తిరుక్కుడందై
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుక్కుడందై | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శార్జ్గ పాణి పెరుమాళ్,ఆరావముదు పెరుమాళ్ |
ప్రధాన దేవత: | కోమలవల్లి తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | హేమపుష్కరిణి |
విమానం: | వైదిక విమానము |
కవులు: | పూదత్తాళ్వార్;పేయాళ్వార్; తిరుమళిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్-తిరుమంగై యాళ్వార్ |
ప్రత్యక్షం: | హేమమహర్షికి |
తిరుక్కుడందై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]ఈ దివ్యదేశమున ఈ సన్నిధి కాక చక్రపాణి పెరుమాళ్ సన్నిధి; రామర్, వరాహనాయనార్ సన్నిధులు ఉన్నాయి. ఆలయంలో బ్రహ్మదేవునికి, సూర్యునికి ఉపాలయాలు ఉన్నాయి. తిరుమళిశై ఆళ్వార్ పరమ పదించిన ప్రదేశం. శార్జ్గ పాణి పెరుమాళ్ సన్నిధికి పడమట తిరుమళిశై ఆల్వారు సన్నిధి ఉంది. ఆలయంలో మకరం-మేషమాసములలో బ్రహ్మోత్సవము జరుగును
సాహిత్యం
[మార్చు]శ్లో. శ్రీ హేమాంబుజినీ తటీ తు నగరే శ్రీ కుంభఘోణాభిదే
ప్రాప్త:కోమల వల్లికాఖ్య మహిషీం శ్రీవైదికా గారగ:|
హేమాఖ్యాన మునీక్షితో విజయతే శ్రీ శార్జ్గా పాణి ప్రభు:
ప్రాగాస్యో భుజగేంధ్ర భోగశయనోతృప్తామృతాఖ్యాయుత:||
శ్లో. శ్రీ భూత మహదాఖ్యాన భక్తి సార శఠారిభి:|
విష్ణుచిత్త కలిఘ్నాఖ్యాం గోదాస్తుతి పరిష్కృత:||
పాశురాలు
[మార్చు] నడన్దకాల్‌గళ్ నొన్దవో నడుజ్గ ఈలమేనమాయ్
ఇడన్ద మెయ్ కులుజ్గవో విలజ్గుమాల్ వరై చ్చురమ్
కడన్ద కాల్ పరన్ద కావిరిక్కరై క్కుడన్దైయుళ్
కిడన్ద వారెళున్దిరున్దు పేశువాழி కేశనే! ||
తిరుమழிశై ఆళ్వార్ తిరుచ్చన్ద విరుత్తం 61
ఆరావముదే! అడియేనుడలం నిన్బాల్ అన్బాయే
నీరాయలైన్దు కరైయ ఉఱుక్కుగిన్ఱ నెడుమాలే!
శీరార్ శెన్నెల్‌కవరి వీశుం శెழுనీర్ తిరుక్కుడన్‌దై
ఏరార్ కోలమ్ తిగழగక్కిడన్దాయ్! కణ్డేన్ ఎమ్మానే.
కళవాయ్ తున్బమ్ కళై యాదొழிవాయ్ కళైగణ్ మற்றிలేన్
వళైవాయ్ నేమిప్పడై యాయ్‌కుడన్‌దై కిడన్ద మామాయా!
తళరావుడలమ్ ఎనదావి శరిన్దు పోమ్పోదు
ఇళయాదు నదాళ్ ఒరుజ్గప్పిడిత్తు ప్పోద విశైనీయే.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 5-8-1,8
ఆవియే! యముదే! యెననినై న్దురుగి అవరవర్ పణై ములై తుణయా
పావియే నుణరాదెత్తనై పగలుమ్ పొழுదుపో యొழிన్దన నాళ్‌గళ్
తూవిశేరన్నమ్ తుణైయొడుమ్ పుణరుమ్ శూழ் పునల్ కుడన్దైయే తొழுదు ఎన్
నావినాలుయ్య నాన్ కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్నుమ్ నామమ్!
తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-1-2
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
శార్జ్గ పాణి పెరుమాళ్, ఆరావముదు పెరుమాళ్ | కోమలవల్లి తాయార్ | హేమపుష్కరిణి | తూర్పు ముఖము | భుజంగ శయనమున ఉత్థాన శయనము | పూదత్తాళ్వార్;పేయాళ్వార్; తిరుమళిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్-తిరుమంగై యాళ్వార్ | వైదిక విమానము | హేమమహర్షికి |
చేరే మార్గం
[మార్చు]తమిళనాడులోని అన్ని ప్రసిద్ధ పట్టణముల నుండి బస్ సౌకర్యం గలదు.