తిరుప్పేర్ నగర్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
Tirupernagar | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
పేరు | |
ప్రధాన పేరు : | Appakkudanthaan Perumal |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | తంజావూరు |
ప్రదేశం: | Tamilnadu, India |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | Appakkudanthaan Perumal (విష్ణు) |
పుష్కరిణి: | Kollidam |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | Dravidian architecture |
తిరుప్పేర్ నగర్ భారతదేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]ఈ దివ్య దేశానికి పెరునగర్ (పెద్ద నగరం) అను విలక్షణమైన మరొక పేరు ఉంది. నమ్మాళ్వార్లు తిరువాయిమొళి (10వ శతకం 9వ తిరువాయిమొழி) తిరుమాలిరుంశోలై మలై అను దశకములో "తిరుమాల్‌వన్దెన్నెంజు నిఱైయ పుకున్దాన్." (ఆ సర్వేశ్వరుడే వచ్చి నా హృదయము నిండునట్లు) అని పెరుమాళ్ల యొక్క స్వామిత్వమును ప్రకాశింపచేసిరి.
సాహిత్యం
[మార్చు]శ్లో. ఇంద్రాఖ్యాయుత తీర్థ శోభిత తలే శ్రీ మత్తిరుప్పేర్ పురే
పశ్చాద్వక్త్ర యుతో భుజంగ శయనోహీంద్రాఖ్య వైమాసగ: |
ఆలింగన్ కమలోప పూర్వ లతికా మప్పక్కుడుత్తాన్ విభు :
దృశ్యశ్చోపమనో : పరాశరమునే ర్విభ్రాజతే సర్వదా ||
శ్లో. భక్తిసార శఠారాతి కలిజిత్ రథయోగిభి:|
సంస్తుత:కుంభ సంరాజ ద్వామేతర కరాంబుజ:||
పాశురం
[మార్చు] తిరుమాలిరుఇజోమలై యెన్ఱేనెన్న
తిరుమాల్ వన్దెన్నెంజు నిఱై యప్పుగున్దాన్
కురుమామణియున్దు పునల్ పొన్నిత్తెన్ పాల్
తిరుమాల్ శెన్ఱు శేర్విడం తెన్ తిరుప్పేరే.
నమ్మాళ్వార్ తిరువాయిమొழி 10-8-1
చేరే మార్గం
[మార్చు]దీనిని "కోవిలడి" అంటారు. ఈక్షేత్రమును అన్బిల్ కొల్లడం ఎడమవైపున ఉంది. తిరుచ్చి నుండి బస్ మార్గంలో 24 కి.మీ. లాల్గుడి నుండి 10 కి.మీ. కుంభకోణం నుండి-తిరుక్కాట్టుపళ్లి-తిరువైయ్యారు బస్ మార్గమున "కల్లణై" పోవు బస్‌లోను పోవచ్చును.
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
అప్పక్కుడుత్తాన్ | కమలవల్లి తాయార్ | ఇంద్ర తీర్థము | పశ్చిమ ముఖము | భుజంగ శయనము | తిరుమొళిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగై యాళ్వార్ | ఇంద్ర విమానము | ఉపమన్యువునకు పరాశర మహర్షికి |