మదురై

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?మదురై
Tamil Nadu • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 9°56′N 78°07′E / 9.93°N 78.12°E / 9.93; 78.12
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
109 కి.మీ² (42 చ.మై)
• 8 మీ (26 అడుగులు)
జిల్లా(లు) Madurai district జిల్లా
జనాభా
జనసాంద్రత
9,28,869[1] (2001)
• 8,522/కి.మీ² (22,072/చ.మై)
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 625 0xx
• +452
• TN-58, TN-59 and TN-64
వెబ్‌సైటు: www.maduraicorporation.in


మదురై (ఆంగ్లము:Madurai తమిళం:மதுரை మరాఠి:मदुरै)దక్షిణ తమిళనాడులోని ప్రముఖ నగరము. అదే పేరుగల జిల్లాకు కేంద్రము. మదురై ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రము. ఇది వైగై నదీ తీరాన ఉంది. తమిళనాడులో మదురై పెద్దనగరాలలో మూడవ శ్రేణిలో ఉంది. 2001 జనాభా గణాంకాలను ప్రకారం మదురై నగర జనాభా 12,00,000.

మదురై ప్రపంచంలోని పురాతనకాల నివాస నగరాలలో ఒకటి. మదురై నగరం మదురై జిల్లా కేంద్రంలో పాండ్యులు ముందుగా కొర్కైని రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత పాండ్యులు నెడుంజళియన్ కాలంలో కూడల్ నగరానికి వారి రాజధానిని మార్చుకున్నారు. ఆ నగరమే ప్రస్తుత రాజధాని. మదుర నాయక మహారాజు చేత నిర్మించబడిన మీనాక్షీ కోవెలకు మదురై ప్రసిద్ధి చెంది ఉంది. ద్రవిడ సంప్రదాయాన్ని ప్రతిబింబింస్తున్న మదురై మీనాక్షీ ఆలయం భారతీయుల ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. మదురకు కూడలి నగరం, మల్లెల నగరం, ఆలయనగరం, నిద్రించని నగరం మరియు నాలుగు కూడలుల నగరంగా ప్రసిద్ధి కలిగి ఉంది.

భారతదేశంలో పర్యటించిన గ్రీకు దూత మెగస్తనీస్ 3వ శతాబ్దంలో మదురై నగరాన్ని గురించి ప్రస్తావించాడు. మౌర్య చక్రవర్తి ప్రధాన మంత్రి కౌటిల్యుడు ఈ నగర ప్రస్తావన చేసాడు. క్రీ. శ 14వ శతాబ్దం ఆరంభంలో తమిళనాడు మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన పాండ్యరాజుల ఆదర్శపాలన మరియు సాంస్కృతిక కేంద్రంగా మదురై విలసిల్లింది. 1311లో పాండ్య సింహాసనం ఢిల్లీ నవాబుల చేతిలో పతనం చేయబడింది. బాబర్ రాజ్యంలోకి చేరిన ఈ నగరం తరువాత బాబర్ సమ్రాజ్యం పతనావస్థకు చేరిన తరువాత 14వ శతాబ్దంలో స్వతంత్రం పొంది విజయనగర సామ్రాజ్యంలో భాగం అయింది. విజయనగర రాజప్రతినిధులు మదురై నాయక్ రాజుల ఆధ్వర్యంలో ఈ నగరం అభివృద్ధి చేయబడి తరువాత 1559 నుండి 1736 వరకు స్వతంత్రంగా ఉంది. కొంతకాలం కర్నాటక రాజులైన చందాసాహెబ్ ఆధ్వర్యంలో ఉన్న మదురై 1801 నాటికి ఈస్టిండియా కంపెనీ అధికారంలోకి వచ్చింది.

మీనాక్షి దేవాలయం[మార్చు]

ఇక్కడ పాండ్య రాజులు కట్టించిన మీనాక్షి దేవాలయం మిక్కిలి ప్రసిద్ధి చెందినది.

మీనాక్షి దేవాలయ చిత్రము

నామచరిత్ర[మార్చు]

ఈ నగరానికి మదురై అన్న పేరు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నగాన్ని మదురై, నాలు మాడ కూడలి, కూడఒల్ నగర్, తిరువలవై, ఆలవై అని పలు విధములుగా పిలువబడింది. మదురై అన్న పేరు రావడానికి కారణంగా చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మదురై అంటే తమిళంలో తీయనిది అని అర్ధం. మరొక కథనాన్ని అనుసరించి మారుతము అనే మాట మదురగా మారిందని అభిప్రాయపడుతున్నారు. వైగై నదీతీరాన ఉన్న వృక్షముల నుండి వచ్చే మనసును పరవశింపజేసే మారుతం కారణంగా సంగకాలంలో ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. పురాణాల అధారంగా ఇక్కడ సంభవించిన సునామీ కారణంగా ఈ ప్రదేశం ప్రాచీన కుమరిఖండం నుండి విడిపడి ప్రస్తుత మదురై నగరం ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. దిండిగల్ సమీపంలో వడమదురై అనే ఊరు ఉంది అలాగే శివగంగై జిల్లాలో మానామదురై అనే ఊరు ఉంది. చారిత్రకంగా 17వ శతాబ్దంలో పరంజ్యోతి మునివర్ చేత రచించబడిన తిరువిళయడల్ పద్య కావ్యపురాణంలో తిరువాలవై మాన్మియం అని ప్రస్తావించబడింది. మరొక పురాణంలో పరమశివుడు ఈ నగరాన్ని ఆశీర్వదించి తన తాళగతిలో నుండి ఈ నగరంమీద దివ్య మకరందాన్ని కురిపించాడని సంస్కృతంలో మకరందానికి మధువు అన్న పేరు ఉన్న కారణంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉంది.

