అయోధ్య
ఈ వ్యాసంలో అక్షరదోషాలు, వ్యాకరణం, శైలి, ధోరణి మొదలైన వాటిని సరి చెయ్యడం కోసం కాపీ ఎడిటింగు చెయ్యాల్సి ఉంది. |
అయోద్య (Ayodhya)
సాకేతపూరం (Saketa) | |
---|---|
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/India ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)" does not exist. | |
Coordinates: 26°48′N 82°12′E / 26.80°N 82.20°E | |
Country | India |
State | ఉత్తర ప్రదేశ్ |
District | పైజాబాద్ (Faizabad District) |
Government | |
• Type | మేయర్ కౌన్సిల్ |
• Body | అయోద్య మునిసిఫల్ కార్పొరేషన్ (Ayodhya Municipal Corporation) |
• Mayor | Rishikesh Udadayaya, BJP |
విస్తీర్ణం | |
• Total | 79.8 కి.మీ2 (30.8 చ. మై) |
Elevation | 93 మీ (305 అ.) |
జనాభా (2011) | |
• Total | 4,50,899 |
• జనసాంద్రత | 5,700/కి.మీ2 (15,000/చ. మై.) |
భాషలు | |
• అధికార | హిందీ, ఉర్దూ, and ఆంగ్లం |
• Additional languages | Awadhi dialect of Hindustani (native dialect) |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 224123 |
టెలిఫోన్ కోడ్ | 05278 |
Vehicle registration | UP-42 |
అయోధ్య ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతిపురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాదుని ఆనుకుని ఉంది. అయోధ్య సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసలరాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది.
నేపథ్యం
[మార్చు]అయోధ్య సరయూ నదీ తీరాన, ఫైజాబాద్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్య విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతం. రామాయణాన్ని అనుసరించి 9,000 సంవత్సరాలకు పూర్వం, వేదాలలో ఆది పురుషుడుగా, హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు, ఈ నగరాన్ని స్థాపించాడు. మరికొన్ని ఆధారాలనుబట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ ద్వారా నిర్మితమైందని తెలుస్తోంది. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోశలదేశానికి, అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన శ్రీ రామచంద్రుడు పాలించాడు.
గరుడ, స్కంద, ఇతర పురాణాలు భారతదేశం లోని ఏడు మోక్షపురాలలో అయోధ్యను ఒకటిగా పేర్కొన్నాయి . హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్నపుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. అధర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని అది స్వర్గసమానమని పేర్కొన్నది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశపు వాడైన పృథువు వలన భూమికి పృథ్వి అనే పేరు వచ్చింది. తరువాత రాజు మాంధాత. సూర్యవంశం లోని 31వ రాజు హరిశ్చరంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి. తన సత్యవాక్పరిపాలనతో సూర్య వంశానికే ఘన కీర్తి చేకూర్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధయాగం చేయ సంకల్పించినప్పుడు కలిగిన విఘ్నాలను తొలగించడానికి, ఆయన ముని మనుమడైన భగీరథుడు గంగానదిని విశేషప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. తర్వాత వచ్చిన రఘుమహారాజు చేసిన రాజ్యావిస్తరణతో గొప్ప పేరుగడించి సూర్యంశానికి మారుపేరుగా నిలిచాడు. రఘుమహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా ఘనత వహించింది. రఘుమహారాజు మనుమడు దశరథుడు. దశరథుడి కుమారుడే శ్రీ రామచంద్రుడు.
