ఫాహియాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫాహియాన్ (క్రీ.శ 337 – 422 ) చైనా దేశానికి చెందిన ఒక బౌద్ధ యాత్రికుడు. క్రీ.శ 399, 412 సంవత్సరాల మధ్యలో కొన్ని బౌద్ధ గ్రంథాలను సేకరించడం కోసం చంద్రగుప్తుని కాలంలో భారతదేశం, శ్రీలంక, నేపాల్ దేశాలను సందర్శించాడు. తన యాత్రా విశేషాలన్నీ ఒక పుస్తకంలో పొందు పరచాడు. ఆ పుస్తకంలో తన అనుభవాలను, ఆనాటి స్థితి గతులను, సంస్కృతులను గ్రంథస్తం చేశాడు.

క్రీ.శ 402 లో ఇతని రాకతో భారత దేశ చైనా సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఈయన రచనల ద్వారా మొట్టమొదటి బౌద్ధ మతం గురించి ముఖ్యమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. చైనాకు తిరిగివెళ్ళి తాను సేకరించిన అనేక సంస్కృత బౌద్ధ గ్రంథాలను చైనీస్ భాషలోకి తర్జుమా చేశాడు.

ఫాహియాన్ చారిత్రకంగా రెండు రకాలుగా సుప్రసిద్ధుడు. ఒకటి తన ప్రయాణ విశేషాలతో కూడిన పుస్తకాల ద్వారా భారతదేశంలో ముస్లిం దండయాత్రలకు మునుపు విలసిల్లిన బౌద్ధ సాంప్రదాయాన్ని తన విస్తృతమైన వర్ణనల ద్వారా ప్రపంచానికి అందించాడు. రెండోది బౌద్ధుల పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా చైనాలో బౌద్ధాన్ని బల పరచాడు. భారతదేశంలో పది సంవత్సరాలపాటు అనేక బౌద్ధ గ్రంథాలను అభ్యసించిన ఫాహియాన్ వాటి నకలు ప్రతులను చైనాకు తీసుకువెళ్లడమే కాకుండా వాటిని చైనీస్ లోకి తర్జుమా చేశాడు. వీటిలో ముఖ్యమైనవి మహాపరినిర్వాణ సూత్రాలు (నిర్వాణం, దాని తీరు తెన్నులు గురించిన పస్తకం), వినయ ( బౌద్ధ సన్యాసులు ఆచరించవలసిన సూత్రాలు).

"https://te.wikipedia.org/w/index.php?title=ఫాహియాన్&oldid=1195412" నుండి వెలికితీశారు