చరిత్ర[మార్చు]

వైగై నదీతీరంలో పురాతన మదురై చిత్రం

మదురై నగరానికి చక్కగా నమోదు చేయబడిన దీర్ఘకాల చరిత్ర ఉంది. ఈ నగరం క్రీ. శ 3వ శతాబ్దంలో వ్రాయబడిన గ్రీకుదూత మెగస్తనీసు వ్రాతలలో మెథొర గా ప్రస్తావించబడినది. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో ఈ నగర ప్రస్తావన ఉంది. సంగకాల సాహిత్యంలో ప్రత్యేకంగా మదురైకాంచి గ్రంధంలో పాండ్యసామ్రాజ్యంలో ఒక భాగంగా ఈ నగరం ప్రస్థావించబడింది. 2వ శతాబ్దంలో రచించబడిన సిలప్పదికారం కావ్యంలో ఈ నగరవర్ణన చోటుచేసుకున్నది. క్రీ. పూ 300- క్రీ. పూ 200 కాలంలో తమిళ సంగానికి మదురై నగరం ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రాచీన రోమ్ వ్రాతలలో మదురై మధ్యధరా సముద్రతీర వాణిజ్యకేంద్రంగా వర్ణించబడింది. గ్రీకుల మ్యాపులలో మదురై ఉన్న ఆధారాలు ఉన్నాయి.

చరిత్రకి తెలియవచ్చిననాటి నుండియు వైఘనదీ తీరముననున్న మధురానగరము సర్వసంపదలకు నిలయమై శోభిల్లినది. ఈ నగరరాజము తొలుత పాండ్యవంశస్థుల ఆధీనములో ఉండేది. పాండ్యభూపతులు బలహీనులుకాగా వారిని జయించి చోళవంశయులు మధూను చేజిక్కించుకున్నారు. గంగైక్కొండచోళ బిరుద విరాజితుడగు రాజేంద్రచోళుడు మధురను పాలించిన ప్రప్రధమ చోళ మహీపతియని చరిత్రకారుల అభిప్రాయము.13వ శతాబ్దము నాటికి చోళుల ప్రాబల్యము తగ్గినదు. తగిన తరుణమునకై వేచియున్న పాండ్యులు బలము చేకూర్చుకొని మధురను వశము చేసుకొనిన యత్నించిరి. కాని లాభము లేకపోయింది. ఇది యిట్లుండగా క్రీ.శ.1310 లో ఢిల్లీ పాదుషాయగు అలాయుద్దీనుచే ప్రేరేపితుడై మాలిక్కాఫరు సేనాని దక్షిణాపధముపై దండెత్తివచ్చి విజయములు సాధించుచుండెను. పాండ్యమండలము (మధుర) కూడ అతనికి స్వాధీన మయ్యెను. మాలిక్ కాఫరు జైత్రయాత్రవలన దక్షిణభారతమున హైందవ రాజ్యభానుడు నల్లని మేఘముల చాటున మాటుపడెను. విజయనగర సామ్రాట్టుల పక్షమున మధురనేలిన వారిలో పేర్కొనదగినవారు కోట్యము నాగమనాయకుని వంశస్థులగు నాయకరాజులు. తొలుత వీరు విజయనగరసామంతులగ వ్యవహరించుచు వచ్చినను పిమ్మట స్వాతంత్ర్యము ప్రకటించుకొని స్వతంత్రరాజులయిరి. వీరి పరిపాలనమునకు శాశ్వత చిహ్నములుగ పాండ్యమండలము (మధుర) నందు ఎక్కడ చూచిన నాయకరాజులు నిర్మించిన మహోన్నతములైన ఆలయములు, శత్రుదుర్భేద్యములగు దుర్గరాజములు, అందాలు చిందు శిల్పకళాఖండములు, సుందర మందిరములు, సత్రములు నేటికి కళకళ లాడుచున్నవి.మధుర నేలిన రాజులకు సంబంధించిన చారిత్రిక లేఖనములు తెలుగు, తమిళములందు కలవు. వీనిలో మధురైత్తలవరలారు అతి ముఖ్యమైనది. దీనిలో మధురను పాలించిన రాజులెల్లరు పేర్కొనబడిరి. అటుపై క్రీ.శ. 1481 నుండి నాగమనాయకుని కుమారుడు విశ్వనాధనాయనయ్య మధురను 12 సం పాలించెను. అటుపై ఈయన కుమారుడు కృష్ణప్ప 9 సం.లు పాలించి అస్తమించెను. అటుపై 14 సం.లు కృష్ణప్పనాయన్నయ్య కుమారుడు వీరప్ప నాయనయ్య రాజ్యం చేసి స్వర్గస్థులయిరి. అయ్యన తరువాత వీరి కుమారుడు 7 సం.లు కుమారకృష్ణప్ప నాయనయ్య రాజ్యం పాలించెను. వీరి తరువాత కుమార కృష్ణప్ప తమ్ముడు విశ్వప్పనాయనయ్య 5 సం.లు రాజ్యం చేసిరి. అటుపై వెరి తమ్ముడు కసూరి రంగప్ప నాయనయ్య పటానికి వచ్చి నాటి నదీ తీరమున నున్న సంధ్యామండపములో 8 వ రోజున అస్తమించిరి. పిమ్మట విశ్వప్పనాయనయ్య కుమారుడు ముద్దుకృష్ణప్ప నాయనయ్యయూ, ఆయన కుమారుడు ముద్దు వీరప్పనాయనయ్య 15సం.లు పాలించిరి.

