తిరుక్కణ్ణంగుడి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుక్కణ్ణంగుడి Thirukkannangudi | |
---|---|
భౌగోళికాంశాలు : | 10°45′26″N 79°45′48″E / 10.75722°N 79.76333°E |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | నాగపట్నం |
ప్రదేశం: | తిరుక్కణ్ణంగుడి , Sikkal |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | Loganathar(విష్ణువు) |
ప్రధాన దేవత: | Aravindavalli(లక్ష్మీదేవి) |
ఉత్సవ దైవం: | Damodara Narayanan |
ఉత్సవ దేవత: | Loganayaki |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | శ్రవణ పుష్కరిణి |
విమానం: | ఉత్పల విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | గౌతమ మహర్షి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
తిరుక్కణ్ణంగుడి ఒక పవిత్రమైన క్షేత్రము. దీనిని కృష్ణారణ్య క్షేత్రం అని కూడా పేరున్నది. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలు లో ఒకటి.
విశేషాలు
[మార్చు]ఈ క్షేత్రానికి కృష్ణారణ్య క్షేత్రమని కూడా అంటారు. ఇచట ఆకులు ముడుచుకొనని చింతచెట్టు (ఉఱంగాప్పుళి) తిరుమంగై ఆళ్వార్ రాయి విసరిన చోట ఏర్పడిన ఊరా కిణర్ అను మంచి నీటి చెఱువు ఉండేవి. పుష్పించినా కాయలు కాయని పొగడ చెట్టు ఉంది. ఇచ్చట తాయార్ మూలవర్ ఉత్సవర్ ఒకే పోలికలో నుండుట విశేషము. తిరుమంగై ఆళ్వార్ బంగారు బుద్ధ విగ్రహమును దాచిన స్థలము. ఆ స్థల యజమానితో వచ్చిన వివాద కారణముగా "తీరవళక్కు తిరుక్కణ్ణం గుడి" (తీరని వాజ్యము తిరుక్కణంగుడి) యని ప్రసిద్ధి చెందినది. కుంభమాసం మఖా నక్షత్రం తీర్థోత్సవము జరుగును.
మార్గము
[మార్చు]నాగపట్నం - శిక్కిల్ - కీవళూర్ మధ్యన గల ఆళయూర్ అను చోట బస్ దిగి 1 కి.మీ. నడచి సన్నిధి చేరవచ్చును. తంజావూరు - కీవళూర్ మార్గములో కీవళూర్ నుండి 3 కి.మీ. వసతులు స్వల్పము.
సాహిత్యంలో తిరుక్కణ్ణంగుడి
[మార్చు]శ్లోకము:
శ్రీ మచ్చ్రవణ కాసారే తిరుక్కణ్ణంగుడీరితే
పురే శ్యామళ తంవాఖ్యః అరవ్ందలతాయుతః
ఉత్పలాఖ్య విమానస్థః ప్రాజ్ముఖో గౌతమర్షిణా
ప్రత్యక్షితః కలిఘ్నార్య సంస్తుతో భువి భాసతే
పాశురము:
వజ్గమున్నీర్ వరినిఱ్ప్పెరియవాళ రవినణైమేవి
తజ్గమార జ్గైత్తడ మలరున్ది చ్చామమామేని యెన్ఱలైవన్
అజ్గమా ఱైన్దు వేళ్వి నాల్‌వేద మరుజ్గవై పయిన్ఱు; ఎఱిమూన్ఱుమ్
శెజ్గయాల్ వళర్కున్దుళక్కమిల్ మనత్తోర్ తిరుక్కణ్ణజ్గయ్ళ్ నిన్ఱానే.
వెన్ఱిశేర్ తిణ్మై విలజ్గల్ మామేని వెళ్ళెయి--రిత్తఱుకణ్,
పన్ఱియాయన్ఱు పార్ మగళ్ పయిలై తీర్తవన్ వజ్జవర్ పొగన్
ఒన్ఱలావురువత్తులప్పిల్ పల్ కాలత్తయర్ కొడి యొళివళర్ మదియుమ్
శెన్ఱుశేర్ శెన్నిచ్చిగరనన్ మాడ త్తిరుక్కణ్ణజ్గుడియుళ్ నిన్ఱానే.
తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొళ్ 9-1-1.4.
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
శ్యామలమేని పెరుమాళ్ | అరవిన్దవల్లి తాయార్ | శ్రవణ పుష్కరిణి | తూర్పుముఖము | నిలుచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | ఉత్పల విమానము | గౌతమ మహర్షికి (భృగు, బైద్యులకు) |