స్మితా పాటిల్
స్మితా పాటిల్ | |
---|---|
జననం | |
మరణం | 1986 డిసెంబరు 13 ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 31)
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1974–1986 |
గుర్తించదగిన సేవలు | మంథన్ (1977), భూమిక (1977), ఆక్రోష్ (1980), చక్ర (1981), చిదంబరం (1985), మిర్చ్ మసాలా (1985), గులామీ (1985) |
జీవిత భాగస్వామి | రాజ్ బబ్బర్ |
పిల్లలు | ప్రతీక్ బబ్బర్ |
తల్లిదండ్రులు | శివాజీ రావ్ గిరిధర్ పాటిల్ విద్యాతాయి పాటిల్ |
బంధువులు | విద్యా మాల్వాదే (మేనకోడలు) |
స్మితా పాటిల్ (జ.17 అక్టోబర్ 1955[1] – మ.13 డిసెంబర్ 1986[3][4]) ఒక భారతీయ సినిమా, టెలివిజన్ నటీమణి.[5] ఈమె ఒక దశాబ్దకాలంలో 80కి పైగా [2] హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది.[6] ఈ సమయంలో ఈమెకు రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ లభించాయి. భారత ప్రభుత్వం ఈమెను 1985లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఈమె నటిగా మాత్రమే కాక ఒక స్త్రీవాద ఉద్యమకారిణిగా కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈమె స్త్రీల సమస్యల పరిష్కారం పట్ల, వారి అభ్యున్నతి పట్ల నిబద్ధురాలై పనిచేసింది. సినిమాలలో భారతీయ సమాజంలోని సాంప్రదాయ స్త్రీల పాత్రలను పోషించి నాగరిక వాతావరణంలో మధ్య తరగతి స్త్రీలలో కలిగే మార్పులను, వారి లైంగిక భావనలను తన నటన ద్వారా చర్చించింది.[7]
ఈమె సినీ నటుడు రాజ్ బబ్బర్‌ను పెళ్ళాడింది. ఈమె 1986 డిసెంబర్ 13న తన 31వ యేట కాన్పు వల్ల కలిగిన సంక్లిష్టత కారణంగా మరణించింది. ఈమె మరణానంతరం ఈమె నటించిన సినిమాలు సుమారు పది విడుదలయ్యాయి. ఈమె కుమారుడు ప్రతీక్ బబ్బర్ 2008లో సినీనటుడిగా రంగప్రవేశం చేశాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]ఈమె పూనాలో[8] ఒక మరాఠా కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి శివాజీరావు గిరిధర్ పాటిల్ మహాష్ట్రకు చెందిన ఒక రాజకీయ నాయకుడు. తల్లి విద్యాతాయి పాటిల్ ఒక సామాజిక సేవకురాలు. ఈమె పూనాలోని రేణుకా స్వరూప్ మెమోరియల్ హైస్కూలులో చదివింది.
ఈమె తొలిసారి 1970లో దూరదర్శన్ లో వార్తలు చదవడం ద్వారా కెమెరా ముందు నిలబడింది.[9] ఈమె పూనాలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో డిగ్రీని పొంది శ్యాం బెనగల్ [10] చిత్రం "చరణ్‌దాస్ చోర్" తో సినిమారంగంలోకి అడుగిడింది[11] (1975).
వృత్తి
[మార్చు]స్మితా పాటిల్ ప్రధాన స్రవంతిలోని అనేక సినిమాలలో నటించడంతో పాటు సమాంతర సినిమాలలో నటించిన అగ్రనాయికల కోవలో చేరింది. [12] ఈమె మంతన్[1][11] (1977), భూమిక[1] (1977),[11] ఆక్రోష్ (1980), చక్ర (1981), చిదంబరం (1985) , మిర్చ్ మసాలా[13] (1985)[1][12] మొదలైన సినిమాలలో ఎన్నదగిన పాత్రలను వేసింది.