సంగకలం తరువాత మదురై కళప్పిరర్ సామ్రాజ్యంలో ఒక భాగంగా కొంతకాలం ఉంది. తరువాత ఈ నగరం క్రీ.శ 550 పాండ్యరాజుల ఆధీనంలోకి వచ్చింది. 9వ శతాబ్ధపు ప్రారంభ దశలో తరువాత పాండ్యరాజుల క్షీణదశ ఆరంభం అయిన తరువాత ఈ నగరం చోళసామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది. 13వ శతాబ్దం ఆరంభదశ వరకు ఈ నగరం చోళుల ఆధీనంలో ఉంది. తరువాత రెండవ పాండ్యన్ సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరించి తన సామ్రాజ్యానికి మదురై నగరాన్ని రాజధానిగా చేసి పాలించించాడు. చివరి పాండ్యరాజు అయిన కులశేఖర పాండ్యన్ మరణానంతరం మదురై నగరం ఢిల్లీ సుల్తానైన తుగ్లక్ సామ్రాజ్యంలో భాగం అయింది. 1378 లో విజయనగర రాజుల వశమైయ్యే వరకు మదురై సుల్తానేట్ తుగ్లక్ సుల్తానేట్ నుండి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా పాలన సాగించింది. విజయనగసామ్రాజ్యం నుండి విడివడి 1559లో మదురైనగరం మదురై నాయకర్ పాలనలో కొనసాగింది. 1776 నాయకర్ సామ్రాజ్యం అంతం అయిన తరువాత మదురై నగరం చేతులు మారుతూ కర్ణాటక నవాబు, ఆర్కాట్ నవాబు, యూసఫ్ ఖాన్ మరియు చందా సాహెబ్‌ల అధీనంలో ఉంటూ వచ్చింది. 18వ శతాబ్ధపు మధ్యకాలంలో మరుదనాయకం ఆధీనంలో ఉంది. 1801లో బ్రిటిష్ ప్రభుత్వం మదురై నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత ఈ నగరం మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక భాగం అయింది. పెరుగుతున్న జనాభా కారణంగా 1837 నుండి ఆలయ కోటలను పడగొట్టి నగరం ప్రజా నివాస ప్రాంతంగా చేయబడింది. ఇది అప్పటి కలెక్టర్ జాన్ బ్లాక్‌బర్న్ ఆదేశాలమేరకు జరిగింది. కందకమును ఎండబెట్టి శిధిలాలను కొత్త వీధుల నిర్మాణానికి ఉపయోగించారు. అవి ప్రస్తుతం వేలి, మారత్ మరియు పెరుమాళ్ మేస్త్రి వీధులుగా ఉన్నాయి. 1866లో ఈ నగరానికి పురపాలక అంతస్థు ఇవ్వబడింది.

భారతీయ స్వాతంత్రోద్యమంలో మదురై ప్రధాన పాత్ర వహించింది. ఈ మదురై నగరంలోనే మహాత్మాగాంధి పైచొక్కా ధరించనని నిర్ణయం తీసుకుని చరిత్రలో నిలిచారు . ఇక్కడ ఉన్న వ్యవసాయ కూలీలను చూసి గాంధీజీ అటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎన్ ఎమ్ ఆర్ సుబ్బరామన్, మొహమ్మద్ ఇస్మాయిల్ సాహెబ్, నియామతుల్లాహ్ ఇబ్రహీం సాహెబ్ మరియు మీర్‌ ఇస్మాయిల్ సాహెబ్ నాయకత్వంలో మదురై నగరంలో స్వాతంత్ర్యోద్యమం సాగింది. స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రధానంగా వైగైనదికి ఉత్తరంగా నగరం విస్తరించింది. వీటిలో అణ్ణానగర్ మరియు కె.కె నగర్ వంటి నివాస ప్రాంతాలు అధికంగా ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

