Jump to content

ఆయుధం

వికీపీడియా నుండి
(ఆయుధము నుండి దారిమార్పు చెందింది)
కంచు యుగపు ఆయుధాలు.

ఆయుధాలు (ఆంగ్లం: Weapons) ఇతరుల్ని గాయపరచడానికి లేదా చంపడానికి పనికొచ్చే సాధనాలు.[1][2] ఇవే ఆయుధాలు మనల్ని, ఇతరుల్ని రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి చిన్న కత్తి నుండి క్లిష్టమైన రాకెట్ వరకు వివిధ రకాలుగా ఉన్నాయి.

పురాణకాలము నుండి భారతీయ గాథలలో అనేక ఆయుధముల ఉపయోగము జరిగింది. దేవతలు, రాజులు మొదలుకొని ఇప్పట్కికీ అడవులలో నివసించే ఆదిమ జాతులు అలనాటి ఆయుధాల వినియోగం జరుపుతున్నారు.

ఆయుధాలలో రకాలు

[మార్చు]
  • వ్యక్తిగత ఆయుధాలు: ఇవి ఎక్కువగా ఒక్కరు మాత్రమే ఉపయోగించగలిగేవి. సుత్తి, కత్తి, తుపాకీ మొ.
  • వాహనాలపై ఆయుధాలు: వివిధ రకాల వాహనాలు ఈ రకమైన ఆయుధాలు ఉపయోగించడానికి సహాయపడతాయి. ఉదా: కారు, విమానం, ఓడ, టాంకరు, మొ.
  • జీవసంబంధ ఆయుధాలు: వివిధ రకాల వ్యాధికారక జీవులను ఆయుధాలుగా ఉపయోగించడం.
  • రసాయన ఆయుధాలు: వివిధ రకాల రసాయన పదార్ధాలను విషప్రయోగం లేదా జీవక్రియల ద్వారా చంపడానికి ఉపయోగించడం.
  • అణు ఆయుధాలు: రేడియో ధార్మిక పదార్ధాలను ఆయుధాలుగా ఉపయోగించడం.

ఆయుధపూజ

[మార్చు]

దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఆంధ్రుల కనకదుర్గ...తెలంగాణ ‘బతుకమ్మ’...కన్నడిగుల చాముండి... ఇలా ప్రాంతాలు వేరయినా..విశ్వవ్యాప్తంగా ఎవరు ఏ పేరున పిలచినా...కొలిచినా విజయదశమి పర్వదినాలలో దేవి తన భక్తులను అనుగ్రహించి... ఎవరైతే త్రికరణశుద్థిగా, సత్సంకల్పసిద్ధితో కార్యక్రమాన్ని తలపెడతారో వారి మనోసంకల్పాన్ని జయప్రదంచేసి అష్టైశ్వర్యములు ప్రసాదించే భాగ్యప్రధాయని. అందుకే అంబిక, దుర్గ, భవాని... ఇత్యాది ఏ పేరున పిలచినా పలికే అమ్మలగన్న అమ్మగా...ముజ్జగాలకే మూలపుటమ్మగా విరాజిల్లుతోంది. విజయానికి ప్రతీకగా..చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా సదా ఈ పర్వదినాన్ని ప్రజలంతా జరుపుకుంటారు.

మహాభారతంలో అరణ్యవాసం పూర్తిచేసుకుని అజ్ఞాతవాసం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాండవులు తమ ఆయుధాలను పరుల కంటపడకుండా శ్రీకృష్ణుని సలహా మేరకు జమ్మి చెట్టు మీద భద్రపరిచారు. అజ్ఞాతవాస ముగింపులో విజయ దశమి నాడు పాడవ మధ్యముడు విజయుడు ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీయుజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన వస్తువులకు కృతజ్ఞతా పూర్వకముగా పూజలు చేసి తమ జీవితం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధపూజ. విద్యార్థులు పాఠ్య పుస్తకాలను, ఇతరులు తమ వృత్తికి సంబంధించిన పుస్తకాలను పూలలో పెట్టడం ఆనవాయితీ. ఈ రోజు నూతనంగా విద్యార్థులు పాఠశాలలో ప్రవేశింప చేయడం, అక్షరాభ్యాసం చేయడం ఆచారాలలో ఒకటి. వ్యాపారులు కొత్త లెక్కలు ఈ రోజు నుండి ప్రారంభించడం కొన్ని ప్రదేశాలలో ఆచారం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Oxford English Dictionary. Second Edition 1989
  2. Merriam-Webster's Online Dictionary

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆయుధం&oldid=3889688" నుండి వెలికితీశారు