Jump to content

తిరువయిందిర పురమ్

వికీపీడియా నుండి
తిరువయిందిర పురమ్
తిరువయిందిర పురమ్ is located in Tamil Nadu
తిరువయిందిర పురమ్
తిరువయిందిర పురమ్
Location in Tamil Nadu
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:దెయ్‌వనాయకన్(దేవనాథన్)
ప్రధాన దేవత:వైకుంఠనాయకి(హేమాబ్జవల్లి)
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:గరుడనది-శేషపుష్కరిణి
విమానం:చంద్రవిమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:చంద్రునకు, గరుత్మంతునుకు

తిరువయిందిర పురమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

శ్రీమత్ వేదాంతదేశికులు తపమాచరించిన ప్రదేశము. ఇక్కడ వేదాంత దేశికులు గరుడోపాసన చేసి గరుత్మంతుని వలన హయగ్రీవుల యనుగ్రహము పొందుటకై హయగ్రీవ మంత్రమును పొందాడు. ఇక్కడ ఉన్న కొండపై వారు ఆరాధించిన హయగ్రీవుల సన్నిధి ఉంది. ఈ కొండకు ఔషధాద్రి యనిపేరు. ఈక్షేత్రమున శ్రీమద్వేదాంతదేశికుడు నలుబది సంవత్సరములు నివసించాడు. ఆయన నివాసం స్వహస్తములతో నిర్మించిన నూతి (కిణర్) ఇప్పటికిని ఉంది. ఈక్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ శ్రీవేదాంత దేశికుని దేవనాయక పంచాశత్, అచ్యుతశతకం (ప్రాకృతభాష) -గరుడదండకం, గరుడ పంచాశత్, హయగ్రీవ స్తోత్రములు రచించబడ్డాయి. ఇచట మణవాళమహాముని సన్నిధి ఉంది.

ఉత్సవాలు

[మార్చు]

మేషము-పౌర్ణమి తీర్థోత్సవము-కన్యాశ్రవణం వేదాంతదేశికుల తిరునక్షత్ర మహోత్సవం చాలా వైభవముగా జరుగును.

సాహిత్యం

[మార్చు]

శ్లో. శ్రీమత్ తార్ద్య తరజ్గిణీ తటతలే శేషాఖ్య తీర్థాంచితే
   దేవ శ్శ్రీమదహేంద్ర పట్టణ వరే చంద్రాఖ్య వైమానగ:|
   వైకుంఠాఖ్య రమాయుతో విజయతే శ్రీ దేవనాథ ప్రభు:
   ప్రాగాస్య స్థితి రిందు తార్ద్య విషయ స్తుత్య: కలిద్వేషిణ:||

పాశురాలు

[మార్చు]

పా. మిన్ను మాழிయజ్గై యవన్; శెయ్యవళుఱైతరు తిరుమార్వన్;
   పన్ను నాన్మఱైప్పల్ పొరుళాగియ; పరనిడమ్‌ వరై చ్చారల్;
   పిన్ను మాదవి ప్పన్దలిల్; పెడైవర ప్పిణియవిழ் కమలత్తు;
   తైన్న వెణ్ఱు వణ్డిన్నిశై ముఱల్‌తరు; తిరువయిన్దిరపురమే.
            తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 3-1-2

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
దెయ్‌వనాయకన్ (దేవనాథన్) వైకుంఠనాయకి (హేమాబ్జవల్లి) గరుడనది-శేషపుష్కరిణి తూర్పు ముఖము నిలచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ చంద్రవిమానము చంద్రునకు, గరుత్మంతునుకు

చేరే మార్గం

[మార్చు]

మద్రాస్ - తిరుచ్చి రైలు మార్గంలో తిరుప్పాప్పు లియూర్ స్టేషన్ నుండి 5 కి.మీ. టౌన్ బస్ ఉంది. మద్రాస్ నుండి మిగతా పట్టణముల నుండి "కడలూరు" బస్ గలదు. అక్కడ నుండి టౌన్ బస్ 5 కి.మీ.

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]