మదురై తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి నైరుతీ దిశలో 498 కిలోమీటర్ల (309 మైళ్ళ ) దూరంలో ఉంది. తిరుచినాపల్లికి 161 కిలోమీటర్ల (100 మైళ్ళ ) దూరంలో ఉంది. కోయంబత్తూకు 367 కిలోమీటర్ల (228 మైళ్ళ ) దూరంలో ఉంది. కన్యాకుమారీకి ఉత్తరంగా 241 కిలోమీటర్ల ( 150 మైళ్ళ ) దూరంలో ఉంది. సముద్రమట్టానికి 101 అడుగుల ఎత్తులో ఉంది. చదరమైన భూభాగం కలిగి వైగైనదీ తీరంలో ఉపస్థితమై ఉంది. వైగైనది నగరం మధ్యగా ప్రవహిస్తూ నగరాన్ని రెండు సమాన భాగాలుగా విభజించినట్లు ఉంటుందీ సుందర పవిత్ర చారిత్రాత్మక నగరం. నగరానికి వాయవ్యంలో సిరుమలై మరియు నాగమలై కొండలు ఉన్నాయి. మదురై నగరంలోపలి మరియు వెలుపలి భూములు పెరియార్ ఆనకట్ట నుండి లభిస్తున్న నీటి సాయంతో పుష్కలమైన పంటలను అందిస్తున్నాయి.

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ మదురై నగర వైశాల్యం 147.99 కిలోమీటర్లు. నగరం తడి లేని వేడి వాతావరణం కలిగి ఉంది. నగరంలో నైరుతీ రుతుపవనాల కారణంగా అక్టోబర్-డిసెంబర్ మాసాలలో వర్షాలు కురుస్తుంటాయి. వేసవి ఉష్ణోగ్రత పగలు 40 ° సెంటీగ్రేడులు రాత్రి 26.3 ° సెంటీగ్రేడులు ఉంటాయి. అతి అరుదుగా 43 ° సెంటీగ్రేడులు ఉంటుంది. శీతాకాల వాతావరణం పగలు 29.6 ° సెంటీగ్రేడులు రాత్రి వేళ 18 ° సెంటీగ్రేడులు ఉంటుంది. సరాసరి వార్షిక వర్షపాతం 85 సెంటీ మీటర్లు ఉంటుంది. నగరం తిరుమంగలం, తిరుపరకున్రం, మేలూరు, అనైయూరు, అవనియపురం మునిసిపాలిటీల మధ్య ఉపస్థితమై ఉంది.

జనాభా[మార్చు]

2001 జనభా గణాంకాలను అనుసరించి నగరపాలిత సంస్థగా విస్తరించిన మదురై నగర జనభా 12,30,015. నగశివార్లలో ఉన్న జనాభా జనాభాతో కలసి 14 లక్షలు. వీరిలో పురుషుల శాతం 50.53%, స్త్రీల శాతం 49.46%. నగ అక్షరాస్యత 77.6%. ఇది జాతీయ సరాసరి ఆదాయానికంటే అధికం. పురుషుల అక్షరాస్యత 82.2%, స్త్రీల అక్షరాస్యత 72.6%. జనాభాలో 6 సంవత్సరాలకంటే తక్కువ వయసుకలిగిన వారి శాతం 10.7%. స్త్రీ:పుషుల నిష్పత్తి 979:1000. ఇది జాతీయ స్త్రీ:పురుష నిష్పత్తి అయిన 944:1000 కంటే కొంచెం అధికం. 2005లో నేరాల సంఖ్య 1,00,000 మందికి 283.2. జాతీయ నేరాల శాతం 1.1%. నేరాల పరంగా భారతదేశంలో 35 ప్రధాన నగరాలలో మదురై నగరానికి 19వ స్థానంలో ఉంది. 2001 లో నగర జనసాంద్రత 1 చదరపు కిలోమీటరుకు 17,100. మదురై తమిళ భాష ప్రత్యేక యాసను కలిగి ఉంటుంది. ఇది కాక నగరంలో సౌరాష్ట్రా, ఉర్దూ మరియు ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు.

నిర్మాణకౌశలం[మార్చు]

మదురై నగరం మీనాక్షీ అమ్మవారి ఆలయం చుట్టూ నిర్మించబడింది. ఆలయం చుట్టూ చక్కని దీర్గచతురస్రపు వీధులు తీర్చినట్లు నిర్మించబడ్డాయి. పూర్తి నగరం తామరపుష్పం ఆకారంలో నిర్మించబడి ఉంటుంది. కొన్ని దీర్గచతురస్రపు వీధులకు తమిళ మాసముల పేర్లు నిర్ణయించబడ్డాయి. మీనాక్షీ ఆలయం చుట్టూ ఉన్న ఆరు దీర్గచతురస్రపు వీధుల పేర్లు వరుసగా చిత్తిరై, ఆడి, ఆవణి, మోల, మాశి, మారత్ మరియు వేలి.

పరిపాలన[మార్చు]

పురపాలక వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మదురై నగర పాలన 1971 నుండి నగరపాలిత వ్యవస్థగా రూపుదిద్దుకుంది. తమిళనాడులోని రెండవ నగరపాలిత ప్రాంతం ఇదే. మేయర్ ఆధ్వర్యంలో దినసరి నిర్వహణలో మునిసిపల్ స్కూల్ బోర్డ్, సిటీ బస్ సర్వీస్, మున్సిపల్ హాస్పిటల్ మరియు సిటీ లబ్రెరీ తమ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. మదురై నగరం మదురై జిల్లా ప్రధాన కేంద్రంగా సేవలను అందిస్తుంది. నగరంలో మద్రాసు బెంచ్ కోర్ట్ ఉంది. రాష్ట్ర రాజధానిలో మినహా వెలుపల నిర్వహిస్థున్న కొన్ని న్యాయస్థానాలలో ఇది భారతదేశంలో ఒక్కటి. 2004 నుండి ఇది పనిచేయడం ఆరంభించింది.

