Jump to content

కూడలళగర్ ఆలయం

అక్షాంశ రేఖాంశాలు: 9°55′N 78°35′E / 9.91°N 78.58°E / 9.91; 78.58
వికీపీడియా నుండి
కూడలళగర్ ఆలయం
Koodal Azhagar Temple
ఆలయ దృశ్యం
ఆలయ దృశ్యం
కూడలళగర్ ఆలయం Koodal Azhagar Temple is located in Tamil Nadu
కూడలళగర్ ఆలయం Koodal Azhagar Temple
కూడలళగర్ ఆలయం
Koodal Azhagar Temple
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :9°55′N 78°35′E / 9.91°N 78.58°E / 9.91; 78.58
పేరు
ప్రధాన పేరు :Koodal Azhagar Temple
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:మధురై
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:Koodal Azhagar (విష్ణు)
పుష్కరిణి:హేమపుష్కరిణి
విమానం:అష్టాంగవిమానము
కవులు:తిరుమళగై ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

కూడలళగర్ ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రము. ఇది భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మధురై నగరానికి మధ్యలో ఉంది. తమిళ భాషలో మధురై నగరానికి మరియొక పేరు "కూడల్", "అళగర్" అనగా "అందమైనది" అని అర్థం. ఈ దేవాలయం పురాతనమైనది. ఇది 108 దివ్యదేశాలలో ఒకటి.

విశేషాలు

[మార్చు]

మధుర పాండ్యరాజసభలో విష్ణు పరత్వ నిర్ణయము గావించి విజయులైన పెరియాళ్వార్లకు గరుడ వాహనారూడులై స్వామి సాక్షాత్కరింపగా పెరియాళ్వార్లు పల్లాండు పాడిన ప్రదేశము. తిరుప్పల్లాండు అవతరించిన స్థలము. ఇచట గల అష్టాంగ విమానము చాలా పెద్దది. అందు శయన తిరుక్కోలముతో (పవళించిన) శ్రీరంగనాథులు-పై అంతస్తులో నిన్ఱ తిరుక్కోలముతో (నిలచున్న) సూర్యనారాయణులు వేంచేసియున్నారు.

ఉత్సవాలు

[మార్చు]

వృషభం అనూరాధ తీర్దోత్సవం-కుంభ మాసం మఖ శాత్తుకోమురైగా పది దినములు తెప్ప ఉత్సవం. ఈ సన్నిధికి మూడు ప్రాకారములు ఉన్నాయి. రెండవ ప్రాకారములో నవగ్రహములు ప్రతిష్ఠింపబడినవి. మూడవ ప్రాకారములో తాయార్, ఆండాళ్, మణవాళమామునుల సన్నిధులు ఉన్నాయి. సన్నిధిలో ప్రసాదము లభించును. సన్నిధి వద్ద రామానుజ కూటము ఉంది.

సాహిత్యం

[మార్చు]

శ్లో. శ్రీమద్ధేమ సరోవరేణ కలితే చక్రాఖ్య తీర్థాంచితే
   శ్రీమత్యై మధురాపురే సురదీశా వక్త్రాసనాలంకృత:|
   దేవ్యా సుందర నాయకో వకుళయా త్వష్టాంగవైమాసగ:
   దృష్ట శ్శాసక భార్గవాది మునిభి ర్బక్తార్థ ముజ్జృంభతే||

శ్లో. భక్తిసార కలిఘ్నాభ్యాం విష్ణుచిత్త మహర్షిణా|
   నీళయాపి చ తత్పుత్ర్యా మంగళాశాసిత స్సదా||

పాశురాలు

[మార్చు]

పా. కోళియుమ్‌ కూడలుమ్‌ కోయిల్ కొణ్డ కోవలరేయొప్పర్; కున్ఱమన్న
   పాళియుమ్‌ తోళుమోర్‌నాన్గుడై యర్‌పణ్డివర్ తమ్మైయుమ్‌ కణ్డిఱియోమ్‌;
   వాళియరో వివర్ వణ్ణ మెణ్ణిల్ మాకడల్ పోన్ఱుళర్, కైయిల్ వెయ్య
   ఆళియొన్ఱేన్దియోర్ శజ్గుపత్‌తి యచ్చో వొరు వరళిగియవా!
                 తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొళి 9-2-5

మార్గం

[మార్చు]

మధుర ప్రసిద్ధ పట్టణమగుటచే తమిళనాడులోని అన్ని ప్రాంతముల నుండి బస్ సౌకర్యం ఉంది. రైలు వసతియు ఉంది. 20 కి.మీ దూరంలో తిరుమాలిరుంశోలై, 10 కి.మీ దూరములో తిరుమోగూర్ ఉన్నాయి.

వివరం

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
కూడలళగర్ మధురవల్లి-వకుళవల్లి (మరకతవల్లి వరగుణవల్లి తాయార్) హేమపుష్కరిణి-చక్రతీర్థము తూర్పుముఖము కూర్చున్న తిరుమళగై ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ అష్టాంగవిమానము శౌనక భృగుమహర్షులకు, పెరియాళ్వార్లకు

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]