అక్షాంశ రేఖాంశాలు: 12°57′49″N 80°06′53″E / 12.963681°N 80.114686°E / 12.963681; 80.114686

తిరునీర్మలై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరునీర్మలై
Thiruneermalai
తిరునీర్మలై Thiruneermalai is located in Tamil Nadu
తిరునీర్మలై Thiruneermalai
తిరునీర్మలై
Thiruneermalai
భౌగోళికాంశాలు :12°57′49″N 80°06′53″E / 12.963681°N 80.114686°E / 12.963681; 80.114686
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:కాంచీపురం
ప్రదేశం:పల్లావరం, చెన్నై, Tamilnadu, భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:నీర్‌వణ్ణన్ స్వామి
ప్రధాన దేవత:ఆణిమామలర్ మంగై తాయార్
దిశ, స్థానం:దక్షిణముఖము
పుష్కరిణి:మణికర్ణిక పుష్కరిణి
విమానం:తోయగిరి విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:తొండమాన్ చక్రవర్తి, మార్కండేయుడు, భృగు మహర్షి
ముఖ్య_ఉత్సవాలు:బ్రహ్మోత్సవం
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

తిరునీర్మలై ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. దీనిని ఘండారణ్యక్షేత్రము అని కూడా పిలుస్తారు.

విశేషాలు

[మార్చు]

తిరునీర్మలై ఒక విలక్షణమైన దివ్యక్షేత్రము. ఇది వనములతోను, జలప్రవాహములతోను రమణీయమైనది. ఇక్కడ స్వామి నఱైయూర్ లో వలె నిల్చున్న, తిరువాలి తిరునగరిలో వలె కూర్చున్న, తిరుక్కుడన్దైలో వలె శయనించిన, తిరుక్కోవలూర్ లో వలె నడచుచున్న రీతిలో ఉంటారు.

ఇచట కొండపై రంగనాథులు శయన తిరుక్కోలములో వేంచేసి యుండగా, కూర్చున్న భంగిమలో శాంత నరసింహమూర్తి, నడచుచున్న రీతిలో ఉలగళన్ద పెరుమాళ్ నిలుచున్న సేవగా చక్రవర్తి తిరుమగన్ ప్రతిష్టితమై ఉన్నాడు. కొండపై శ్రీరంగనాయకి సన్నిధి వేరుగా ఉంది. కొండదిగువన నీర్‌వణ్ణన్ ఉత్సవమూర్తి ఉంటాడు. మణికర్ణిక, క్షీర, కారుణ్య, స్వర్ణ తీర్థములు ఉన్నాయి. ఈ క్షేత్రము చుట్టు నీరు నిలచి ఉంటుండేది. తిరుమంగై ఆళ్వార్ ఇచటికి వచ్చి జలపరివృతమైన సన్నిధిని చేరరాలేక ఆరు మాసములు ఇక్కడనే వేచి ఉందట. అందుచే ఈ క్షేత్రమునకు తిరుమంగైయాళ్వార్ పురం అను మరొకపేరు ఉండేది.

సాహిత్యంలో తిరునీర్మలై

[మార్చు]

శ్లోకము :

భాతి శ్రీ మణికర్ణికాఖ్య సరసి శ్రీ నీర్‌మలాఖ్యే పురే
నీర్‌వణ్ణన్ విభురత్ర తోయగిరి రిత్యాఖ్యాం విమానం శ్రితః |
నాయక్యా త్వణిమామలర్ పదయుజా మాణిక్య శయ్యాంగతో
లంకా పట్టణ వీక్షితాంచిత వపు స్తుండీర దేశప్రభుః
తోడమాన మహారాజ మార్కండేయ భృగూత్తమైః |
ప్రత్యక్షితః కలిద్వంసి శ్రీ భూతముని కీర్తితః ||

పాశురం

[మార్చు]

అన్ఱాయర్ కులక్కొడియోడు; ఆణిమామలర్ మంగై యోడన్బళని, అవుణర్‌క్
క్కెన్ఱాను మిరక్క మిలాదవనక్కు; ఉఱైయుమిడ మామదు; ఇరుమ్బొల్ శూ
నన్ఱాయపునల్ నఱైయూర్ తిరువాలి కుడన్దై తడన్దిగ కోవల్ నగర్
నిన్ఱానిరున్దాన్ కిడన్దాన్ నడన్దాఱ్కిడమ్; మామలై యావదు నీర్మలైయే. - తిరుమంగై ఆళ్వార్లు - పెరియ తిరుమొలి 2-4-1.

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
నీర్‌వణ్ణన్, ఆణిమామలర్ మంగై తాయార్ మణికర్ణిక పుష్కరిణి దక్షిణముఖము మాణిక్య శయనము కలియన్, పూదత్తాళ్వార్ తోయగిరి విమానము తొండమాన్ చక్రవర్తికి, మార్కండేయ, భృగు మహర్షులకు

.

గ్యాలరీ

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]