తిరుమణిక్కూడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమణిక్కూడం
తిరుమణిక్కూడం is located in Tamil Nadu
తిరుమణిక్కూడం
తిరుమణిక్కూడం
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
Coordinates: Coordinates: Unknown argument format
ప్రదేశము
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:నందా విళక్కు పెరుమాళ్(నరనారాయణర్)
ప్రధాన దేవత:పుండరీక వల్లి తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:ఇంద్ర పుష్కరిణీ-రుద్రపుష్కరిణి
విమానం:ప్రణవాకార విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్లు
ప్రత్యక్షం:ఏకాదశరుద్రులకు, ఇంద్రునకు, మాతంగ మహర్షికి.

తిరుమణిక్కూడం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

మకరమాసము అమావాస్య (తై అమావాస్య) నాడు జరుగు 12 గరుడ సేవలు నిర్వహించబడతాయి. తిరునాంగూర్ తిరుపతులలో ఇది మొదటిది. మిగిలినవి వైకుంఠ విణ్ణగరం, అరిమేయ విణ్ణగరం, వణ్ పురుషోత్తమం, సెంపొన్‌శెయ్ కోయిల్, తిరుతైట్రి యంబలమ్‌. ఈ సన్నిధిలో తిరుక్కోట్టియూర్ నంబి (గోష్ఠీపూర్ణుడు) ప్రతిష్ఠితమై ఉన్నాడు. మేషం చిత్తా నక్షత్రము తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవం నిర్వహించబడుతుంది. శీర్గాళి నుండి టౌన్ బస్ ఉంది. ఇక్కడ భక్తులు బసచేయడానికి రామానుజ కూటం ఉంది.

నది యొడ్డునగల మంజక్కుళి మంటపములో స్వామికి తిరుమంజనం వైభవంగా జరుగును.

అనంతరం "తుళంగునీణ్ముడి" యను పాశురం "నంబెరుమాళ్లకు" (శ్రీరంగనాధునికి) "కులైయార్‌న్ద" అను పాశరముచే "తిరునఱైయూర్" నంబికి మంగళాశాసనము చేసి సాయంకాలమునకు తిరునాంగూర్ చేరుకుంటాడు. ఇచ్చట వేంచేసియున్న ఆరు తిరుపతులలోని పెరుమాళ్లకు మంగళాశాసనం చేసి ఆళ్వారులు అక్కడే ఉంటారు.

మరునాడు తిరునాంగూర్ మొదలైన 11 క్షేత్రముల పెరుమాళ్లు మణిమాడక్కోయిల్‌కు వేంచేసి ఆళ్వార్లచే మంగళా శాసనములను అందుకుంటాడు. పెరుమాళ్లు అందరకు తిరుమంజనములు జరిగిన తరువాత ఆరోజు రాత్రి పెరుమాళ్లు అందరు గరుడ వాహనముల మీద ఆళ్వార్లు హంస వాహనము మీదను ఊరేగించబడతారు. తిరువీధి ఉత్సవము జరుగుతుంది.

మరునాడు పెరుమాళ్లు తమ తమ సన్నిధులకు చేరుకున్న తరువాత ఆళ్వార్లు "తిరిత్తేవనార్‌తుగై" మొదలగు దివ్య దేశములకు మంగళా శాసనం చేసి తిరువాలిని చేరి అక్కడ ఉన్న నృసింహస్వామికి గరుడవాహనమున సేవ అందుకుంటాడు. వారికి మంగళా శాసనం చేసి తిరుమంగై ఆళ్వార్లు తిరునగరికి చేరుకుంటారు. ఈ పండ్రెండు గరుడ సేవలు తప్పక సేవింప దగినవని వైష్ణవభక్తులు విశ్వసిస్తారు.

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
నందా విళక్కు పెరుమాళ్ (నరనారాయణర్) పుండరీక వల్లి తాయార్ ఇంద్ర పుష్కరిణీ-రుద్రపుష్కరిణి ప్రణవాకార విమానము తూర్పు ముఖము తిరుమంగై ఆళ్వార్లు కూర్చున్న భంగిమ ఏకాదశరుద్రులకు, ఇంద్రునకు, మాతంగ మహర్షికి.

సాహిత్యం[మార్చు]

శ్లో. భాభాతి దివ్య మణిమాడ పురే సురేంద్ర
   రుద్రాభిధాన నళినీ ద్వయ శీభమానే|
   శ్రీపుండరీక లతికా మహిషీ సమేతో
   నన్దా ప్రదీప భగవానితి నామధేయ:||

శ్లో. ప్రాచీముఖాసనలసన్ ప్రణవాభిధాన
   వైమాన వాస రసిక శ్శ్రిత పారిజాత:|
   ఏకాదశేశ మఘవన్నయనాను భూత
   శ్రీమత్కలిఘ్న మునిపుజ్గవ కీర్తిత శ్రీ:||

పాశురాలు[మార్చు]

పా. నన్దావిళక్కే యళత్తఱ్కరియామ్‌ నరనారణనే కరుమాముగిల్ పోల్
    ఎన్దాయ్;ఎమక్కేయరుళా యెననిన్ఱిమై యోర్‌పరమిడమ్‌ ఎత్తిశైయుమ్;
    కన్దార మన్దేనిశై పాడ మాడే కళివణ్డుழிత్త ழிల్ తుదైన్దు;
    మన్దారనిన్ఱు మణమల్గునాజ్గూర్ మణిమాడక్కోయిల్ వణజ్గెన్ మననే

పా. విడై యోడ వెన్ఱాయ్‌చ్చి మెన్ఱోళ్ నయన్ద వికిర్దావిళజ్గు శుడరాழி యెన్ఱుమ్‌
    పడై యోడు శజ్గోన్ఱుడై యాయా యెననిన్ఱమై యోర్ పరవుమిడమ్‌ పైన్దడత్తు
    ప్పెడై యోడు శెజ్గాలవన్నమ్‌ తుగైప్పత్తొగైప్పుణ్డరీకత్తిడెచ్చెజ్గழுనీర్
    మడై యోడ నిన్ఱు మదువిమ్మునాజ్గూర్ మణిమాడక్కోయిల్ వణజ్గెన్ మననే
             తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 3-8-1,9

చేరే మార్గం[మార్చు]

శీర్గాళి నుండి 10 కి.మీ.

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]