ఈమె షబానా అజ్మీ తరానికి చెందిన నటి. ఆమె మాదిరి ఈమె స్మితా పాటిల్ కూడా విప్లవ రాజకీయ సినిమాలలో నటించింది. ఆర్ట్ సినిమాలు లేదా సమాంతర సినిమాలుగా పిలువబడే చిత్రాలలో ఈమె శ్యాం బెనగల్,[11] గోవింద్ నిహలాని, సత్యజిత్ రే,[4] జి.అరవిందన్, మృణాల్ సేన్ వంటి దర్శకుల వద్ద పనిచేసింది. ఈమె దూరదర్శన్‌లో న్యూస్ రీడర్‌గా కూడా పనిచేసింది. శ్యాం బెనగల్ ఈమెను ఒక ఫోటోగ్రాఫర్‌గా కూడా గుర్తించాడు.[14]
1984లో ఈమె మాంట్రియల్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించింది.[15] కేతన్ మెహతా 1987లో తీసిన "మిర్చ్ మసాలా" చిత్రంలో ఈమె నటనను ఫోర్బ్స్ పత్రిక "భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనల" జాబితాలో చేర్చింది.[16]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఈమె సినీ నటుడు రాజ్ బబ్బర్ తో ప్రేమాయణ కొనసాగించడం[17] ఆమె అభిమానులు, ప్రసార మాధ్యమాల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజ్ బబ్బర్ తన భార్య నదీరా బబ్బర్‌ను వదిలివేసి ఈమెను వివాహం చేసుకున్నాడు.[18]
మరణం
[మార్చు]ఈమె ప్రతీక్ బబ్బర్‌ను కన్న తరువాత రెండు వారాల తరువాత కాన్పు వల్ల కలిగిన అనారోగ్య సమస్యల కారణంగా 1986, డిసెంబర్ 13న మరణించింది.[4][19]
అవార్డులు
[మార్చు]Award | Film | Character | Year | Result | Notes |
---|---|---|---|---|---|
జాతీయ ఉత్తమ నటి పురస్కారం | భూమిక | ఉష/ఊర్వశి డాల్వి | 1977 | గెలుపు | |
చక్ర | అమ్మ | 1980 | గెలుపు | ||
ఉత్తమనటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం | జైత్ రే జైత్ | చింధీ | 1978 | గెలుపు | మరాఠీ సినిమా |
భూమిక | ఉష/ఊర్వశి డాల్వి | 1978 | ప్రతిపాదించబడింది | ||
ఉంబర్తా | సులభా మహాజన్ | 1981 | గెలుపు | మరాఠీ సినిమా | |
చక్ర | అమ్మ | 1982 | గెలుపు | ||
బజార్ | నజ్మా | 1983 | ప్రతిపాదించబడింది | ||
ఆజ్ కీ ఆవాజ్ | రజనీ దేశ్‌ముఖ్ | 1985 | ప్రతిపాదించబడింది | ||
ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం | అర్థ్ | కవితా సన్యాల్ | 1984 | ప్రతిపాదించబడింది | |
మండీ | జీనత్ | 1984 | ప్రతిపాదించబడింది | ||
పద్మశ్రీ, భారత ప్రభుత్వం చే పౌర పురస్కారం | 1985 |
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1974 | మేరే సాత్ చల్ | గీత | |
1974 | సామ్నా[3][20] | కమ్లీ | మరాఠీ సినిమా |
1975 | నిశాంత్ | రుక్మిణి[11] | |
1975 | చరణ్‌దాస్ చోర్ | రాకుమారి | |
1976 | మంతన్[3] | బిందు | |
1977 | భూమిక[3][21] | ఊర్వశి డాల్వి | జాతీయ ఉత్తమనటి పురస్కారం |
1977 | జైత్ రే జైత్[20] | చిందీ | మరాఠీ సినిమా 25వ జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ మరాఠీ చిత్రంగా రాష్ట్రపతి రజిత పతకం |
1977 | సాల్ సోల్వన్ ఛడ్‌యా | పింకీ | పంజాబీ సినిమా |
1978 | కొందూరా / అనుగ్రహం | పార్వతి | హిందీ / తెలుగు సినిమా |
1978 | గమన్ | ఖైరమ్ హుసేన్ | |
1978 | సర్వసాక్షి | సుజాత | మరాఠీ సినిమా |
1980 | భవానీ భవై[1] | ఉజాన్ | గుజరాతీ సినిమా |
1980 | ఆక్రోష్ | నాగి లాహన్య | |
1980 | ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యో ఆతాహై | జోన్ | |
1980 | ది నక్సలైట్స్ | అజిత | |
1980 | అన్వేషణె | రేవతి[22] | కన్నడ సినిమా |
1981 | చక్ర | అమ్మ | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి పురస్కారం, జాతీయ ఉత్తమనటి పురస్కారం |