ఆరాధన ప్రధానమైన నగరాలలో అయోధ్య ఒకటి. పలు మతాలు ఈ నగరానికి పవిత్రనగర ప్రాముఖ్యత ఇచ్చాయి. అలాగే నగరం పైన ఆధిక్యత కూడా హిందూమతం, బౌద్ధ మతం, జైన మతం, ఇస్లాం మతాల మధ్య మారుతూ వచ్చింది. ఉదాహరణగకు, జైనమత గురువులైన పంచ తీర్థంకరులు ఇక్కడ జన్మించారు. వారు మొదటి తీర్థంకరులైన అధినాథ్, రెండవ తీర్థంక రులైన అజిత్నాథ్, నాలుగవ తీర్థంకర్ అభినందనాథ్, ఐదవ తీర్థంకర్ సుమతీనాథ్, పదునాలుగవ తీర్థంకర్ అనంతనాథ్.. నవాబు అవధ్ చేత నిర్మించబడిన హనుమాన్‍ఘర్హి ఆలయం గంగా-యమునా సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఒక భక్తుని సంరక్షణలో కొనసాగుతున్న ఈ రామాలయాన్ని మున్నామెయిన్ 50 సంవత్సరాల కాలం నిర్వహించి తరువాత 2004లో మరణించాడు. జైనుల తదనంతరం, షికారాజి తరువాత అయోధ్య మరో మతానికి పవిత్రనగరంగా మారింది. ఒకే మతపు ఆధిక్యతలో ఈ నగరం స్థిరంగా ఉండకుండా మార్పులకు లోనవుతూనే వచ్చింది.
చరిత్ర
[మార్చు]అతిపురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. రామాయణంలో ఈ నగరవైశాల్యం 250 చదరపు కిలోమీటర్లు (90 చదరపు మైళ్ళు ) గా వర్ణించబడింది. కోసలరాజ్యానికి రాజధాని అయోధ్య. ఇది పతితపావని అయిన గంగానదీ తీరంలో ఉంది. అలాగే సరయూనది కుడివైపున్నది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకు కోసలరాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. దశరథుడి కుమారుడే శ్రీరాముడు.
వాల్మీకి విరచితమైన రామాయణ మాహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు. అంతేకాక కోసల సామ్రాజ్యవైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించిన గొప్ప వర్ణన ఉంది. తులసీదాసు తిరిగి రచించిన రామచరితమానస్‍లో అయోధ్య వైభవం వర్ణించాడు. తమిళకవి కంబర్, తాను వ్రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య గురించి అత్యున్నతంగా వర్ణించాడు. తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బహుబలి, సుందరి, పాడలిప్తసురీశ్వరి, హరిచంద్ర, అచలభరత మొదలైనవారు అయోధ్యలో జన్మించిన వారే.
జైన్ మతస్థులకూ ప్రముఖ్యమైన నగరం అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులకు అయోధ్య జన్మస్థలం. జైన ఆగమాలలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్లు వర్ణించటం జరిగింది.
అయోధ్య, బౌద్ధమత వారసత్వం కలిగిన నగరం. ఇక్కడ మౌర్యాచక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, స్మారకనిహ్నాలు, శిక్షణాకేంద్రాలు ఉన్నాయి. గుప్తులకాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. సా.శ.పూ. 600 లలో కూడా అయోధ్య వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. క్రీ.పూ 5వ శతాబ్ద ప్రారంభం నుండి సా.శ. 5వ శతాబ్ధాంతం వరకు బౌద్ధమతకేంద్రంగా అయోధ్య విలసిల్లినది. బుద్ధుడు ఈనగరానికి ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు భావిస్తున్నారు. కానీ దీనికి వ్రాతపూర్వక ఆధారాలు మాత్రం లేవు. ఫాహియాన్ అనే చైనా సన్యాసి బౌద్ధమత మఠాలు ఉన్నట్లు పేర్కొన్నాడు.
స్వామినారాయణ మార్గ స్థాపకుడైన స్వామినారాయణుడు ఇక్కడ జన్మించాడని, ఏడు సంవత్సరాల అనంతరం నీల్కాంత్‍గా భారతదేశ సంచారానికి వెళ్లాడాని విశ్వసిస్తారు.
నామ చరిత్ర
[మార్చు]పురాణాలలో మహారాజైన ఆయుధ్ ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం. గౌతమబుద్ధుని కాలంలో ఈ నగరం పాళీ భాష లో అయోజిహాగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్ధాన్ని ఇస్తుంది. పురాణాలలో గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది.
