నిశాంత్ (1975 సినిమా)
Jump to navigation
Jump to search
నిశాంత్ | |
---|---|
దర్శకత్వం | శ్యామ్ బెనగళ్ |
రచన | విజయ్ టెండూల్కర్, సత్యదేవ్ దూబే (మాటలు) |
నిర్మాత | మోహన్ జె. బిల్జానీ, ఫ్రేని ఎం. వరివాయ |
తారాగణం | గిరీష్ కర్నాడ్, అమ్రీష్ పురి, షబానా అజ్మీ, అనంత్ నాగ్, సాధు మోహర్, స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా |
ఛాయాగ్రహణం | గోవింద్ నిహాలని |
కూర్పు | భానుదాసు దివాకర్ |
సంగీతం | వనరాజ్ భాటియా |
విడుదల తేదీ | 5 సెప్టెంబరు 1975(భారతదేశం) |
సినిమా నిడివి | 143 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నిశాంత్ 1975, సెప్టెంబర్ 5న విడుదలైన హిందీ చలనచిత్రం. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గిరీష్ కర్నాడ్, అమ్రీష్ పురి, షబానా అజ్మీ, అనంత్ నాగ్, సాధు మోహర్, స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు. విజయ్ టెండూల్కర్ రచనలో సత్యదేవ్ దూబే మాటల రాసిన ఈ చిత్రం నసీరుద్దీన్ షా తొలిచిత్రం.[1]
ఈ చిత్రం 1976 లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, 1977 మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. 1977లో జరిగిన చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడి గోల్డెన్ జ్ఞాపికను అందుకుంది.[2]
కథానేపథ్యం
[మార్చు]భారతదేశంలో ఫ్యూడలిజం ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నతవర్గాల వారి దౌర్జన్యం, మహిళలపై జరిగే లైంగిక దోపిడీల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది.
నటవర్గం
[మార్చు]- గిరీష్ కర్నాడ్ (ఉపాధ్యాయుడు)[3]
- షబానా అజ్మీ (సుశీల, ఉపాధ్యాయుడి భార్య)
- అనంత్ నాగ్ (అంజయ్య, జమిందారు సోదరుడు)
- అమ్రీష్ పురి (పెద్ద జమిందారు)
- సత్యదేవ్ దూబే (పూజారి)
- స్మితా పాటిల్ (రుక్మిణి)
- మోహన్ అగాశే (ప్రసాద్, జమిందారు సోదరుడు)
- కుల్భూషన్ ఖర్బందా (పోలీస్ పటేల్)
- నసీరుద్దీన్ షా (విశ్వం, జమిందారు సోదరుడు)
- సాధు మోహర్ (ప్రత్యేక పాత్ర)
- సవిత బజాజ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: శ్యామ్ బెనగళ్
- నిర్మాత: మోహన్ జె. బిల్జానీ, ఫ్రేని ఎం. వరివాయ
- రచన: విజయ్ టెండూల్కర్
- మాటలు: సత్యదేవ్ దూబే
- సంగీతం: వనరాజ్ భాటియా
- ఛాయాగ్రహణం: గోవింద్ నిహాలని
- కూర్పు: భానుదాసు దివాకర్
అవార్డులు
[మార్చు]సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1975 | మోహన్ జె. బిల్జానీ, ఫ్రేని ఎం. వరివాయ | ఉత్తమ హిందీ చిత్రం - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | గెలుపు |
1976 | మోహన్ జె. బిల్జానీ, ఫ్రేని ఎం. వరివాయ | బెంగాళీ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ - ఉత్తమ భారతీయ చిత్ర పురస్కారాలు[4] | గెలుపు |
శ్యామ్ బెనగళ్[4] | ఉత్తమ దర్శకుడు (హిందీ విభాగం) - బెంగాళీ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ పురస్కారాలు | గెలుపు | |
విజయ్ టెండూల్కర్ | ఉత్తమ స్క్రీన్ ప్లే (హిందీ విభాగం) - బెంగాళీ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ | గెలుపు | |
శ్యామ్ బెనగళ్[5] | పామ్ డి ఓర్ | ప్రతిపాదించబడింది |
మూలాలు
[మార్చు]- ↑ Ziya Us Salam (4 October 2012). "Nishant (1975)". The Hindu. Retrieved 1 July 2019.
- ↑ Shyam Benegal Awards
- ↑ The Hindu, Movies (10 June 2019). "Girish Karnad — actor with a conscience". Namrata Joshi. Archived from the original on 10 June 2019. Retrieved 1 July 2019.
- ↑ 4.0 4.1 "39th Annual BFJA Awards". BFJA Awards. Archived from the original on 2008-01-19. Retrieved 1 July 2019.
- ↑ Nishant - Awards Internet Movie Database
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నిశాంత్
- ఫిల్మీగీక్ లో నిశాంత్ సినిమా రివ్యూ Archived 2015-09-16 at the Wayback Machine