మున్నార్
మున్నార్ | |
---|---|
హిల్ స్టేషను | |
Nickname: దక్షిణ భారత కాశ్మీరు | |
Coordinates: 10°05′21″N 77°03′35″E / 10.08917°N 77.05972°E | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | ఇదుక్కి జిల్లా |
Named for | టీ తోటలు, చల్లటి వాతావరణం |
Government | |
• Type | పంచాయితీ |
• Body | మున్నార్ గ్రామ పంచాయితీ |
విస్తీర్ణం | |
• Total | 187 కి.మీ2 (72 చ. మై) |
Elevation | 1,532 మీ (5,026 అ.) |
జనాభా (2001) | |
• Total | 38,471 |
• జనసాంద్రత | 210/కి.మీ2 (530/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | మలయాళం, English |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 685612 |
Telephone code | 04865 |
Vehicle registration | KL-68, KL-06 |
అక్షరాస్యత | 76% |
మున్నార్ కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న పట్టణం, హిల్ స్టేషను. మున్నార్ సుమారు 1,600 మీ. ఎత్తున పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలోఉంది. [2] మున్నార్ ను "దక్షిణ భారత కాశ్మీర్" అని కూడా పిలుస్తారు. హనీమూన్ వెళ్ళేవారికి ఇది ప్రసిద్ది. మున్నార్‌లోని పూర్వపు కుందా వ్యాలీ రైల్వే 1924 లో వచ్చిన వరదల్లో ధ్వంసమైంది. అయితే పర్యాటకులను ఆకర్షించడానికి రైల్వే మార్గాన్ని పునర్నిర్మించాలని పర్యాటక అధికారులు పరిశీలిస్తున్నారు. [3]
పద చరిత్ర
[మార్చు]మున్నార్ అంటే "మూడు నదులు" అని అర్ధం.[4] ముదిరపుళ, నల్లతన్ని, కుండలి అనే మూడు నదుల సంగమం వద్ద ఉన్న ప్రదేశం మున్నార్ అని సూచిస్తుంది. [5]
స్థానం
[మార్చు]మున్నార్ యొక్క భౌగోళిక నిర్దేశాంశాలు 10 ° 05′21 ″ N 77 ° 03′35 ″ E. మున్నార్ పట్టణం దేవికులం తాలూకాలోని కన్నన్ దేవన్ హిల్స్ లో ఉంది. దాదాపు 557 చ.కి.మీ. లతో విస్తీర్ణం గల మున్నార్, ఇడుక్కి జిల్లాలో కెల్లా అతిపెద్ద పంచాయతీ.
త్రోవ
[మార్చు]మున్నార్‌కు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు ఉన్నాయి. ఈ పట్టణం కొచ్చి - ధనుష్కోడి జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 49) లో కొచ్చి నుండి 130 కి.మీ., ఆదిమాలి నుండి 31 కి.మీ., ఆదిమాలి నుండి, తమిళనాడులోని ఉడుమలైపెట్టై నుండి 85 కి.మీ., నెరియమంగళం నుండి 60 కి.మీ. దూరంలో ఉంది.
రైల్వే
[మార్చు]సమీప ప్రధాన రైల్వే స్టేషన్లు ఎర్నాకుళం, అలువా (రోడ్డు ద్వారా సుమారు 140 కి.మీ). సమీప ఫంక్షనింగ్ రైల్వే స్టేషన్ ఉడుమలైపెట్టై వద్ద ఉంది.
విమానాశ్రయం
[మార్చు]సమీప విమానాశ్రయం 110 కి.మీ. దూరంలో ఉన్న కొచ్చిలో ఉంది. కోయంబత్తూర్, మదురై విమానాశ్రయాలు 165 కి.మీ. దూరంలో ఉన్నాయి.
వృక్ష జంతుజాలాలు
[మార్చు]తోటల పెంపకం ఫలితంగా ఆవాస ప్రాంతాలు విచ్ఛిన్నమయ్యాయి. ఈ కారణంగా మున్నార్ లోని స్థానిక వృక్షజాలం, జంతుజాలం చాలావరకు కనుమరుగయ్యాయి. అయితే, కొన్ని జాతులు జీవించి, సమీపంలోని రక్షిత స్థలాల్లో వృద్ధి చెందుతున్నాయి. తూర్పున ఉన్న కురింజిమల అభయారణ్యం, ఈశాన్యం లోని చిన్నార్ అభయారణ్యం, మంజంపట్టి లోయ, ఇందిరా గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం లోని అమరావతి అడవి, ఉత్తరాన ఎర్నాకుళంలో నేషనల్ పార్కు, అనముడి షోలా నేషనల్ పార్కు, దక్షిణాన పంపడం షోలా నేషనల్ పార్కు, తూర్పున ప్రతిపాదిత పళని హిల్స్ నేషనల్ పార్క్ వంటివి ఈ రక్షిత స్థలాల్లో కొన్ని.
