తిరుచ్చిత్తరకూడమ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుచ్చిత్తరకూడమ్ Thiruchitrakoodam | |
---|---|
భౌగోళికాంశాలు : | 11°23′58″N 79°41′36″E / 11.39944°N 79.69333°E |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | కడలూరు జిల్లా |
ప్రదేశం: | చిదంబరం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | గోవిందరాజ స్వామి |
ప్రధాన దేవత: | పుండరీకవల్లి తాయారు |
దిశ, స్థానం: | తూర్పుముఖము |
పుష్కరిణి: | పుండరీక సరస్సు |
విమానం: | సాత్త్విక విమానము |
కవులు: | కులశేఖరాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | పరమశివుడు, కణ్వమహర్షి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
తిరుచ్చిత్తరకూడమ్ ఒక పవిత్రమైన క్షేత్రము. ఇది చిదంబరం పట్టణంలోనున్నది. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.
విశేషాలు
[మార్చు]ఈ క్షేత్రమునకు పడమట దిశగా 40 కి.మీ. దూరమున స్వయం వ్యక్త స్థలములలో నొకటియైన శ్రీముష్ణమును, నైరుతి దిశగా 25 కి.మీ. దూరమున కాట్టుమన్నార్ కోవెలయు గలదు. ఈ సన్నిధిలోనే చిదంబర నటరాజ శివాలయము గలదు.
సాహిత్యంలో తిరుచ్చిత్తరకూడమ్
[మార్చు]శ్లోకము||
శ్రీ పుండరీక సరసీ పరిశోభమానే
శ్రీ చిత్రమూట నగరే భుజగేంద్ర శాయీ
శ్రీ పుండరీక లతికా ప్రియ దివ్యరూపః
శ్రీ సాత్త్వికాఖ్య వరమన్దిరవాస లోలః
శ్లోకము||
ప్రాచీముఖ శ్శివముఖా మర కణ్వ తిల్యా
ప్రత్యక్ష మంగళ తనుః కులశేఖరేణ
సంకీర్తితః కలిజితా మునినా చ నిత్యం
గోవిందరాజ భగవానవనౌ విభాతి
పాశురము||
అజ్గణెడు మదిళ్ పుడైశూళ్ అయోత్తి యెన్నుమ్
అణినగరత్తులగనైత్తుమ్ విళక్కుఇనోది
వెజ్గదిరోన్ కులత్తు క్కోర్ విలక్కాయ్ తోన్ఱి
విణ్ ముళ్‌దు ముయ్యక్కొణ్డ వీరన్ఱన్నై
శెజ్గణెడుమ్ కరుముగిలై యిరామన్ఱన్నై
త్తిలై నగర్ తిరుచ్చిత్తర కూడన్దన్నుళ్
ఎజ్గళ్ తని ముదల్వనై యెమ్బెరుమాన్‌న్ఱన్నై
యెన్ఱుకొలో కణ్‌కుళిర క్కాణునాళే
కులశేఖరాళ్వార్ - పెరుమాళ్ తిరుమొళ్ 5-10-1
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
గోవింద రాజస్వామి | పుండరీకవల్లి తాయార్ | పుండరీక సరస్సు | తూర్పుముఖము | భుజంగభోగశయనము | తిరుమంగై ఆళ్వార్లు, కులశేఖరాళ్వార్లు | సాత్త్విక విమానం | పరమశివునకు, దేవతలకు, కణ్వమహర్షికి, తిల్యకు |