ప్రయాణసౌకర్యాలు[మార్చు]

రైలుమార్గం[మార్చు]

మదురై కూడలి

మదురై రైలు కూడలి నుండి దేశంలోని అన్ని నగరాలతో అనుసంధానించబడి ఉంది. మదురై రైల్వే విభాగం దేశంలో చక్కగా నిర్వహించబడుతున్న రైలుస్టేషన్‌గా మళ్ళీ మళ్ళీ అవార్డులను అందుకుంటూ ఉంది. కేంద్రప్రభుత్వం మదురైకు మొనోరైలు ప్రాజెక్టును ప్రకటించింది. మదురై రైల్వే కూడలిని మదురై రైల్వే కూడలి నుండి మదురై జంక్షన్, కూడల్ నగర్, సమయనల్లూర్, చోళవందాన్, వడిపట్టి, తూర్పు మదురై, సిలైమాన్, తిరువనంతపురం, తిరుపరకున్రమ్, తిరుమంగలం, చెకనూరని మరియు ఉసిలంపట్టి మొదలైన ఊర్లకు రైలు సర్వీసులు ఉన్నాయి.

రహదారి మార్గం[మార్చు]

మదురైలో పలు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మాట్టుదావని, ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినస్ (ఎమ్ ఐ బి టి), అరప్పాలయం, పాలంగనాధం మరియు పెరియార్ బస్ స్టాండ్. ఇవి నగరంలోపల బస్సులను మరియు వెలుపలి నగరాలకు నడిచే బసులను నడుపుతూ అనేక నగరాలకు ప్రయాణీకులకు రాకపోకల సౌకర్యాలను కలిగిస్తుంది. మూడుచక్రాల వాహనాలైన ఆటోలు నగరమంతా తిరగడానికి లభ్యం ఔతాయి. ఎమ్ ఐ బి టి ప్రి పెయిడ్ ఆటో కౌంటర్లను నిర్వహిస్తుంది. వీటిలో దూరమును అనుసరించి నిర్ణీతరుసుము చెల్లించి ప్రయాణించ వచ్చు. మదురై పలు జాతీయ రహదారులతో చక్కగా అనుసంధానించబడి ఉంది. అవి వరుసగా ఎన్ హెచ్ 7, ఎన్ హెచ్ 45 బి, ఎన్ హెచ్ 208 మరియు ఎన్ హెచ్ 49.

వాయు మార్గం[మార్చు]

దస్త్రం:Madurai airport new terminal building night view.jpg
మదురై విమానాశ్రయం

మదురై విమానాశ్రయం నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుండి దేశీయ విమానాలలో ప్రయాణించి దేశం లోని ముఖ్య నగరాలకు చేరుకోవచ్చు. మదురై విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానాలను నడపడానికి కావలసిన సదుపాయాలు చేయడానికి ప్రతిపాదన చేసారు. ఇక్కడి నుండి స్పైస్ జెట్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, పారమౌంట్ ఎయిర్వేస్ మరియు ఎయిర్ ఇండియా సంస్థల నుండి విమానాలు నడుస్తుంటాయి. 2009 జనవరి నుండి అక్టోబర్ వరకు ఈ విమానాశ్రయం నుండి 3,00,000 మంది ప్రయాణించారు. ప్రయాణీకుల వస్తువులను ఎక్కించడానికి దింపడానికి ఈ విమానాశ్రయానికి అనుమతి ఉంది.

విద్యారంగం[మార్చు]

ది అమెరికన్ కాలేజ్ ఇన్ మదుర
త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మదురై
 • మదురై నగరంలో మదురై కామరాజర్ యూనివర్సిటీ , మదురై మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అగ్రికల్చరల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, లా కాలేజ్, త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లాంటివి పలు ఇంజనీరింగ్ కాలేజులు మరియు పలు ఆర్ట్స్ మరియు సైన్స్ కాలేజులు ఉన్నాయి.
 • అన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ , మదురై ఆధ్వర్యంలో మదురై, తేని, దిండిగల్, రామనాధపురం, శివగంగై మరియు విరుదునగర్ విద్యా సంస్థలు ఉన్నాయి.
 • మదురై కాలేజ్, ది అమెరికన్ కాలేజ్ ఇన్ మదురై, ఎమ్.ఎస్.ఎస్. వేక్ బోర్డ్ కాలేజ్ మరియు ఫాతిమా కాలేజ్ మొదలైనవి నగరంలో చాలాకాలం విద్యా నుండి సేవలు అందిస్తున్నాయి.
 • త్యాగరాజుఅర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా మేనేజ్మెంట్ విద్యను అందిస్తుంది. నగరంలో తమిళనాడు పాలిటెక్నిక్ కాలేజ్‌తో కలిసి 3 పాలిటెక్నిక్ కాలేజులు ఉన్నాయి.
 • నగరంలో గుర్తించతగినన్ని హోటెల్ మేనేజ్మెంట్ & కేటరింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి.
 • సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ - ఇది మదురైలో హై-టెక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్‌గా పేరు పొందినది.
 • మదురైలో అనేక పాఠశాలలు, సాంకేతికా శిక్షణాలయాలు (పాలిటెక్నిక్), పారిశ్రామిక శిక్షణాలయాలు (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్)(ఐ టి ఐ)లు ఉన్నాయి.