స్థానిక జాతులు
[మార్చు]ఈ రక్షిత ప్రాంతాల్లో అనేక క్షీణిస్తున్న జాతులకు చెందిన జీవులున్నాయి. నీలగిరి థార్, నెరసిన వన్నె పెద్ద ఉడుత, నీలగిరి వుడ్ పిజియన్, ఏనుగు, గౌర్, నీలగిరి లంగూర్, సాంబార్, నీలకురింజి (పన్నెండేళ్ళకు ఒకసారి పూచే మొక్క) వీటిలో కొన్ని. [6] [7]
భూమి యాజమాన్యం
[మార్చు]ల్యాండ్ మాఫియా ఆస్తులను కబ్జా చెయ్యడం మున్నర్‌లో పెద్ద సమస్య. 2011 లో, ప్రభుత్వం 20,000 హెక్టార్ల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నట్లు అంచనా వేసింది. ఈ ఆక్రమణలను ఎత్తివేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. [8]
మున్నార్‌లో చెయ్యదగ్గ పనులు
[మార్చు]మున్నార్‌లో నాలుగు ప్రధాన దిశల్లో పర్యటనకు వెళ్ళవచ్చు.మట్టుపట్టి వైపు, తెక్కెడి వైపు, ఆదిమాలి వైపు, కోయంబత్తూర్ వైపు. మున్నార్‌లో పర్యాటకానికి వాతావరణం, టీ తోటలూ ఆధారం. చుట్టూ పరుచుకుని ఉన్న పచ్చటి తివాచీ లాంటి ప్రకృతిని చూడటానికి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. దేశవ్యాప్తంగా వేసవి సెలవుల రోజులైన ఏప్రిల్ - మే నెలల్లో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.
భౌగోళికం, శీతోష్ణస్థితి
[మార్చు]మున్నార్ ఎత్తు సముద్ర మట్టం నుండి 1,450 మీ. - 2,695 మీ. ఎత్తున ఉంది. ఉష్ణోగ్రత శీతాకాలంలో 5 - 25oC మధ్య, వేసవిలో 15 -25 oC ల మధ్య ఉంటుంది. అత్యల్పంగా, మున్నార్ లోని సెవెన్మల్లె ప్రాంతంలో -4oC నమోదైంది. [9]
శీతోష్ణస్థితి డేటా - Munnar | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 22.4 (72.3) |
23.7 (74.7) |
25.3 (77.5) |
25.6 (78.1) |
25.6 (78.1) |
23.7 (74.7) |
22.4 (72.3) |
22.8 (73.0) |
23.2 (73.8) |
22.7 (72.9) |
21.8 (71.2) |
21.9 (71.4) |
23.4 (74.2) |
రోజువారీ సగటు °C (°F) | 17.6 (63.7) |
18.7 (65.7) |
20.2 (68.4) |
21 (70) |
21.4 (70.5) |
20.3 (68.5) |
19.3 (66.7) |
19.5 (67.1) |
19.6 (67.3) |
19.2 (66.6) |
18.3 (64.9) |
17.7 (63.9) |
19.4 (66.9) |
సగటు అల్ప °C (°F) | 12.9 (55.2) |
13.7 (56.7) |
15.1 (59.2) |
16.5 (61.7) |
17.3 (63.1) |
16.9 (62.4) |
16.3 (61.3) |
16.3 (61.3) |
16 (61) |
15.7 (60.3) |
14.8 (58.6) |
13.5 (56.3) |
15.4 (59.8) |
సగటు అవపాతం mm (inches) | 18 (0.7) |
29 (1.1) |
47 (1.9) |
129 (5.1) |
189 (7.4) |
420 (16.5) |
583 (23.0) |
364 (14.3) |
210 (8.3) |
253 (10.0) |
164 (6.5) |
64 (2.5) |
2,470 (97.3) |
సగటు వర్షపాతపు రోజులు | 2 | 2 | 3 | 6 | 8 | 9 | 10 | 9 | 10 | 12 | 8 | 5 | 84 |
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు | 248 | 232 | 248 | 240 | 217 | 120 | 124 | 124 | 150 | 155 | 180 | 217 | 2,255 |
Source 1: Climate-Data.org, altitude: 1461m[10] | |||||||||||||
Source 2: Weather2Travel for sunshine and rainy days[11] |
గ్యాలరీ
[మార్చు]-
మున్నార్ వద్ద ఒక అందమైన సూర్యోదయ దృశ్యం.
-
మున్నార్ వద్ద టీ తోటలు
-
మున్నార్ టీ మ్యూజియం
-
మున్నార్ టీ తోటల అందమైన దృశ్యం
-
మున్నార్ వద్ద మేఘాలతో కప్పబడిన పర్వత శ్రేణులు
-
మున్నార్ హెరిటేజ్ టూర్, లాక్హార్ట్ టీ ఫ్యాక్టరీ
-
నీలగిరి థార్
-
చోకర్ముడి వ్యూ పాయింట్
-
కుండల ఆనకట్ట, సరస్సు
-
అట్టుకాడ్ జలపాతం
-
టీ తోటల దృశ్యం
-
లాక్హార్ట్ టీ మ్యూజియం
మూలాలు
[మార్చు]- ↑ Munnar - Fallingrain
- ↑ "Munnar - the Hill Station of Kerala in Idukki | Kerala Tourism". Archived from the original on 2014-01-18. Retrieved 2020-02-16.
- ↑ "Munnar May Soon Get Train Service, Nearly A Century After The 'Great Flood Of 99' Destroyed It".
- ↑ Munnar History Archived 5 ఫిబ్రవరి 2012 at the Wayback Machine
- ↑ "Munnar". Archived from the original on 2014-01-18. Retrieved 2020-02-16.
- ↑ "Government of Kerala, Forest and Wildlife Department, Notification No. 36/2006 F&WLD". Kerala Gazette. 6 October 2006. Archived from the original on 30 డిసెంబరు 2007. Retrieved 2007-12-05.
- ↑ Roy, Mathew (25 September 2006). "Proposal for Kurinjimala sanctuary awaits Cabinet nod". The Hindu. Retrieved 2007-12-05.
- ↑ Jacob, Jeemon (12 July 2011). "Kerala government launches eviction drive in Munnar". Archived from the original on 27 ఆగస్టు 2012. Retrieved 2014-07-10.
- ↑ Frost hits plantations in Munnar Archived 2004-03-13 at the Wayback Machine[ఆధారం యివ్వలేదు]
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Climate-Data.org
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Munnar Climate and Weather Averages, Kerala". Weather2Travel. Retrieved 2013-08-28.