సామాన్య శకం మొదటి శతాబ్ధాలలో ఈ నగరాన్ని సాంకేతపురంగా పేర్కొన్నారు. సా.శ.127 సాంకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పుప్రాంతంనికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్సియన్ (పినియిన్: షాజి) అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి యుఁవాన్ త్స్యాంగ్ సా.శ.636 లో తన భారతదేశ యాత్రలో ఈనగరాన్ని అయోధ్యగా పేర్కొన్నాడు. కాని ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్న విషయంలో స్పష్టత లేదు.మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలనాసమయంలో ఈనగరాన్ని అయోధ్య, అజోధియగా పేర్కొన్నారు . అలాగే అయోధ్య, బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా-అయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది.
వారసత్వం , ప్రాముఖ్యత
[మార్చు]అయోధ్య అత్యంత ప్రాచీనమైన, విశాలమైన, అత్యద్భుతమైన నగరం. హిందూ పురాణాల ప్రకారం సూర్యవంశానికి చెందిన 63 వ రాజు దశరథుని రాజ్యమైన కోసల రాజ్యానికి, రాజధానిగా ఉండేది. రామాయణంలోని ప్రారంభ అధ్యాయాలలో ఈ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడి ప్రజల మంచితనాన్ని గురించి వర్ణించడం జరిగింది.
జైన మతానికి చెందిన ఐదుగురు తీర్థంకరులు కూడా ఇక్కడే జన్మించారు. జైన మతానికి ఆధ్యుడైన శ్రీ వృషభనాథుడు (రిషభదేవుడు) కూడా ఇక్కడే జన్మించాడు. భగవాన్ స్వామి నారాయణ్ కూడా తన బాల్యం ఇక్కడే గడిపాడు. ఆయన భారతదేశం అంతటా ఏడు సంవత్సరాలు పర్యటించినపుడు, ఆ యాత్రను ఇక్కడ నుంచే ప్రారంభించాడు. తులసీదాసు కూడా తానురచించిన రామచరిత మానస్ గ్రంథాన్ని సా.శ.1574 లో ఇక్కడ నుంచే ప్రారంభించాడు. తమిళనాడుకు చెందిన చాలామంది ఆళ్వార్లు కూడా అయోధ్య నగరాన్ని గురించి తమ రచనల్లో ప్రస్తావించారు.
స్వతంత్ర భారతదేశం
[మార్చు]1984 సం.లో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీదు స్థలాన్ని రామ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1992 సం.లో ఒక హిందూ జాతీయవాద ర్యాలీలో జరిగిన అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేతకు దారి తీశాయి.[1] ఇప్పుడు, రామజన్మభూమి స్థలములో రాముడు చిన్నపిల్లవాడిగా, వికసించే తామరపువ్వులా నవ్వుతూ ఉన్న విగ్రహం, రామ్ లల్లాతో (రామలీల) తాత్కాలిక మందిరం ఉంది.[2] భారత ప్రభుత్వం అధీనం క్రింద ఉన్న 200 గజాల స్థలం వద్ద ఎవరికీ అనుమతి లేదు, ఇక్కడ ఈ స్థలం వద్ద ఉన్న ద్వారం వెలుపల గేటుకు తాళం వేయబడింది. అయితే, వివాదాస్పదం కాని స్థలంలో హిందూ యాత్రికులు, రాముని పూజ కొరకు మరోవైపు ఉన్న తలుపు ద్వారా ప్రవేశించడం మొదలు పెట్టారు. 2003 సం.లో, పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బాబ్రీమసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని తొలగించి, దాని శిథిలాలపై మసీదు నిర్మించటం జరిగిందా అనే దానిపై ఒక త్రవ్వకాన్ని నిర్వహించింది. తవ్వకం జరిపిన పిదప వివిధ రకాల వస్తువులు, హనుమంతుని 12 అడుగుల (3.7 మీ) విగ్రహంతో సహా, ప్రారంభ చారిత్రక కాలానికి చెందిన నాణేలు, ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి.[3] బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం, పురాతన ఆలయాన్ని కూల్చివేయడం లేదా సవరించడం ద్వారా జరిగిందని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్ధారించింది.[4] హిందువులు మాత్రమే కాకుండా, బౌద్ధ, జైన ప్రతినిధులు తవ్విన ప్రదేశంలో వారి దేవాలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.[5]
అయోధ్య వివాదం
[మార్చు]మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని అధారాలు ఉన్నాయి..1992 వ సంవత్సరంలో రామ భక్తులు, దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పి.వి. నరసింహారావు. దీన్ని నివారించలేక పోయిన ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చ లా మిగిలిపోయింది. 2019 నవంబరు 09 న అయోధ్య తుదితీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. '2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశాలిచింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ భూమిని ట్రస్ట్‌కి అప్పగించాలని, ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ చేపట్టాలని' ఆ తీర్పులో వెల్లడించింది.[6]
2005 జూలై 5 న ఐదుగురు ముస్లిం తీవ్రవాదులు అయోధ్యలో ఉన్న తాత్కాలిక రామలీల ఆలయ ప్రదేశం వద్ద దాడి చేశారు. తరువాత, మొత్తం ఐదుగురి తీవ్రవాదుల్ని భద్రతా దళాలు తుపాకీతో కాల్చి చంపాయి, బాంబు పేలుడులో ఒక పౌరుడు చనిపోయాడు, వారు కోర్డన్ గోడను ఉల్లంఘించటానికి ప్రయత్నించారు.