ఆరోగ్యం[మార్చు]

నగరంలో గవర్నమెంట్ రాజజీ హాస్పిటల్ పేరుతో నగర ప్రజలకు ఉచిత వైద్యసేవలు స్తుందిస్తుంది. మదురై తోపూరు వద్ద ఎ ఐ ఐ ఎమ్ ఎస్ ఆసుపత్రి నిర్మించే ప్రతిపాదన చేసారు. నగరంలో అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. అవి వరుసగా అరవింద్ ఐ హాస్పిటల్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్, బోస్ హాస్పిటల్ మరియు మీనాక్షీ మిషన్ హాస్పిటల్ మొదలైనవి నగరప్రజలకు కావలసిన వైద్యసేవలు అందిస్తున్నాయి.

ఆరాధనా ప్రదేశాలు[మార్చు]

మదురై హజారత్
కజిమర్ పెద్ద మసీదు, మదురై

మదురై నగరంలో ముస్లిములు ఆరాదించే మసీదులలో కజిమర్ మసీదు మొదటిది. ఈ మసీదు తనను ప్రవక్త మహమ్మద్ వరసుడిగా చెప్పుకుంటున్న కాజి సయ్యద్ తాజుద్దీన్ ఆధ్వరయంలో నిర్మించబడింది. ఓమన్ నుండి వచ్చిన కాజి సయ్యద్ తాజుద్దీన్ 13వ శతాబ్దంలో అప్పటి పాండ్యరాజైన కులసేఖరపాండ్యన్ వద్ద కొంత భూభాగం తీసుకుని ఈ మసీదుని నిర్మించాడు. ఇది మదురై నగరంలో ప్రాచీన ముస్లిం సాంప్రదాయక చిహ్నంగా భావించబడుతుంది. ఈ విషయంలో ఖచ్చితమైన లిఖితపూర్వక అధారాలు లేనందువలన ఇప్పటికీ ప్రజలలో సందేహాలు ఉన్నాయి. ఈ మసీదు పెద్ద మసీదుగా భావించబడుతుంది. కాజి సయ్యద్ తాజుద్దీన్ సంతతి వారిచేత ఈ మసీదు నిర్వహించబడుతుంది. వారు 700 సంవత్సరాల నుండి కజిమర్ వీధిలో నివసిస్తున్నారు. సయ్యదులుగా పిలువబడుతున్న వీరి నుండి ఇప్పటికీ తమిళనాడు ప్రభత్వం కాజీలను ఎన్నుకుని నియమిస్తున్నారు. మదురై మక్బార మదురై హజారత్ మసీదు ఈ పెద్ద మసీదులో ఉంది.

తిరుపరకున్రం[మార్చు]

తళ ప్రజల ఆరాధదైవమైన మురుగన్ దేవయానైను వివహం చేసుకున్న ప్రదేశమే తిరుపరకున్రమ్. ఇక్కడ ఉన్న ముగురన్ ఆలయం ముగుగన్ ఆరు ప్రధాన ఆలయాలలో మొదటిదిగా విశ్వసిస్తున్నారు. ఈ గుహాలయం మీనాక్షీ ఆలయం కంటే పురాతనమైనదిగా భావిస్తున్నారు. శుక్రవారాలలో స్త్రీలు రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్య దీపాలు వెలిగించి దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఈ ముగ్గులను వర్ణములతోను మరియు పువ్వులతోనూ వేస్తారు.

సికందర్ బాదుషా షాహీద్ హజారత్ మసీదు తిరుపరకున్రం శిఖరంలో ఉంది. జెద్దాహ్ నుండి మదీనా హజారత్ సుల్తాన్ సయ్యద్ ఇబ్రహీం షాహీదు బాదుషా తో వచ్చిన ముస్లిం సన్యాసి సికందర్ బాదుషాహ్ షాహిద్ రాడియాల్లాహ్ త ఆల్ అన్హు సమాధి ఉంది. ఈ సమాధి 13వ్ శతాబ్దంలో నిర్మించబడిందన్బి భావిస్తున్నారు. ఇస్లామిక్ సంవత్సరమైన హజారీ సంవత్సరంలో రాజాబ్ నెల 17వ రోజు రాత్రి ఉరుస్ సంవత్సరుత్సవం ఇక్కడే జరుగుతుంది.

