తిరుక్కోట్టియూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుక్కోట్టియూర్
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సౌమ్య నారాయణన్
ప్రధాన దేవత:తిరుమామకళ్ నాచ్చియార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:దేవ పుష్కరిణి
విమానం:అష్టాంగ విమానము
కవులు:పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమழிశై ఆళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:కదంబ మహర్షికి ఇంద్రునకు

తిరుక్కోట్టియూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

హిరణ్యుని భాధలను సహింప జాలని దేవతలు కదంబమునిని ప్రార్థింపగా హిరణ్యుడు రాలేని ఈ ప్రదేశమునందుండుడని వారిని నియమించెను. ఆ ప్రకారము దేవతలు గోష్ఠిగానున్న కారణమున గోష్ఠీపురమని పేరువచ్చెను.

ఇచ్చట సన్నిధి నాలుగు అంతస్థులుగా ఉంటుంది. ఇక్కడ ఉన్న అష్టాంగ విమానము విశ్వకర్మచే నిర్మింపబడినదని విశ్వసిస్తున్నారు. ఉడయవర్ ఈ క్షేత్రములో ఉన్న తిరుక్కోట్టియూర్ నంబి వద్దకు పదునెనిమిది పర్యాయములు వచ్చి చరమ శ్లోకార్థమును (తిరుమంత్రార్థమని కొందరి అభిప్రాయము) పఠించి భక్తకోటిని అనుగ్రహించిన ప్రదేశమిది. తిరుక్కోట్టియూర్ నంబికి, ఉడయ వరులకు సన్నిధులు ఉన్నాయి. గోపురం మీద ఉడయవర్ గ్రామం అంతటినీ పర్యవేక్షిస్తిన్నట్లు ఉంటాడు. తిరుక్కోట్టియూర్ నంబి జన్మస్థానం. మేషం చిత్త తీర్థోత్సవము.

మార్గం[మార్చు]

మధుర నుండి బస్‌లో తిరుప్పత్తూర్ చేరి అచట నుండి వేరు బస్‌లో 10 కి.మీ దూరమున ఈ క్షేత్రమును చేరవచ్చును.

సాహిత్యం[మార్చు]

శ్లో|| శ్రీమద్దేవ సరోజినీ విలసితే గోష్టీపురే పాజ్ముఖ
    స్త్వష్టాంగాఖ్య విమాన మధ్య నిలయ శ్శ్రీసౌమ్య నారాయణః |
    ఆలింగన్ తిరుమామకళ్ పదయుతాం దేవీంతు నాట్య స్థితిః
    కాదంబేంద్ర విలోచనాతిథివపు ర్విద్యోతతే సర్వదా ||

శ్లో|| భక్తిసార మహాయోగి పరకాల గదాంశజైః |
    విష్ణుచిత్తేన మునినా మంగళాశాసనైః స్తుతః ||

పాశురాలు[మార్చు]

పా. ఇన్ఱావఱికిన్ఱే నల్లేన్; ఇరు నిలత్తై
    చ్చెన్ఱాజ్గళన్ద తిరువడియై-అన్ఱు
    కరుక్కోట్టియు ట్కీడన్దుకై తొழுదేన్ కణ్డేన్
    తిరుక్కోట్టి యైన్దై తిఱమ్‌.
           పూదత్తాళ్వార్-ఇరండాం తిరువన్దాది 87 పా.

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
సౌమ్య నారాయణన్ తిరుమామకళ్ నాచ్చియార్ దేవ పుష్కరిణి తూర్పు ముఖము నిలుచున్న, కూర్చున్న నడుచుచున్న నాట్యమాడుచున్న పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమழிశై ఆళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ అష్టాంగ విమానము కదంబ మహర్షికి ఇంద్రునకు

చేరే మార్గం[మార్చు]

మధుర నుండి బస్‌లో తిరుప్పత్తూర్ చేరి అచట నుండి వేరు బస్‌లో 10 కి.మీ దూరమున ఈ క్షేత్రమును చేరవచ్చును.

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]