అయితే జనవరి 22, 2024 తారీఖున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా వేద మంత్రోచ్చారణాల మధ్య అయోధ్యలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ఘనంగా జరిగింది. దాంతో దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరామచంద్రుడి ఆలయం నిర్మాణం సమగ్రంగా పూర్తి అయినట్టుగా పరిగణించడం జరిగింది.
భౌగోళిక స్వరూపం
[మార్చు]అయోధ్య మధ్య భారతంలో సాధారరణంగా ఉండే తేమకలిగిన ఉపౌష్ణమండల ఉష్ణోగ్రతను కలిగి ఉంది. సుదీర్ఘమైన వేసవికాలం మార్చిమాసాంతంలో ఆరంభమై జూన్ మధ్యకాలం వరకు కొనసాగుతుంది. సాధారణ దినసరి ఉష్ణోగ్రత 32 ° సెంటీగ్రేడ్ (90 °ఫారెన్‌హీట్) ఉంతుంది. వేసవి తరువాత ఆరంభమైయ్యే వర్షాకాలం అక్టోబరు వరకు కొనసాగుతాయి. సుమారు వర్షపాతం 1067 (42 అంగుళాలు) మిల్లీమీటర్లు ఉంటుంది. వర్షాకాలం ఉష్ణోగ్రతలు 16° సెంటీగ్రేడ్ (60° ఫారెన్‌హీట్) ఉంది. అయినప్పటికీ వర్షాకాల రాత్రులలో చలి అధికంగా ఉంటుంది.
జనాభా
[మార్చు]2001 సం. భారత జనాభా లెక్కల ప్రకారం, అయోధ్యలో 49,593 మంది జనాభా ఉంది. పురుషుల జనాభా 59%, స్త్రీల జనాభా 41%గా ఉంది. అయోధ్య సగటు అక్షరాస్యత రేటు 65%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. అలాగే 72% పురుషులు, 62% స్త్రీలు అక్షరాస్యులు. 6 సంవత్సరాల వయస్సు కంటే తక్కువున్న వారి జనాభా 12% .[7]
వాతావరణం
[మార్చు]అయోధ్య ఒక తేమతో కూడిన ఉప ఉష్ణమండలీయ వాతావరణాన్ని కలిగి ఉంది, ఇది మధ్య భారతదేశం యొక్క ప్రత్యేకమైన వాతావరణ స్థితి. వేసవి కాలాలల్లో (మార్చి చివరి నుండి జూన్ మధ్య వరకు), పగలు ఎక్కువగా వాతావరణం పొడిగానూ, వేడిగానూ ఉంటుంది.సగటు రోజువారీ ఉష్ణోగ్రతలు 32 ° సె. (90 ° ఫా) సమీపంలో ఉంటాయి. ఇవి వర్షాకాలం లో, అక్టోబరు వరకు సుమారు 1,067 మి.మీ. (42.0 అం.) యొక్క వార్షిక వర్షపాతంతో, సగటు ఉష్ణోగ్రతలు 28 ° సె (82 ° ఫా). కొనసాగుతాయి. శీతాకాలం నవంబరు మొదట్లో మొదలై జనవరి చివరి వరకు ఉంటుంది. తరువాత ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొద్దిసేపు వసంతకాలం ఉంటుంది. సగటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా 16 ° సె (61 ° ఫా) సమీపంలో ఉంటాయి, కానీ రాత్రి వేళలు చల్లగా ఉంటాయి.