1981 | సద్గతి | ఝరియా | టెలి ఫిలిం |
1981 | తజుర్బా | ||
1982 | అర్థ్ | కవితా సన్యాల్ | |
1982 | బద్లేకీ ఆగ్ | బిజిలీ | |
1982 | బజార్ | నజ్మా | |
1982 | భీగీ పల్కె | శాంతి | |
1982 | దర్ద్ కా రిస్తా | డా.అనూరాధ | |
1982 | దిల్ ఏ నాదాన్ | షీలా | |
1982 | నమక్ హలాల్ | పూనమ్ | |
1982 | శక్తి | రోమా దేవి | |
1982 | సితమ్ | మీనాక్షి | |
1982 | సుబాహ్ | మరాఠీ సినిమా ఉంబర్తాకు హిందీ డబ్బింగ్ | |
1982 | ఉంబర్తా[1][3] | సులభా మహాజన్ | మరాఠీ సినిమా, హిందీలోనికి 'సుబాహ్' అనే పేరుతో డబ్బింగ్ చేయబడింది. ఉత్తమ నటిగా మహారాష్ట్ర ప్రభుత్వం నుండి చిత్రపథ్ పురస్కారం. |
1983 | మండీ | జీనత్[11] | |
1983 | ఘుంగ్రూ | కేసర్ బాయి | |
1983 | అర్ధ్ సత్య[3][21] | Jyotsna Gokhale | |
1983 | ఖయామత్ | శశి | |
1983 | హాద్సా | ఆశా | |
1983 | చట్‌పటి | ||
1984 | ఆజ్ కీ | రజనీ దేశ్‌ముఖ్ | |
1984 | రావణ్ | గంగా | |
1984 | పేట్ ప్యార్ ఔర్ పాప్ | ||
1984 | మేరా దోస్త్ మేరా దుష్మన్ | లల్లీ | |
1984 | తరంగ్[3] | జానకి | |
1984 | శపథ్ | శాంతి | |
1984 | కానూన్ మేరీ ముఠ్ఠీమే | ||
1984 | గిద్ద్ | హనుమి | |
1984 | ఆనంద్ ఔర్ ఆనంద్ | కిరణ్ | |
1984 | ఫరిస్తా | కాశీబాయ్ | |
1984 | హమ్ దో హమారే దో | ||
1984 | కసమ్ పైదా కర్నే వాలే కీ | ఆరతి | |
1985 | చిదంబరం[3] | శివగామి | మలయాళం సినిమా |
1985 | గులామీ | సుమిత్ర సుల్తాన్ సింగ్ | |
1985 | దేబాషిషు | సీత | బెంగాలీ సినిమా[23] |
1985 | ఆఖిర్ క్యో? | నిషా | |
1985 | మేరా ఘర్ మేరే బచ్చే | గీతా భార్గవ్ | |
1985 | జవాబ్ | రజని / రాధా గుప్తా / ఫ్రెడీ మార్టిస్/ సల్మా హుసేన్ | |
1986 | ఆప్ కే సాథ్ | గంగా | |
1986 | అమృత్ | కమలా శ్రీవాత్సవ్ | |
1986 | దిల్‌వాలా | సుమిత్రాదేవి | |
1986 | దెహ్లీజ్ | దీప | |
1986 | అంగారే | ఆర్తి వర్మ | |
1986 | కాంచ్ కి దీవార్ | నిషా | |
1986 | అనోఖా రిస్తా | డా.ప్రమీలా | |
1986 | తీస్రా కినారా | ||
1987 | మిర్చ్ మసాలా | సోన్‌బాయి | |
1987 | డ్యాన్స్ డ్యాన్స్ | రాధ | |
1987 | టికానా | శశి గోయల్ | |
1987 | సూత్రధార్ | ప్రేరణ | |
1987 | ఇన్‌సానియత్ కే దుష్మన్ | లక్ష్మీనాథ్ | |
1987 | అహ్సాన్ | ||
1987 | రాహీ | రానో/సంధ్య | |
1987 | నజ్రానా | ముక్తా | |
1987 | ఆవామ్ | డా.షబ్నమ్ | |
1987 | షేర్ శివాజీ | ||
1988 | వారిస్ | పరమ్‌జీత్ | |
1988 | హమ్ ఫరిస్తే నహీఁ | Roma | |
1988 | ఆకర్షణ్ | - | ప్రత్యేక పాత్ర |
1989 | గలియోంకా బాద్‌షా | తులసి |
ప్రభుత్వ గుర్తింపు
[మార్చు]2012లో ఈమె గౌరవార్థం " స్మితా పాటిల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్" నిర్వహించారు.[24] [2] 2013, మే 3వ తేదీన భారత ప్రభుత్వం తపాలా శాఖవారు భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈమె గౌరవార్థం ఒక స్మారక తపాలాబిళ్ల విడుదల చేసింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Subodh Kapoor (1 July 2002). The Indian Encyclopaedia: Biographical, Historical, Religious, Administrative, Ethnological, Commercial and Scientific. Indo-Pak War-Kamla Karri. Cosmo Publication. pp. 6699–. ISBN 978-81-7755-257-7. Retrieved 29 December 2012.
