బల్లెము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మేస వెర్దె జాతీయవనంలోని వేట బల్లెము మరియు ఖడ్గము.
ఓక మొఘల్ సైనికుడు

బల్లెము లేదా ఈటె (ఆంగ్లం: Spear) ఒక విధమైన ఆయుధము. ఇది పొడవుగా ఉండే దండానికి అమర్చి ఉండి చివర మొనదేలి ఉంటుంది. వెదురు ఈటెలలో మొనదేలిన భాగం కూడా వెదురు కర్రనే సూదిగా చేసి ఉంటుంది. ఇది వేట కోసం మరియు యుద్ధాలలో ప్ర్రాచీనకాలం నుండి ఉపయోగంలో ఉన్నాయి. ఇతర కలపతో చేసిన ఈటెలలో చివర భాగం త్రికోణాకారం లేదా పత్రాకారంలో లోహంతో చేయబడి దండానికి బిగించి ఉంటుంది.


బల్లెము రాతి యుగం నుండి ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తిగత ఆయుధము. ఇది మానవులు తయారుచేసిన మొట్టమొదటి ఆయుధం. ఇది ఇప్పుడు కూడా వేట కోసం మరియు చేపల్ని పట్టడం కోసం కొన్ని ప్రాంతాలలో ఉపయోగంలో ఉన్నాయి. వేటలో దూరం నుండే జంతువులను చంపి ఆహారంగా ఉపయొగించుకొనేవారు - ప్రాచీన మానవులు. తరువాత కాలంలో వీటిని యంత్రాల సాయంతో దూరంగా ఉండే శత్రువులను చంపడానికి యుద్ధంలో ఉపయోగించేవారు.


ఆధునిక క్రీడలలో ఒకటైన జావెలిన్ లేదా బల్లెకోల కూడా బల్లెము ఆకారంలొనే ఉండి తేలికగా ఉంటుంది.

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=బల్లెము&oldid=811654" నుండి వెలికితీశారు