ఖటు
ఖటు | |
---|---|
![]() రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఖాటు శ్యామ్ దేవాలయం | |
Coordinates: 27°21′50″N 75°24′09″E / 27.363954°N 75.402557°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | సికార్ జిల్లా |
Government | |
• Body | నగరపాలక |
భాషలు | |
• అధికారిక | ధుంధారి, హిందీ, రాజస్థానీ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
ISO 3166 code | RJ-IN |
Vehicle registration | RJ- |
Ringas | సికార్ |
Website | http://khatu.co.in [1] |
ఖటు, రాజస్థాన్ రాష్ట్రం, సికార్ జిల్లాలోని రీంగస్ పట్టణానికి సమీపంలో ఉన్న మతపరమైన ప్రాముఖ్యత కలిగిన గ్రామం. ఖటు గ్రామంలో అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటైన ప్రసిద్ధ ఖాటు శ్యామ్ దేవాలయం ఉంది.[2] రాజస్థాన్‌లో, హిందూ దేవత బార్బరికను ఖతు శ్యామ్‌గా పూజిస్తారు.
దేవాలయాలు[మార్చు]
ఖతుష్యామ్జీ ఆలయం పట్టణం నడిబొడ్డున ప్రసిద్ధ మక్రానా పాలరాతితో నిర్మించిన ఖతుశ్యామ్జీ దేవాలయం ఉంది. దేవాలయంలో పూజకోసం ఒక పెద్ద హాలు ఉంది. దీనిని జగ్మోహన్ అని పిలుస్తారు. గర్భగుడిలో ఉన్న బాబా శిరస్సు, అన్నివైపుల నుండి అందమైన పూలతో అలంకరించబడి ఉంటుంది. మైదానం, జాతర మైదానం, శ్యామ్ మందిర్ కమిటీ కార్యాలయం ఉన్నాయి.[3]
శ్యామ్ కుండ్ దేవాలయానికి సమీపంలో ఉన్న పవిత్ర చెరువు ఇది. ఇది శీష్ (తల) నుండి ఉద్భవించింది. ఈ చెరువులో స్నానం చేస్తే అనారోగ్యాలు నయమవుతాయని, మంచి ఆరోగ్యం చేకూరుతుందని భక్తులు నమ్ముతారు.
శ్యామ్ బాగీచా దేవాలయానికి సమీపంలో ఉన్న ఒక తోట, ఇక్కడ నుండి దేవుడికి పూజకు పువ్వులు సేకరిస్తారు. గొప్ప భక్తుడైన లెఫ్టినెంట్ అలు సింగ్జీ సమాధి కూడా ప్రాంగణంలోనే ఉంది.
గౌరీశంకర్ దేవాలయం ఖతుశ్యాంజీ దేవాలయానికి సమీపంలో ఉన్న శివాలయం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైనికులు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని భావించి, ఈటెతో శివలింగంపై దాడి చేయగా, శివలింగం నుండి రక్తపుధారలు కనిపించడంతో సైనికులు భయంతో పరుగులు తీశారని పురాణ కథలు చెబుతున్నాయి. లింగంపై ఈటె గుర్తును ఇప్పటికీ చూడవచ్చు.