గోరిపాలయం మసీదు[మార్చు]

జలాలుద్దీన్ అషాన్ ఖాన్

గోరి అనే పదం వలన ఈ పేరు వచ్చింది. గోరి అంటే సమాధి అని అర్ధం. ఇద్దరు ఇస్లాం సన్యాసులు మరియు హజ్రత్ సుల్తాన్ ఆలుద్దీన్ బాదుషా మరియు హజ్రత్ సుల్తాన్ షాంసుద్దీన్ బాదుషాల సమాధులు ఇక్కడ ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. వైగై నదికి ఉత్తరాన ఉన్న గోరిపాలెం లో ఉన్న ఒక ఆకు పచ్చని సమాధి ఎ.వి వంతెన నుండి కనిపిస్తుంది. 20 అడుగుల ఎత్తు 70 అడుగుల వెడల్పు కలిగిన నల్లరాళ్ళను అళగర్ కొండ నుండి తెప్పించి ఈ వంతెనను నిర్మించారు. 13వ శతాబ్దం లో ఓమన్ నుండి వచ్చి పాలించిన సోదరులైన ఇద్దరు ముస్లిం పాలకుల చేత ఇక్కడ ఇస్లాం మతం అభివృద్ధి చెందింది. కజిమర్ వీధికి చెందిన సయ్యద్ తాజుద్దీన్ రాడియల్లాహ్ ప్రభుత్వ న్యాయమూర్తిగా ఉండేవాడు. మసీదు మక్బారా ప్రహరీ వెలుపల ఉన్న శిలాఫలకం మీద ఈ మసీదు వివరణ భూమి వివరణ కనుగొనబడింది. 13వ సాతాబ్ధం నుండి ఉన్న ఈ మసీదు వివరాలకు ఈ శిలాఫలకం సాక్షిగా నిలిచింది.

కూడల్ అఘగర్ కోయిల్[మార్చు]

నగరంలో ఉన్న కూడల్ అళగర్ విష్ణాలయంలో సాధారణంగా శైవ ఆలయాలలో కనిపించే నగ్రహాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. అలాగే విష్ణాలయ సమీపంలో హయగ్రీవుడి ఆలయం కూడా ఉంది. హయగ్రీవుడికి ప్రధాన ఆలయం అరుదుగా మాత్రమే ఉంటుంది.

సెయింట్ మేరీ కాథడ్రల్ చర్చి[మార్చు]

రోమన్ కాధలిక్ ఆరాధకుల కొరకు నగరంలో సెయింట్ మేరీ కాథడ్రల్ చర్చి ఔంది.

ఆర్ధికరంగం[మార్చు]

సంస్కృతి పర్యాటకం వినోదం[మార్చు]

మదురై నగరం అత్యధికంగా దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. 2007లో నగరానికి 4,100,000 పర్యాటకులు సందర్శనార్ధం వచ్చారు. వీరిలో 2,24,000 మంది విదేశీ యాత్రికులు.

తిరుమలై నాయకర్ మహల్[మార్చు]

1636లో తిరుమలైనాయకర్ చేత హిందూ ముస్లిమ్ మేలు కలయికగా రాజహల్ నిర్మించబడింది. నగరానికి వచ్చే పర్యాటకులు అధికంగా సందర్శించే ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ఇది జాతీయ చిహ్నంగా ప్రకటించబడింది. ఇది ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలో భద్రపచబడి ఉంది.

గాంధీ వస్తుప్రదర్శనశాల[మార్చు]

గాంధీ వస్తుప్రదర్శనశాల(మ్యూజియం)

రాణి మంగమ్మా హాలును పునరుద్ధరణ చేసి దానిని గాంధీ వస్తుప్రదర్శన శాలగా మార్చారు. దేశంలోని అయిదు గాంధీ వస్తుప్రదర్శనశాలలో ఇది ఒకటి. ఇందులో గాంధీని కాల్చిన సమయంలో గంధీజీ ధరించిన వస్త్రంలో ఒక భాగం కూడా ఉంది. దీనిని మార్టిన్ లూథర్ కింగ్ సందర్శించి వివక్షకు ప్రతిగా శాంతియుత పోరాటం చేయడానికి ప్రేరణ పొందాడు.

వినోదం[మార్చు]

 • ది ఎకో పార్క్‌లో లైటింగ్, ఆప్టికల్ లైట్ ఫైబర్తో చేసిన చెట్లు మరియు ఫౌంటెన్స్. రాత్రివేళలో ఇక్కడ మ్యూజికల్ ఫౌంటెన్ షో నిర్వహించబడుతుంది.
 • మదురై నగరం వెలుపల ఉన్న ఒక పర్యాటక ఆకర్షణా ప్రదేశం.
 • గాంధీ వస్తుప్రదర్శనశాలలో ఉన్న రాజాజి చిల్డ్రెన్ పార్క్ మరియు తముక్కం గ్రౌండ్స్ అకర్షణీయమైన వినోదకేంద్రాలు. ఇక్కడ అనేక మంది పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటారు. ఇక్కడ పూంగా ఆర్యభన్ వంటి హోటళ్ళు మరియు ఇతర వినోదాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని పక్షులు, గాలిపటాలు మరియు సంగీత వాయిద్యాలు ఉన్నాయి.
 • ఎమ్.జి.ఆర్ రేస్ కోర్స్ స్టేడియంలో అనేక జాతీయ సభలు జరిగాయి. అంతర్జాతీయ కబడి క్రీడ చాంపియన్‌షిప్ ఇక్కడ జరిగింది.
 • అరసరడి వద్ద ఉన్న రైల్వేగ్రౌండ్స్ మరియు మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ మరియు మదురా కాలేజ్ గ్రౌండ్స్ పూర్తి వసతులు కలిగిన క్రికెట్ స్టేడియంలు కలిగి ఉన్నాయి.

