతీయ గ్రామాల పరిస్థితిపై ప్రపంచీకరణ ప్రభావం గురించిన రాజకీయ నేపథ్యంతో రూపొందించిన సినిమా ఇది.

59వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చిత్రం,[2] జాతీయ ఉత్తమ నటుడు (గిరీష్ కులకర్ణి), జాతీయ ఉత్తమ సంభాషణ (గిరీష్ కులకర్ణి) విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి.[3]

హిందీ సినీ నటుడు నసీరుద్దీన్ షా నటించిన తొలి మరాఠీ చిత్రమది.[4]

నటవర్గం

[మార్చు]
  • నానా పటేకర్ (భావు గలాండే)
  • దిలీప్ ప్రభావల్కర్ (అన్నా కులకర్ణి)
  • సోనాలి కులకర్ణి (వాహిని)
  • గిరీష్ కులకర్ణి (కేశవ్ రంభోల్)
  • జ్యోతి సుభాష్ (కేశ్య తల్లి కాశ్య)
  • జ్యోతి మల్షే (పింకీ)
  • అతిషా నాయక్ (సర్పంచ్)
  • ఉషా నడ్కర్ణి (సర్పంచ్ అత్త)
  • కిషోర్ కదమ్ (మహాసంగ్రామ్‌)
  • శ్రీకాంత్ యాదవ్ (అప్పా గలాండే)
  • హృషికేశ్ జోషి (టామ్యా)
  • శశాంక్ షెండే
  • శర్వణి పిళ్ళై
  • ఓం భుట్కర్ (యువ్రీ)
  • మయూర్ ఖాండ్గే (ఎమ్డ్య)
  • సుహాస్ షిర్సాత్ (పోయత్య)
  • అభిజిత్ ఖైర్
  • విభవారీ దేశ్‌పాండే (పోవత్య సోదరి)
  • భక్తి రత్నపరాఖి (అప్ప గలాండే భార్య)
  • స్మితా తాంబే
అతిథి నటులు

విడుదల

[మార్చు]

2011, సెప్టెంబరు 23న ఈ సినిమా విడుదలకావాల్సి ఉండగా, నవంబర్‌కు వాయిదా పడింది.[5] బుసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, న్యూయార్క్ దక్షిణ ఆసియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, అబు దాబి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, ముంబైలోని మామి[6] మొదలైన చలన చిత్రోత్సవాలలో ఈ సినిమా ప్రదర్శన జరిగింది. 2011, నవంబరు 4న దేశవ్యాప్తంగా విడుదలైంది.

అవార్డులు, గుర్తింపు

[మార్చు]

డైలీ న్యూస్, ఎనాలిసిస్ (డిఎన్ఎ) ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇచ్చింది." గర్వించదగ్గ భారతీయ భాషా చిత్రం ఇది. తప్పక చూడండి" అని రాసింది.[7] 2011లో జరిగిన 59వ జాతీయ చలన చిత్ర అవార్డులలో 3 అవార్డులను గెలుచుకుంది.

జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు

[మార్చు]
  1. "Deool (2011)". Indiancine.ma. Retrieved 2021-06-22.
  2. "Vidya Balan wins National Award for 'The Dirty Picture'". The Times of India. 7 March 2012. Archived from the original on 30 April 2013. Retrieved 2021-06-22. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "59th National Film Awards: Winners List". MSN entertainment. Archived from the original on 10 March 2012. Retrieved 2021-06-22. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "Naseeruddin Shah makes Marathi film debut in Deool". bollywoodhungama. Retrieved 2021-06-22.
  5. "Deool-release-date-postponed". maujmaja. Archived from the original on 2011-09-24. Retrieved 2021-06-22. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "'Deool' heads for international fests". The Times of India. 19 September 2011. Archived from the original on 14 July 2012. Retrieved 2021-06-22. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. Chettiar, Blessy. "Review: For god's sake, don't miss Deool". DNA India. Retrieved 2021-06-22.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దేవూళ్&oldid=4218727" నుండి వెలికితీశారు