చూడవలసిన ప్రదేశాలు
[మార్చు]అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాలు చూడాలంటే రిక్షాలు మాట్లాడుకుని వాటిలో వెళ్ళి చూడాలి. రిక్షా నడిపేవారు ఇక్కడ ముఖ్యమైన ఆలయాలు, మందిరాలను ఒక్కొక్కటిగా చూపుతారు. రామజన్మభూమిని కూడా అలాగే చూడాలి.
- సరయూనది స్నానఘట్టం: ఇక్కడ సరయూ నది తీరంలో బంకమట్టి అధికంగా ఉంటుంది. కాలు జారదు కాని కాళ్ళను గట్టిగా పట్టుకుంటుంది కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. సరయూ నదీజలాలు తేటగానూ శుభ్రంగానూ ఉంటాయి.
- రామజన్మభూమి ఆలయనిర్మాణ ప్రదేశం:ఇక్కడ రామజన్మభూమిలో వివాదం ముగిసాక ఆలయనిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి. సుమారు. నిర్మాణానికి అవసరమైనవి 80% సిద్ధంగా ఉన్నాయని అంచనా.
- అన్నదాన సమాజం:అయోధ్యలో భిక్షువులు ఉండకూడదన్న ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం. ఇక్కడ దాతలసహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న గోశాలలో 200 కు పైగా గోవులు ఉన్నాయి. ఈ గోక్షీరం ఆశ్రమనిర్వహణకు వినియోగిస్తారు.
- కౌసల్యాదేవి మందిరం. శ్రీరామునికి జన్మనిచ్చిన కౌశల్యాదేవికి ఇక్కడమాత్రమే మందిరం ఉంది. ఈ మందిరంలో కౌశల్యాదేవి, దశరథులతో రామచంద్రుడు ఉండడం విశేషం.
- హనుమద్ మందిరం: ఇక్కడ ఉన్న హనుమదాలయంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతూ ఉంటుంది.
- వాల్మీకి మందిరం: వాల్మీకి మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మీకి రామాయణంలోని 24 వేల శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ మూల మందిరంలో వాల్మీకి మహర్షితో లవకుశులు ఉండడం విశేషం.
- కనక మహల్: సీతారాములు వివాహానంతరం అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైకేయీ, దశరథులు వివాహ కానుకగా సీతారాములకు ఈ భవనం ఇచ్చారని విశ్వసిస్తారు. ప్రస్తుత భవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని కథ ప్రచారంలో ఉంది. విక్రమాదిత్యుడు సరయూ నదిలో స్నానం ఆచరించి అయోధ్యా నగరంలో ప్రవేశించిన తరువాత ఆయనకు ఇక్కడ గతంలో ఉన్న భవనాలు కళ్లకు కట్టినట్లు గోచరమైయ్యాయని తరువాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు, భవనాలు నిర్మించాడని ప్రజల విశ్వాసం.
- హనుమదాలయం: రామచంద్ర పట్టాభిషేకం తరువాత రామచంద్రుడు తనకు సాయం చేసిన వారందరికి కానుకలు సమర్పించిన తరువాత తనకు అత్యధికంగా సహకరించి, సేవించిన హనుమంతునికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని, అక్కడ ప్రస్తుత ఆలయనిర్మాణం జరిగిందని విశ్వాసం. పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయం కొంచం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 90 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంది.
- రామజన్మ భూమి: బాబర్ మసీదు నిర్మించిన ప్రదేశంలో రామజన్మ భూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సీతారాములకు పూజాధికాలు నిర్వహించబడుతున్నాయి. అత్యంత భద్రతల మధ్య, రక్షణ వలయంలో క్యూపద్ధతిలో ప్రయాణించి ఈ ఆలయాన్ని చూడాలి. లోపలకు ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అలాపోతూ పోతూనే ఆలయాన్ని దర్శించాలి. ఎక్కడా నిలవడానికి రక్షణసిబ్బంద్జి అనుమతించదు. సెల్ పోన్, కెమెరాలు, పెన్నుల వంటివి కూడా లోపలకు అనుమతించరు. లోపల కనీసం రెండు మూడు కిలోమీటర్లు నడవాలి.
