కేశవదేవ ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేశవదేవ ఆలయం
Lua error in మాడ్యూల్:Location_map at line 488: Unable to find the specified location map definition: "Module:Location map/data/India Uttar Pradesh" does not exist.
భౌగోళికాంశాలు :27°30′17″N 77°40′11″E / 27.504748°N 77.669754°E / 27.504748; 77.669754Coordinates: 27°30′17″N 77°40′11″E / 27.504748°N 77.669754°E / 27.504748; 77.669754
ప్రదేశము
దేశము:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీకృష్ణుడు
ప్రధాన దేవత:రుక్మిణీ సత్యభామ
దిశ మరియు స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:యమునా నది
విమానం:భద్ర విమానము
కవులు:పెరియాళ్వార్;ఆండాళ్; నమ్మాళ్వార్;తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:వసుదేవుడు;దేవతలకు

కేశవదేవ ఆలయం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

ఈక్షేత్రము ముక్తి ప్రద క్షేత్రములలో ఒకటి. డిల్లీకి దక్షిణమున 140 కి.మీ. దూరమున గల "మధురా" స్టేషన్ సమీపమున యమునానదీ తీరమున శ్రీకృష్ణుని అవతార స్థలము ఉంది. దీనికి ఉత్తరము 10 కి.మీ.దూరములో గోవర్థనము పర్వతం ఉంది. ఆళ్వార్లు కీర్తించిన క్షేత్రమిపుడు కనిపించదు. మధురానాథ, ద్వారకానాథ సన్నిధులు ప్రసిద్ధిచెందినవి. (ఇచట ఉ.వే. శ్రీమాన్ గోవర్థనం రంగాచార్యస్వామి వారిచే నిర్మింపబడిన సప్త ప్రాకారములు గల రంగమందిరం దాక్షిణాత్య సంప్రదాయముతో పాంచరాత్రాగ మోక్తముగా నిర్వహింపబడు చున్నది. ఇచట అన్ని సన్నిధులు ఉన్నాయి) .

సర్వ సౌకర్యములు ఉన్నాయి.ఈ క్షేత్రమున గల ముఖ్యమైన స్నానఘట్టము విశ్రాంత్ ఘాట్. ఇచటనొక సన్నిధి నిర్మించి గోపుర శిఖరమున గంటలను కట్టిఉన్నాయి. ప్రతిదినము సాయంకాలము 6 గంటలకు ఇచట నుండి యమునా నదికి దీపారాధన జరిపింతురు.

కంసునికోట, కేశవాలయము, (బందే ఖనా) శ్రీకృష్ణుని జన్మస్థానము దర్శించతగినవి.

సాహిత్యం[మార్చు]

శ్లో. యమునా పరితస్తీరే హ్యుత్తరే మథురా పురే
   భద్రాఖ్యాన విమానస్థ; శ్రీకృష్ణ; ప్రాజ్ముఖ స్థితి:||
   రుక్మిణీ సత్య భామాభ్యాం వసుదేవామరేక్షిత:|
   శ్రీ విష్ణుచిత్త తత్పూను శఠజిత్ కలిహస్తుత:||

పాశురాలు[మార్చు]

పా. ఇదువో పొరుత్త మ్మిన్నాழி ప్పడైయా; యేఱుమిరుమ్‌ శిఱైప్పుళ్
   అదువే కొడియా వుయర్ త్తానే; యెన్ఱెన్ఱేజ్గి యழுదక్కాల్
   ఎదువే యాగ క్కరుదజ్గొ; లిమ్మా--లమ్‌ పొఱైతీర్పాన్
   మదువార్ శోలై యుత్తరమధురై;ప్పిఱన్దమాయనే||
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-5-9

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
శ్రీకృష్ణుడు రుక్మిణీ సత్యభామ యమునా నది తూర్పుముఖము నిలచున్న భంగిమ రియాళ్వార్;ఆండాళ్; నమ్మాళ్వార్;తిరుమంగై ఆళ్వార్ భద్ర విమానము వసుదేవుడు;దేవతలకు

చేరే మార్గం[మార్చు]

మదుర జంక్షన్ నుండి (డిల్లీ-ఆగ్రామార్గం) 3 కి.మీ.

వెలుపలి లింకులు[మార్చు]