తిరువళ్ళూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?తిరువళ్ళూరు
తమిళనాడు • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 13°09′N 79°55′E / 13.15°N 79.91°E / 13.15; 79.91Coordinates: 13°09′N 79°55′E / 13.15°N 79.91°E / 13.15; 79.91
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) తిరువళ్ళూరు జిల్లా
జనాభా 45,517 (2001 నాటికి)

తిరువళ్ళూరు, తమిళనాడు రాష్ట్రంలోగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరువళ్ళూరు జిల్లాకు ప్రధాన పట్టణం. ఇక్కడ 108 వైష్ణవుల ప్రధాన దేవాలయాల్లో ఒకటైన వీర రాఘవుల స్వామి ఆలయం ఉంది. ఈయన శ్రీమహావిష్ణువు స్వరూపుడు. విగ్రహం ఆదిశేషుడిపై ఆయన శయనించినట్లుగా ఉంటుంది. వీర రాఘవ స్వామి మందుల తలకింద పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు నయమవుతాయని ప్రజల విశ్వాసం.[1] ఇక్కడ గల కోనేరు దేశంలోని అతి పెద్ద కోనేర్లలో ఒకటి.

చరిత్ర[మార్చు]

తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి దేవాయలం

1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో రికార్డ్ అయింది. ఏనుగుల వీరాస్వామయ్య ఆ గ్రంథంలో వ్రాస్తూ: తిరువళ్ళూరు విష్ణుస్థలము. హృత్తాపనాశిని అనే తీర్థమున్నది. అందులో ప్రార్థనలవారు (భక్తులు) బెల్లము వేయిచున్నారు. ఆ తీర్థస్నానము స్మృతులయందు మహాప్రాయశ్చిత్తములలో ముఖ్యముగా జెప్పబడియున్నది. అది పేట స్థలము. అన్ని వస్తువులు దొరకును అన్నారు.[2]

ప్రయాణం[మార్చు]

తిరువళ్ళూరు చెన్నై నుంచి అరక్కోణం వెళ్ళేదారిలో ఉంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను పక్కనే ఉన్న లోకల్ స్టేషను నుంచి తిరువళ్ళూరుకు డైరెక్ట్ గా వెళ్లి రైళ్ళు ఉన్నాయి. అరక్కోణం వెళ్ళే రైలు ఎక్కినా తిరువళ్ళురు చేరుకోవచ్చు. సుమారు 1.30 గంట సమయం పడుతుంది. తిరువళ్ళూరు రైల్వే స్టేషనులో దిగిన తరువాత కుడివైపుకు వెళ్ళాలి . రైల్వే స్టేషను నుంచి గుడికి సుమారు 4 కి.మీ. దూరం ఉంటుంది. గుడి దగ్గరకు వెళ్ళడానికి బస్సు లు, ఆటోలు ఉంటాయి.

ఈ ఆలయం లోని అధిష్టాన దైవమైన వీరరాఘవ స్వామి ఈ లోకంలోని సకలజీవరాసులకు అలాగే సకల జీవరాశులకు రక్షణ కలిగించేవాడు. అతడి దివ్యమైన పాదాలు సకల జీవులకు తక్షణ రక్షణ కిలిగించడమే కాక అసక్త నుండి అనారోగ్యం నుండి కూడా ఉపశమనం కలిగిచి అరోగ్యవంతమైన జీవితాన్ని కానుకగా ఇస్తాయి. ఇక్కడ ఉన్న వైద్యవీర రాఘవస్వామి కుటుంబ సమస్యలకు పరిష్కారం, వివాహజీవితంలో చిక్కులు విడదీయడం, ఆస్తులు భూముల సమస్యలను పోగొట్టడం వంటివి కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అంతేకాక చాలాకాలంగా సంతాన లేమితో బాధ పడుతున్న దంపతులకు సంతాన భాగ్యాన్ని కలుగజేసాడ్ని విశ్వసిస్తున్నారు. ఇక్కడ శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతాన వరాన్ని ఇచ్చాడని స్థల పురాణం చెప్తుంది. తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని అర్ధం ఈ వుళ్ అంటే ఇవ్వడం అని అర్ధం. కనుక పవిత్రమైన దైవం సంతాన వరాన్ని ఇచ్చిన క్షేత్రం కనుక ఇది తిరువళ్ళూరు అయింది.

