అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format

తిరుక్కణ్ణమంగై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుక్కణ్ణమంగై
తిరుక్కణ్ణమంగై is located in Tamil Nadu
తిరుక్కణ్ణమంగై
తిరుక్కణ్ణమంగై
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:భక్తవత్సల పెరుమాళ్
ప్రధాన దేవత:అభిషేకవల్లి తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:దర్శన పుష్కరిణీ
విమానం:ఉత్పల విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:రోమశ మహర్షికిని వరుణునకు

తిరుక్కణ్ణమంగై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

సన్నిధికి కావలసిన అంశములు ఏడు. అవి విమానము, మండపము, రథము, సరస్సు, క్షేత్రము, నదీ, నగరములు. ఈ ఏడు అంశములు కలిగియుండుటచే ఈ క్షేత్రమునకు సప్తామృతక్షేత్రమని పేరు వచ్చింది. ఈ సన్నిధిలో ఒక తేనెగూడు ఉంది. మహర్షులు తేనెటీగల రూపములో స్వామిని ఆరాధించిరట. ఆ తేనె గూటికిని తిరువారాధన జరుగును. "తిరుక్కణ్ణ మంగై యాండాన్" అవతార స్థలము. ఈ క్షేత్రస్వామిని గూర్చి తిరుమంగై యాళ్వార్ "పెఱమ్బుఱుక్కడలై" (పె.తి.10-10) అను దశకమును అనుగ్రహించు చుండగా నాల్గు పాశురములు అనుగ్రహించు సమయమున తిరునిన్ఱవూర్ భక్తవత్సల పెరుమాళ్ ఎదుట సేవ-సాయింపగా "కురుమామణి కున్ఱినై నిన్ఱవూర్ నిన్ఱ నిత్తిల త్తొత్తినై" అని మంగళా శాసనం చేసిరి. ఒక రాత్రి ఇచట నిద్రించినను మోక్షము లభించునని ప్రసిద్ధి.

ప్రవేశ ద్వారం చిత్రం
ఆలయ ట్యాంక్ చిత్రం

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
భక్తవత్సల పెరుమాళ్ అభిషేకవల్లి తాయార్ దర్శన పుష్కరిణీ తూర్పు ముఖము నిలుచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ ఉత్పల విమానము రోమశ మహర్షికిని వరుణునకు

సాహిత్యం

[మార్చు]

శ్లో. దర్శనాఖ్యసరో రమ్యే కణ్ణ మంగై పురీవరే
   అభిషేక లతాయుక్త: భక్తవత్సల నాయక:||
   ఉత్పలాఖ్య విమానస్థ: సురనాథ దిశాముఖ:
   రోమశర్షి ప్రచేతాభ్యాం సేవిత: కలిజిన్నుత:||

పాశురాలు

[మార్చు]

పా. పెరుమ్బుఱ క్కడలై యడற்றత్‌తివై ప్పెణ్ణై యాణై; ఎణ్ణిల్ మునివర్‌క్కు
   అరుళ్ తరున్దవత్తై ముత్తిన్ తిరట్కోవైయై ప్పత్తరావియై నిత్తిలత్తొత్తినై
   అరుమ్బినై యలరై యడియేన్ మనత్తాశైయై యుముదమ్బొది యిఇన్జవై
   కురుమ్బినై క్కనియై చెన్ఱునాడి కణ్ణమజ్గయు ట్కణ్డు కొణ్డేన్.

   ఏற்றవై యిమయత్తు ళెమ్మీశనై యిమ్మై యై మఱుమైక్కు మరున్దినై
   ఆற்றలై అణ్డత్తప్పుఱత్తాయ్ త్తిడుమై యనైక్కై యழி యొన్ఱేన్దియ
   కాற்றనై, కురుమామణిక్కున్ఱినై నిన్ఱవూర్ నిన్ఱ నిత్తిల త్తొత్తినై,
   కాற்றనై ప్పునలై చ్చెన్ఱు నాడి క్కణ్ణమజ్గై యుట్కణ్డు కొణ్డేనే.
           తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 7-10-1,5

చేరే మార్గం

[మార్చు]

తిరుచ్చేరై నుండి 24 కి.మీ. కుంభకోణం-తిరువారూర్ బస్ మార్గం తిరువారూర్ నుండి టౌన్ బస్ ఉంది. 8 కి.మీ. (కుంభకోణ మార్గం).

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]