మాధ్యమం[మార్చు]

నగరంలో పలు ఆకాశవాణి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో రేడియో మిర్చి మరియు సూర్యన్ ఎఫ్ ఎమ్. మదురై ఊతంగుడి వద్ద సన్ టి.వి నెట్ వర్క్ రీజనల్ ఆఫీసు ఉంది. విజయ్ టి.వి, జయ టి.వి మరియు ఎస్ ఎస్ మ్యూజిక్ లకు కూడా ఇక్కడ కార్యాలయాలు ఉన్నాయి. ది హిందూ, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ముఖ్యమైన మూడు ఆంగ్లదినపత్రికలు తమ పత్రికలను ఇక్కడ ముద్రిస్తున్నాయి. ఇక్కడ ముద్రించక పోయినా డెక్క క్రోనికన్ పత్రికకు నగరంలో మంచి ఆదరణ లభిస్తుంది. దిన మలర్, దిన తంతి, దిన మణి మరియు దినమణి కదిర్ వంటి తమిళ పత్రికలు ప్రజాదరణతో నడుస్తున్నాయి. మాలై మురసు, మాలై మలర్ మరియు తమిళ మురసు వంటి సాయంత్ర వార్తా పత్రికలు లభిస్తాయి.

ఆతిధ్యం[మార్చు]

 • ది హెరిటెన్స్ మదురై ఇది ఒక అయిదు నక్షత్రాల హోటెల్ .
 • రాయల్ కోర్ట్, హోటెల్ జి ఆర్ టి రీజెన్సి, ది పార్క్ ప్లాజా, దిగేట్వే హోటెల్ (తాజ్ గార్డెన్ రిట్రీట్), హోటెల్ జర్మనస్, నార్త్ గేట్. మదురై రెసిడెన్సీ, హోటెల్ సంగం మరియు ఫార్చ్యూన్ పాండియన్ హోటళ్ళు పర్యాటకులకు ఆతిధ్యం ఇవ్వడాంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. మదురై ఇడ్లీలకు ప్రసిద్ధి. ఇడ్లీలు అనేక రకాల చట్నీలతో అన్ని రెస్టారెంట్లలో లభిస్తాయి.

పండుగలు[మార్చు]

మదురై వాసులు అనేక ఉత్సవాలను చేసుకుని ఆనందిస్తుంటారు. వాటిలో మీనాక్షీ తిరుకల్యాణం, చిత్తిరై తిరునాళ మరియు కార్ ఫెస్టివల్.

పశువుల పండుగ[మార్చు]

ఎద్దులను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్న యువత
పండుగ సంబరాలలో భాగంగా అలంకరించబడిన ఎద్దు

సంక్రాంతి మరుసటి రోజు పశువుల పండుగ చేస్తారు. కొత్తపంట పండి ఇంటికి చేరిన తరువాత కృతజ్ఞతగా మరియు ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగలో వ్యవసాయానికి అధికంగా సాయంచేసే ఎద్దులకు కృతజ్ఞతా పూర్వకంగా ఈ పడుగ జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ఎద్దులకు స్నానం చేయించి, కొమ్ములకు రంగులద్ది, పూసలు మరియు రంగు దారాలతో చేసిన ఆభరణాలు ధరింపజేసి ఎద్దులను పూజించి ఆరాధిస్తారు. కొన్ని గ్రామాలాలో ఎద్దులను వస్త్రాలతో కూడా అలంకరిస్తారు.

తెప్పోత్సవం[మార్చు]

మారియమ్మన్ తెప్పోఉత్సవం జరిపే ఆలయ కొలను

తమిళ తై మాసంలో పౌర్ణమి రోజు (జనవరి మాసంలో) తెప్పోత్సవం జరుపుతారు. చక్కగా అలంకరించబడిన మీనాక్షీ సుందరేశ్వరుల విగ్రహాలను ఊరేగింపుగా మారియమ్మన్ ఆలయ కొనేరు (తెప్ప కుళం)తీసుకు వచ్చి చక్కగా పూలతో విద్యుద్దీప తోరణములతో అలంకరించబడిన తెప్పమీద ఎక్కించి కోనేరులో తిప్పుతూ ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

సాంతనకూడు ఉత్సవం[మార్చు]

సంవత్సరంలో కొన్ని ప్రత్యేక దినాలలో సన్యాసులు అందరూ చేరిన సందర్భాలలో సాంతనకూడు ఉత్సవం జరుపుకుంటారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "TN(India)Census within Corporation limit". Tamil Nadu Census. Retrieved 2009-09-24. [dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=మదురై&oldid=1865260" నుండి వెలికితీశారు