- ↑ 2.0 2.1 D. Sharma (1 January 2004). Mass Communication : Theory & Practice In The 21St Century. Deep & Deep Publications. pp. 298–. ISBN 978-81-7629-507-9. Retrieved 29 December 2012.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 Annette Kuhn (1990). The Women's Companion to International Film. University of California Press. pp. 310–. ISBN 978-0-520-08879-5. Retrieved 29 December 2012.
- ↑ 4.0 4.1 4.2 Andrew Robinson (1989). Satyajit Ray: The Inner Eye. University of California Press. pp. 258–. ISBN 978-0-520-06946-6. Retrieved 29 December 2012.
- ↑ "A blazing talent remembered". The Hindu. 20 December 2002. Archived from the original on 3 అక్టోబరు 2003. Retrieved 2 మే 2017.
- ↑ Gulzar; Nihalani, Govind; Chatterji, Saibal (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. p. 601. ISBN 81-7991-066-0.
- ↑ [1] Archived 2007-08-14 at the Wayback Machine "Reminiscing About Smita Patil"
- ↑ http://www.sscnet.ucla.edu/southasia/Culture/Cinema/Smita.html
- ↑ Gulazāra; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema: An Enchanting Close-Up of India's Hindi Cinema. Popular Prakashan. pp. 625–. ISBN 978-81-7991-066-5. Retrieved 29 December 2012.
- ↑ Si. Vi Subbārāvu (2007). Hyderabad: the social context of industrialisation, 1875-1948. Orient Blackswan. pp. 82–. ISBN 978-81-250-1608-3. Retrieved 29 December 2012.
- ↑ 11.0 11.1 11.2 11.3 11.4 11.5 William van der Heide (12 June 2006). Bollywood Babylon: Interviews with Shyam Benegal. Berg. pp. 208–. ISBN 978-1-84520-405-1. Retrieved 29 December 2012.
- ↑ 12.0 12.1 Lahiri, Monojit (2002-12-20). "A blazing talent remembered". The Hindu. Archived from the original on 2003-10-03. Retrieved 2011-02-01.
- ↑ Hena Naqvi (1 January 2007). Journalism And Mass Communication. Upkar Prakashan. pp. 202–. ISBN 978-81-7482-108-9. Retrieved 29 December 2012.
- ↑ "Indian Cinema - Smita Patil", SSCnet UCLA
- ↑ "Awards of the Montreal World Film Festival - 1984". Montreal World Film Festival. Archived from the original on 13 మార్చి 2014. Retrieved 13 March 2014.
- ↑ Prasad, Shishir; Ramnath, N. S.; Mitter, Sohini (27 April 2013). "25 Greatest Acting Performances of Indian Cinema". Forbes. Archived from the original on 12 జనవరి 2016. Retrieved 27 January 2015.
- ↑ "'She was a great human being'". Rediff.com. 13 December 2006. Retrieved 27 Dec 2011.
- ↑ "'25 years on, a phenomenon named Smita Patil '". ibnlive.in.com. 13 December 2006. Archived from the original on 8 జనవరి 2012. Retrieved 27 Dec 2011.
- ↑ Ram Awatar Agnihotri (1998). Film stars in Indian politics. Commonwealth Publishers. ISBN 978-81-7169-506-5. Retrieved 29 December 2012.
- ↑ 20.0 20.1 "Marathi Cinema Database". Archived from the original on 2019-07-07. Retrieved 2017-05-02.
- ↑ 21.0 21.1 Anwar Huda (1 January 2004). Art And Science Of Cinema. Atlantic Publishers & Dist. pp. 52–. ISBN 978-81-269-0348-1. Retrieved 29 December 2012.
- ↑ "Anveshane Movie Plot". Archived from the original on 2016-03-05. Retrieved 2017-05-02.
- ↑ "Debashishu". Archived from the original on 2009-07-17. Retrieved 2017-05-02.
- ↑ staff. "Smita Patil Documentary and Short Film Festival". Time Out. Retrieved 19 December 2015.
బయటి లింకులు
[మార్చు]- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- 1955 జననాలు
- 1986 మరణాలు
- భారతీయ సినిమా నటీమణులు
- మరాఠీ సినిమా నటీమణులు
- మరాఠీ వ్యక్తులు
- హిందీ సినిమా నటీమణులు
- మలయాళ సినిమా నటీమణులు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు
- గుజరాతీ సినిమా నటీమణులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
- ముంబై విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థులు
- మరాఠీ రంగస్థల కళాకారులు