స్థలపురాణం[మార్చు]

స్థలపురాణం అనుసరించి తై అమావాస్య అంటే సంక్రాంతి తరువాత వచ్చే అమ్మావాస్య రోజున మహర్షి తపసుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ముసలి వాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యపు పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన మూడు గజముల వస్త్రమును ధరించి ఆరోజు రాత్రి ఆయన గృహములో నివసించడానికి చోటు చూపమని అడిగాడు. ఆయన చూపిన గదిలో ఆ రాత్రికి విశ్రమించాడు. మరునాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజా కార్యక్రమాలను చేసి ముసలి వాడి వద్దకు వచ్చి చూడగా అక్కడ శేషశైనంలో పవళించి లక్ష్మీ దేవితో నాభికమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణ విగ్రహం కనిపించింది. తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మని మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలని అయినా ఇక్కడకు వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీరరాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలని తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలైన తొలగించి అరోగ్యాన్ని ఐశ్వైర్యాన్ని అందించాలని కోరుకున్నాడు.[3][4]

అమావాస్య రోజు మాత్రం ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. శని-ఆదివారం కూడా ఆలయం ఆలయం భక్తులతో రద్దీ బాగానే ఉంటుంది. ఈ ఆలయంలో లక్ష్మి దేవికి ప్రత్యేక సన్నిధి కలదు. రాముల వారికి, శ్రీ కృష్ణుడికి కూడా ప్రత్యేక సన్నిధి ఉన్నాయి. ఆలయంలో శిల్పకళ ఆకట్టుకుంటుంది

వైష్ణవ దివ్యదేశం[మార్చు]

శ్లో. శ్రీ హృత్తాప వినాశ తీర్థరుచిరే శ్రీ వెవ్వుళూర్ పట్టణే
   వీక్షారణ్య మితి ప్రసిద్ధి విభవే శ్రీ శాలిహోత్రేక్షితః|
   ప్రాగాస్యో వర వీరరాఘవ విభు స్సౌవర్ణవల్లీ పతిః
   భోగేన్ద్రే జయకోటి మందిరగతః శేతే కలిఘ్నస్తుతః||

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ ప్రదేశం కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
వీరరాఘవపెరుమాళ్ కనకవల్లితాయార్ హృత్తాప నాశతీర్థం తూర్పు ముఖం భుజంగశయనం వీక్షారణ్యం తిరుమళిశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్ విజయకోటి విమానం శాలి హోత్రులకు

విశేషాలు[మార్చు]

సర్వేశ్వరుడు శాలిహోత్రమునికి ప్రత్యక్షమై నివసింపదగిన స్థలము? అని అడిగాడట. కావుననే ఈ క్షేత్రానికి "తిరు ఎవ్వుళ్‌వూర్" (కింగృహ) క్షేత్రమని పేరువచ్చినదని పెద్దలు చెప్పుదురు.

ఉత్సవాలు[మార్చు]

మేషం పునర్వసు మొదలు పది దినములు బ్రహ్మోత్సవము నిర్వహించబడుతుంది. మకర మాసం పూర్వాభాద్ర చివరిరోజుగా పది రోజులు బ్రహ్మోత్సవము నిర్వహించబడుతుంది. ప్రతి అమావాస్యకు ప్రార్థన చెల్లించుటకై భక్తులు వస్తుంటారు. ఈసన్నిధి అహోబిల మఠం జీయర్ స్వామివారి నిర్వాహణలో ఉంది. సన్నిధిలో ప్రసాదము లభిస్తుంది. సన్నిధి వీధిలో అహోబిల మఠము ఉంది. అన్ని వసతులు ఉంటాయి.

మార్గం[మార్చు]

చెన్నై-అరక్కోణం రైలు మార్గంలో తిరువళ్లూరు స్టేషన్ నుండి 5 కి.మీ. మద్రాసు నుండి అన్ని ప్రధాన పట్టణముల నుండి బస్ సౌకర్యము ఉంది. ఆంధ్రాలో సూళ్లూరుపేట నుండి, తిరుపతి నుండి బస్ సౌకర్యము ఉంది. శ్రీకాళహస్తి నుంచి తిరువళ్ళూరుకు ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఇవి కొన్ని సత్యవేడు మీదుగా, కొన్ని పిచ్చాటూరు, నాగలాపురం మీదుగా తిరువళ్ళూరు వెళతాయి.

మంచిమాట[మార్చు]

" ఆత్మకు అహంకారము ఆవరించి యుండుటచే నిజస్వరూపమును తెలియక మిడిసిపడుతుంది. ఆ అహంకారము తొలగినచో "దాసుడను" అని తన సహజ స్వరూపముతోనే ఉంటుంది. "వడక్కుత్తిరువీధి పిళ్ళై.

జిల్లా ప్రముఖులు[మార్చు]

గుమ్మడి సత్యనారాయణ

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భక్తుని కోసం భువికి దిగిన లక్ష్మీ నారాయణులు". Archived from the original on 2016-11-07. Retrieved 2018-11-15.
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  3. "Thiruvallur Veeraraghava Perumal Temple". Archived from the original on 2019-01-14. Retrieved 2018-11-15.
  4. "Lord Veeraraghava Perumal Temple, Tiruvallur".[permanent dead link]

వెలుపలి లింకులు[మార్చు]

మూస:తమిళనాడులోని జిల్లాలు