తిరుత్తొల విల్లి మంగలమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుత్తొల విల్లి మంగలమ్
దేవపిరాన్ దేవాలయం, అరవిందలోచనార్ దేవాలయం చిత్రాలు
తిరుత్తొల విల్లి మంగలమ్ is located in Tamil Nadu
తిరుత్తొల విల్లి మంగలమ్
తిరుత్తొల విల్లి మంగలమ్
Location within Tamil Nadu
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:తేవ పిరాన్, అరవిందలోచనుడు
ప్రధాన దేవత:కరుందడం కణ్ణి తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:తామ్రపర్ణీ నది,వరుణ తీర్థము
విమానం:కుముద విమానము
కవులు:నమ్మాళ్వార్
ప్రత్యక్షం:ఇంద్ర, వరుణ వాయువులకు

తిరుత్తొల విల్లి మంగలమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

ఇవిరెండు క్షేత్రములగుటచే ఇరట్టై తిరుపతియని అంటారు. ఈ క్షేత్రము అరణ్యప్రాంతములో నుండుటచే అర్చకులతో కలసి దర్శించాలి. నమ్మాళ్వార్ ఈక్షేత్రమునకు "అవ్వూర్" (ఆ దివ్యదేశము) 6-5-9 అను విలక్షణమైన పేరును నిర్ణయించాడు. "తువళిల్ మామణి మాడమ్‌" అను దశకములో (తిరువాయిమొழி6-5-11) "తేవపిరానైయే తన్దైతాయ్" అని (దేవపిరాన్‌సర్వేశ్వరుడే తండ్రి తల్లియని) సర్వేశ్వరుని సకలవిధ బంధువుగా కీర్తించి బంధుత్వగుణమును ఆపాదించి ఆరాధించాడు.

నమ్మాళ్వార్లు తోழிమార్ అవస్థలో (సఖీభావనలో) చెప్పిన దశకములు మూడు. 1.తీర్‌ప్పారయామిని 2. తువళిల్‌మామణిమాడమ్‌ 3. కరుమాణిక్కమలై మేల్. ఇందు రెండవదియగు "తువళిల్ మామణిమాడమ్" అను దశకమున" అరవిందలోచనుని సేవించినది మొదలు ఆళ్వార్ల నాయికి అతని స్వరూపమున గుణచేష్టితములనే పలవరించుచు మన వశము తప్పియున్నది." అని చెలికత్తెలు ఆళ్వార్ల తల్లిగారికి నివేదించుచున్నట్లు ఈ దశకము రచించబడింది.

ఇది తామ్రపర్ణీనదీ తీరమున గల దివ్యదేశము. ఈక్షేత్రమునకు సమీపమున నమ్మాళ్వార్లు జన్మస్థానం ఉంది.

సాహిత్యం[మార్చు]

శ్లో. దివ్యే శ్రీతొలవిల్లి మజ్గల పురే శ్రీతామ్రపర్ణీతటే
   ప్రోప్తే వారుణ తీర్థకం శఠరిపు స్తుత్య స్సురేశానవ:|
   నాయక్యా మరవింద లోచన విభూ రక్త: కరుంకణ్ణితి
   ప్రోప్యేంధే కుముదం విమాన మనిల స్తీర్థేశ శక్రేక్షిత:||

పాశురాలు[మార్చు]

పా. తిరున్దు వేదముమ్‌ వేళ్‌వియుమ్‌ తిరుమామక ళిరున్దామ్‌, మలి
    న్దిరున్దు వాழ் పొరువల్ వడకరై వణ్డులై విల్లిమజ్గలమ్‌;
    కరున్దడజ్కణ్ణి కై తొழுదవన్నాళ్ తుడజ్గియిన్నాడొఱుమ్‌;
    ఇరున్దిరున్దరవిన్ద లోచన వేన్ఱెన్ఱే వైన్ది రజ్గుమే.
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 6-5-8

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
తేవ పిరాన్, అరవిందలోచనుడు కరుందడం కణ్ణి తాయార్ తామ్రపర్ణీ నది, వరుణ తీర్థము తూర్పు ముఖము నిలచున్న భంగిమ నమ్మాళ్వార్ కుముద విమానము ఇంద్ర, వరుణ వాయువులకు

చేరే మార్గం[మార్చు]

ఆళ్వార్ తిరునగరి నుండి 3 కి.మీ. తూర్పున తామ్రపర్ణీనది ఆవలియొడ్డున ఉంది. ఒక సన్నిధి తామ్రపర్ణీ నదీతీరమున మరియొక సన్నిధి కాలువ సమీపమున ఉన్నాయి.

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]