తిరుక్కావళంబాడి
తిరుక్కావళంబాడి | |
---|---|
భౌగోళికాంశాలు : | 11°10′N 79°48′E / 11.16°N 79.8°E |
పేరు | |
ఇతర పేర్లు: | గోపాలకృష్ణ పెరుమాల్ దేవాలయం |
ప్రధాన పేరు : | తిరుక్కావళంబాడి |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | నాగపట్నం |
ప్రదేశం: | తిరునాగూర్ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | గోపాలకృష్ణ పెరుమాల్ (విష్ణుమూర్తి) |
ప్రధాన దేవత: | శెంగమల తాయార్ (లక్ష్మీదేవి) |
దిశ, స్థానం: | తూర్పుముఖము |
పుష్కరిణి: | తడమలర్ పొయిగై పుష్కరిణి |
విమానం: | స్వయంభూ విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | రుద్రుడు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుక్కావళంబాడి (Thirukkavalampadi) లేదా తిరునాంగూర్ తిరుపతి ప్రముఖమైన 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ గోపాలకృష్ణ పెరుమాల్ దేవాలయం ప్రసిద్ధిచెందినది.
శ్లో|| పృధు పుష్ప సరో రమ్యే కావళంబాడి పట్టణే |
స్వయంభు వర వైమాన స్థాయీం శెంగమలాభిధామ్ ||
శ్లో|| నాయకీ మాశ్రితశ్శ్రీవ న్ ప్రాజ్ముఖో రుద్ర సేవితః |
గోపాలకృష్ణ భగవాన్ రాజతే కలిజిన్నుతః ||
విశేషాలు
[మార్చు]తిరుమంగై ఆళ్వార్ జన్మస్థానమైన తిరుక్కుఱైయలూర్. తదీయారాధన చేసిన మంగై మఠము సమీపమున ఉన్నాయి. మంగ మఠములో శ్రీ వీర నరసింహస్వామి సన్నిధి ఉంది. అర్చకులు కీళ్ చాలైలో ఉంటారు.
మార్గము
[మార్చు]తిరుత్తేవనార్ గొగైకు 1 కి.మీ. దూరములో ఈ క్షేత్రము ఉంది.
భగవత్ప్రాప్తి
[మార్చు]" మూడు జన్మలు(హిరణ్యకశిప, రావణ, శిశుపాల) భగవంతునితో శతృత్వం వహించి జన్మించిన శిశుపాలుడు చివరకు భగవంతుని చేరుకున్నాడు. అనాది కాలముగా అనేక జన్మ పరంపరలలో భగవంతునితో శతృత్వం వహించి అపచారము చేయుచున్న మనము సర్వేశ్వరుని పొందకపోదుమా! " కురుగూరునంబిగారు అభిప్రాయం.
తమిళ సాహిత్యం
[మార్చు]పా|| తావళన్దులగమళమ్ తడమలర్ ప్పొయ్‌గై పుక్కు
నావళ నవిన్ఱజ్గేత్త నాగత్తిన్ నడుక్కమ్ తీర్తాయ్
మావళమ్ పెరుగి మన్నుమఱైయవర్ వాళమ్, నాజ్గైక్
కావళమ్బాడిమేయ కణ్ణనే కళైగఱియే.
పా|| శన్దమాయ్ చ్చమయమాగి చ్చమయవైమ్బూదమాగి;
అన్దమాయాదియాగి యఱుమఱైయలైయు మానాయ్
మన్దమార్ పొళిల్‌కడోఱుమ్ మడమయిలాలు నాజ్గై
కాన్దనూర్ కావళన్దణ్ పాడియాయ్ కళైగణీయే
తిరుమజ్గై యాళ్వార్- పెరియ తిరుమొళి 4-6-9
]]
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
గోపాలకృష్ణన్ | శెంగమలవల్లి, మదనగర్ మంగై నాచ్చియార్, | తడమలర్ పొయిగై పుష్కరిణి | తూర్పుముఖము | నిలుచున్నభంగిమ | తిరుమంగై ఆళ్వార్ | స్వయంభూ విమానము | రుద్రునకు |