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
శ్రీరామచంద్రులు (రఘునాయకన్) - | సీతాదేవి | సరయూనది, సత్యపుష్కరిణి | ఉత్తరముఖము | కూర్చున్న భంగిమ | నమ్మాళ్వార్-కలియన్-కులశేఖరాళ్వార్-పెరియాళ్వార్-తొండరడిప్పాడి యాళ్వార్ | పుష్కల విమానము | భరతుడికి దేవతలకు |
విశేషాలు
[మార్చు]ముక్తిప్రదక్షేత్రాలలో ఒకటిగా కీర్తించారు. సరయూనదికి సమీపాన శ్రీరంగనాథుల సన్నిథి ఉంది. ఇచట దక్షిణ దేశ అర్చక స్వాములు ఉన్నారు.
వైష్ణవ దివ్యదేశాలు
[మార్చు]108 వైష్ణవ దివ్యదేశాలలో అయోధ్య ఒకటి.
మార్గం
[మార్చు]తిరునక్షత్ర తనియన్:
చైత్రమాసే సితే పక్షే నవమ్యాంచ పునర్వసౌ
మధ్యాహ్నే కర్కటేలగ్నే రామోజాత స్స్వయంహరి:
కాశి-వారణాసి-లక్నో రైలుమార్గంలో ఫైజాబాద్ స్టేషన్‌లో దిగి బస్‌లో 10 కి.మీ వెళ్ళి ఈ క్షేత్రం చేరుకోవచ్చు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
సాహిత్యం
[మార్చు]శ్లో. భాతి శ్రీ సరయూ సరిత్తట గతే శ్రీ మానయోధ్యా పురే
శ్రీ మత్పుష్కల దేవయాన నిలయ సత్యాఖ్య కాసారకే|
సీతాలిజ్గిత మూర్తిరుత్తర ముఖ శ్రీ రామ నామా హరి
స్త్వాసీనో భరతాభిర్ముని గణైర్దేవ్యైచ దృష్ట స్సదా||
పరాంకుశ కలిధ్వంస కులశేఖర సూరిభి:
విష్ణుచిత్తేన మునినా మంగళై రభి సంస్తుత:||
పాశురాలు
[మార్చు]పా. అజ్గణెడుమదిళ్ పుడై శూழ் యోత్తి యెన్ఱుమ్
అణినగరత్తులగునై త్తుమ్ విళక్కు-ది
వెజ్గదిరోన్ కులత్తు క్కోర్ విళక్కాయ్‌తోన్ఱి
విణ్‌ముழுదు ముయ్యకొణ్డ వీరన్ఱన్నై
శెజ్గణెడుమ్ కరుముగిలై యిరామన్ఱన్నై
త్తిల్లై నగర్ తిరుచిత్తర కూడన్దన్నుళ్
ఎజ్గళ్ తనిముదల్వనై యెమ్బెరుమాన్ఱన్నై
యెన్ఱుకొలో కణ్‌కుళిర క్కాణునాళే.
కులశేఖరాళ్వార్-పెరుమాళ్ తిరుమొழி 10-1
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Amy Chua (2007). Day of Empire: How Hyperpowers Rise to Global Dominance -- And Why They Fall. Doubleday. p. 182. ISBN 9780385512848.
- ↑ "The Hindu: Ram Lalla deity to be taken to Ayodhya". Hinduonnet.com. 19 January 2002. Archived from the original on 1 మార్చి 2006. Retrieved 30 September 2010.
- ↑ "Proof of temple found at Ayodhya: ASI report". Rediff.com. 25 August 2003. Archived from the original on 26 September 2010. Retrieved 30 September 2010.
- ↑ "Evidence of temple found: ASI". 25 August 2003.
- ↑ Seema Chishti (14 March 2003). "14 March 2003". BBC News. Retrieved 2012-06-11.
- ↑ "వివాదాస్పద స్థలిలో మందిర్ | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2019-11-10.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.