తిరునరైయూర
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరునరైయూర | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | నంబి |
ప్రధాన దేవత: | నంబిగై నాచ్చియార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | మణిముక్తానది |
విమానం: | శ్రీనివాస విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | మేధావి మునికి |
తిరునరైయూర భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]తాయార్లకు ప్రాధాన్యత గల క్షేత్రము. ఇచ్చటి పెరుమాళ్లకు శ్రీనివాసన్, వాసుదేవన్, పరిపూర్ణన్, నంబియను తిరునామములు ఉన్నాయి. ఉత్సవ తాయార్ వంజుళవల్లి. ఇచట పెరుమాళ్లుతో సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ద, పురుషోత్తముడు ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఆలయంలో బ్రహ్మ సన్నిధి కూడా ఉంది. రాక్షసుడు అపహరించిన స్వామి వైరకిరీటాన్ని గరుడాళ్వార్ తీసికొని వచ్చు చుండగా ఆ యుద్ధములో కిరీటంలోని మణి అక్కడ ఉన్న నదిలో పడంది. తరువాత ఆ నదికి మణిముక్తా నది అనే పేరు వచ్చింది. స్వామి వైరకిరీటం ఇప్పటికీ శిఖర రహితంగా ఉంటుంది. ఇది తిరుమంగై ఆళ్వార్లకు పెరుమాళ్లు పంచ సంస్కారములను అనుగ్రహించిన దేశము. ఈ సన్నిధిలో రాతి గరుడ వాహనము ఉంది. మొదట నలుగురు స్వాములచే గర్భాలయము నుండి తీసికొని రాబడి, 16 మందిచే వాహన మంటపమునకు, 32 మందిచే అలంకార మంటపమునకు తీసుకువచ్చి పెరుమాళ్లను అధిష్ఠింపజేసి చేసి తరువాత 200 మంది శ్రీపాత్తాంగులతో తిరువీధి ఉత్సవము నిర్వహించడం అతి విలక్షణమైనది. ఈ ఉత్సవము వైకుంఠ ద్వాదశినాడు కుంభమాసంలో బ్రహ్మోత్సవములో 5వ రోజున రాత్రి జరుగును.
సాహిత్యం
[మార్చు]శ్లో. నరయూర్ పరిపూర్ణ నామకే మణిమక్తాఖ్య తరంగిణీ తటే|
త్రిదేశే ప్రధిశాముఖస్థితి: వరనంబిక్కలతా సమన్విత:|
శ్లో. శ్రీనివాసే విమానస్దో మేధావి మునిసేవిత:|
కలిజిమ్మని సంకీర్త్య రాజతే భక్తవత్సల:||
పాశురాలు
[మార్చు]1. పెడై యడర్త మడ వన్నమ్ పిరియాదు; మలర్కమలమ్
మడ వెడుత్త మదునుకరుమ్ వయలుడుత్త తిరువఱైయూర్
ముడై యడర్త శిరమేన్ది మూవులగుమ్ పలితిరివోన్
ఇడర్ కెడుత్త రువాళినిణై యడియే యడైనెంజే.
2. కులై యార్‌న్ద పళుక్కాయుమ్ పశుజ్గాయుమ్ పాళైముత్తుమ్
తలై యార్‌న్ద విళజ్గముగిన్ తడంజోలై త్తిఱునఱైయూర్
మలై యార్‌న్ద కొలంజోర్ మణిమాడ మిగమన్ని;
నిలై యార నిన్దాన్ఱన్ నీళ్‌కழలే యడై నెంజే
తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమొழி 6-9-1,8
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
నంబి | నంబిగై నాచ్చియార్ | మణిముక్తానది | తూర్పు ముఖము | నిలచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | శ్రీనివాస విమానము | మేధావి మునికి ప్రత్యక్షము |
చేరే మార్గం
[మార్చు]కుంభఘోణం నుండి టౌను బస్ ఉంది. 10 కి.మీ. ఉప్పిలియప్పన్, తిరుచ్చేరైల నుండియు సేవింపవచ్చును.