Coordinates: 8°19′47″N 77°15′57″E / 8.32972°N 77.26583°E / 8.32972; 77.26583

ఆదికేశవ పెరుమాళ్ ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదికేశవ పెరుమాళ్ ఆలయం
ఆదికేశవ పెరుమాళ్ ఆలయం is located in Tamil Nadu
ఆదికేశవ పెరుమాళ్ ఆలయం
ఆదికేశవ పెరుమాళ్ ఆలయం
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :8°19′47″N 77°15′57″E / 8.32972°N 77.26583°E / 8.32972; 77.26583
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఆదికేశవ పెరుమాళ్
ప్రధాన దేవత:మరకతవల్లి తాయార్(పద్మిని)
దిశ, స్థానం:పశ్చిమ ముఖము
పుష్కరిణి:శ్రీరామ పుష్కరిణి
విమానం:అష్టాంగ విమానము
కవులు:నమ్మాళ్వార్లు
ప్రత్యక్షం:చంద్రునకు, పరాశర మహర్షికి

ఆదికేశవ పెరుమాళ్ ఆలయం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

ఈ క్షేత్రమునకు పరశురామ క్షేత్రమని పేరు. ఈ దివ్య దేశానికి రెండువైపుల రెండు నదులు ప్రవహించుటచే తిరువట్టారు అను పేరు వచ్చింది. తిరువనంతపురం ఇక్కడ కూడా స్వామిని మూడు ద్వారములలో దర్శించాలి. ఇక్కడ సాయంకాల సూర్యకిరణములు స్వామివదనమండలాన్ని సృజిస్తాయి. ఈక్షేత్రమునకు "వళం మీక్క" (మిక్కిలి సంపదగల దివ్యదేశము) అనే పేరు ఉంది. ఈ దివ్యదేశ విషయమై నమ్మాళ్వారు 10 వ శతకమున "అరుళ్ పెరువారడియార్" అను దశకమును రచించాడు. తిరువిరుత్తము మొదలు ఈ దశకము వరకు ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధములో స్వామిని పొందుటకై తాను పడిన పాటులను తపనను ప్రదర్శించారు. కానీ ఈ దశకము నుండి ఆళ్వార్లును పొందుటకై సర్వేశ్వరుడు పడుపాట్లను వివరిస్తున్నారు. అనగా ఆశ్రిత పారంగత్వం కీర్తించబడింది. "నమదు విదివగైయే" (మనకు విధించినట్లే యగును) అను స్థలమున వివరించిరి. ఈ పాశురమునకు భగవద్రామానుజుల వారి అర్ధ వివరణ ఇంది.

ఆలయం పాత దృశ్యం
రెండవ ఆవరణ చుట్టూ స్తంభాల హాలు

సాహిత్యం[మార్చు]

శ్లో. శ్రీ వాట్టారు పురే భుజంగ శయన శ్శ్రీరామ తీర్థాంచితే
   త్వష్టాంగాహ్వయ మాదికేశవ విభు ర్వైమాన మాప్త శ్రియమ్‌|
   దేవీం మారతకోన పూర్వలతికాం సంప్రాప్య పశ్చాన్ముఖ:
   స్తుత్య: చంద్ర పరాశరాక్షి విషయో రేజే శఠారేర్మునే:||

పాశురాలు[మార్చు]

పా. అరుళ్ పెఱువారడియార్;తమ్మడియనేఱ్కు;ఆழிయాన్
   అరుళ్ తరువానమై గిన్ఱా;నదు నమదు విదివగైయే;
   ఇరుళ్ తరుమా--లత్తు;ళినిప్పిఱవియాన్ వేణ్డేన్;
   మరుళొழிనీ మడనె--; వాట్టత్తా పడివణజ్గే.

   నణ్ణినమ్‌ నారాయణనై; నామజ్గళ్ పలశొల్లి
   మణ్ణులగిల్ వళమ్మిక్క; వాట్టాత్‌తాన్ వన్దిన్ఱు,
   విణ్ణులగమ్‌ తరువానాయ్; విరైగిన్ఱాన్ విదివగైయే,
   ఎణ్ణినవాఱాగా; విక్కరుమజ్గళెన్నె--
            నమ్మాళ్వార్లు-తిరువాయిమొழி 10-6-1,3

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
ఆదికేశవ పెరుమాళ్ మరకతవల్లి తాయార్ (పద్మిని) శ్రీరామ పుష్కరిణి పశ్చిమ ముఖము భుజంగ శయనము నమ్మాళ్వార్లు అష్టాంగ విమానము చంద్రునకు, పరాశర మహర్షికి

మార్గం[మార్చు]

త్రివేండ్రం-నాగర్‌కోయిల్ బస్‌లో "తొడివెట్టి" వద్ద దిగి వేరు బస్‌లో 10 కి.మీ. దూరములో సన్నిధి చేరవచ్చును. వసతులు స్వల్పము.

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]