చిదంబరం (సినిమా)
Jump to navigation
Jump to search
చిదంబరం | |
---|---|
దర్శకత్వం | జి. అరవిందన్ |
స్క్రీన్ ప్లే | జి. అరవిందన్ |
కథ | సి.వి. శ్రీరామన్ |
నిర్మాత | జి. అరవిందన్ |
తారాగణం | భరత్ గోపి స్మితా పాటిల్ శ్రీనివాసన్ మోహన్ దాస్ |
ఛాయాగ్రహణం | షాజీ ఎన్. కరున్ |
సంగీతం | జి. దేవరాజన్ |
నిర్మాణ సంస్థ | సూర్యకాంతి |
పంపిణీదార్లు | ఎస్ఏజె మూవీస్ |
విడుదల తేదీ | 1985, మార్చి 8 |
సినిమా నిడివి | 100 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మళయాలం |
చిదంబరం, 1985 మార్చి 8న విడుదలైన మలయాళ సినిమా. జి. అరవిందన్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన ఈ సినిమా సి.వి. శ్రీరామన్ రాసిన ఒక చిన్న కథ ఆధారంగా తెరకెక్కింది.[1] [2][3][4] ఇందులో భరత్ గోపి, స్మితా పాటిల్, శ్రీనివాసన్, మోహన్ దాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కరాలలో ఉత్తమ చలనచిత్రం అవార్డును, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వంతోపాటు ఐదు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది .
నటవర్గం
[మార్చు]- శ్రీనివాసన్ (మునియాండి)
- భరత్ గోపి (శంకరన్)
- స్మితా పాటిల్ (శివకామి)
- ఇన్నోసెంట్
- నేదుముడి వేణు
- మురళి (చెరియాన్)
- డా. మోహన్‌దాస్ (జాకబ్)
- జేమ్స్
పాటలు
[మార్చు]జి. దేవరాజన్ సంగీతం అందించాడు.
క్రమసంఖ్య | పాట | గాయకులు | సాహిత్యం | నిడివి (ని:సె) |
---|---|---|---|---|
1 | అట్టిలేపోకుం తన్నీ | సీర్కాజీ శివచిదంబరం | ||
2 | అనితినుడై (బిట్) | సంప్రదాయక | ||
3 | మార్ఘజి (బిట్) | సంప్రదాయక | ||
4 | థాలిర్ | పి. మాధురి | సంప్రదాయక | |
5 | తోండా రాండమ్ | పి. మాధురి | ||
6 | ఉన్నములై ఉమయలోదం | పి. మాధురి |
నిర్మాణం
[మార్చు]సి.వి. శ్రీరామన్ రాసిన కథను సినిమాగా తీయాలని అరవిందన్ నిర్ణయించుకొని, మూడు సంవత్సరాలపాటు ప్రయత్నించినా నిర్మాతలు దొరకలేదు. దాంతో తానే ఈ సినిమాని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. మంచి బడ్జెట్‌తో ఈ సినిమాని తీశాడు. ఇడుక్కి జిల్లాలోని మున్నార్ సమీపంలోని మాటుపెట్టిలో ఈ సినిమా షూటింగ్ జరిగింది.[5]
అవార్డులు
[మార్చు]సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1985 | జి. అరవిందన్ | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా | గెలుపు |
జి. అరవిందన్ | ఉత్తమ దర్శకుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు | గెలుపు | |
జి. అరవిందన్ | ఉత్తమ సినిమాగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు[6] | గెలుపు | |
భరత్ గోపి | ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ "G.Aravindan: Chidambaram". Cinemaofmalayalam.net. Archived from the original on 11 December 2010. Retrieved 2021-06-18.
- ↑ "Chidambaram". www.malayalachalachithram.com. Retrieved 2021-06-18.
- ↑ "Chidambaram". malayalasangeetham.info. Archived from the original on 22 October 2014. Retrieved 2021-06-18.
- ↑ "Chidambaram". spicyonion.com. Archived from the original on 22 October 2014. Retrieved 2021-06-18.
- ↑ "Interview: Aravindan". Cinemaofmalayalam.net. Archived from the original on 11 December 2010. Retrieved 2021-06-18.
- ↑ Kerala State Film Awards Archived 19 నవంబరు 2009 at the Wayback Machine