శ్రీ వైకుంఠం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శ్రీ వైకుంఠనాథన్ పెరుమాళ్ దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 8°37′00″N 77°56′00″E / 8.6166°N 77.9333°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వైకుంఠనాథ పెరుమాళ్(కళ్ళపిరాన్) |
ప్రధాన దేవత: | వైకుంఠవల్లి |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | పృథు తీర్థము, తామ్రపర్ణీనది |
విమానం: | చంద్ర విమానము |
కవులు: | నమ్మాళ్వార్ |
ప్రత్యక్షం: | పృథు చక్రవర్తికి,ఇంద్రునకు |
శ్రీ వైకుంఠనాథన్ పెరుమాళ్ దేవాలయం లేదా "శ్రీ వైకుంఠం దేవాలయం" అనేది భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది నవ తిరుపతులలో ఒకటి.[1] ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలైన నవ తిరుపతులలో ఒకటిగా భాసిల్లుతున్న ఈ క్షేత్రం భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలో తిరుచెందూర్-తిరునెల్వేలి మార్గంలో తమిరపారాణి నది ఒడ్డున ఉంది. ఈ తొమ్మిది క్షేత్రాలు 108 వైష్ణవ దివ్యదేశాలలో కూడా ఉన్నాయి.[2]
దేవాలయం గురించి
[మార్చు]శ్రీ వైకుంఠ దేవాలయం "కైలాసపురం"గా కూడా పిలువబడుతుంది. ఈ దేవాలయంలో నటరాజు విగ్రహం, కళాత్మకంగా చెక్కిన స్తంభాలు 8 కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యమైనది ఉత్సవ మూర్తి "కల్లాపిరాన్", మూలవిరాట్టు "వైకుంటనాథర్". తమిళ నెలలలో ఆరవ నెల అయిన చిత్తిరాయి (ఏప్రిల్) లో సూర్యకిరణాలు మూలవిరాట్టు యొక్క పాదాలపై పడటం అనేది ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయంలో విగ్రహం చేతిలో గదతో ఉన్నట్లు అద్భుతంగా చెక్కబడింది. మంటపం యొక్క స్తంభాలు సింహాలు, యాలీ (హిందూ పురాణాలు) లు, ఏనుగులతో చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయం బ్రిటిష్ వారితో కట్టబొమ్మన్ దేశభక్తితో చేసిన యుద్ధంలో ఆయనకు ఒక కోటలా పనిచేసింది.[3] ఆలయం చుట్టూ పెరిగిన వృక్షాల నడుమ 9-అంతస్తుల గోపురం కలిగి ఉంది.
పండగలు
[మార్చు]"గరుడ సేవై ఉత్సవం" అనేది వైకాసి (మే-జూన్) నెలలో జరుగుతుంది. నవతిరుపతులకు సంబంధించిన ఉత్సవ విగ్రహాలను గరుడ, వాహనం పై ఊరేగిస్తారు. నమ్మాళ్వార్ యొక్క విగ్రహాన్ని "అన్నవరాహం" పై ఇచ్చటికి తెస్తారు. ఆయన వ్రాసిన పాశురాలను తొమ్మిది దేవాలయాలకు అంకితమిస్తూ పఠిస్తారు.
విశేషాలు
[మార్చు]నమ్మాళ్వార్లు "పణ్డనాళాలే" అను దశకమున (9-2) "పుళింగుడి కిడందు వరగుణ మంగై ఇరండు వైకుంఠత్తుళ్ నిన్ఱు" అను తావున (తిరుప్పుళింగుడిలో శయనించి యుండుట వరగుణమంగై యను క్షేత్రమున కూర్చుని యుండుట శ్రీవైకుంఠమున నిలచి యుండుటలో చేతనులమగు మనలను పొందుటకై సర్వేశ్వరుడు పడుతొందరను వర్ణించి సర్వేశ్వరుని "భోగ్యపాకత్వర" యను గుణమును కీర్తించారు.
సాహిత్యం
[మార్చు]శ్లో. శ్రీవైకుంఠపురే పృథోస్తు సరసా శ్రీ తామ్రపర్ణీ తటే
యుక్తే చంద్ర విమాన మధ్యనిలయో వైకుంఠ నాథ: ప్రభు:|
ప్రాగాస్య స్థితి రాశ్రిత:ప్రియతమాం వైకుంఠ వల్లీం ముదా
భాతి శ్రీ పృథురాజ శక్ర నయనా గంతు శ్శఠారి స్తుత:||
చేరే మార్గం
[మార్చు]తిరునెల్వేలి-తిరుచ్చందూరు రైలు మార్గములో శ్రీవైకుంఠం స్టేషన్ నుండి 2 కి.మీ దూరములో సన్నిధి కలదు
సూచన
[మార్చు]ఈక్షేత్రమునకు 5 కి.మీ. తూర్పున ఆళ్వారు తిరునగరి, 1.కి.మీ దూరమున వరగుణమజ్గై, తిరుప్పుళిజ్గుడి క్షేత్రములు ఉన్నాయి.
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వారా దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
వైకుంఠనాథ పెరుమాళ్ (కళ్ళపిరాన్) | వైకుంఠవల్లి | పృథు తీర్థము, తామ్రపర్ణీనది | తూర్పు ముఖము | నిలచున్న భంగిమ | నమ్మాళ్వార్ | చంద్ర విమానము | పృథు చక్రవర్తికి, ఇంద్రునకు |
చిత్రమాలిక
[మార్చు]-
Precincts of the temple
-
Sculpture of a gatekeeper
-
Sculpture of Sri Rama
-
Sculpture
-
Sculpture
-
Gopuram view
-
Vaikunta form of Lord Vishnu
-
Trivikrama form of Lord Vishnu