చాముండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాముండి
Camunda5.JPG
దేవనాగరి: चामुण्डा
తెలుగు: చాముండేశ్వరి
Affiliation: శక్తి దేవి
నివాసం: శ్మశానం
మంత్రం: Om aim hrim klim Chamundayai vichche
ఆయుధం: త్రిశూలం, ఖడ్గం
వాహనం: గుడ్లగూబ లేదా శవం

చాముండి, చాముండ లేదా చాముండేశ్వరి (Chamunda (సంస్కృతం: चामुण्डा, Cāmuṇḍā), also known as Chamundi, Chamundeshwari and Charchika) హిందూ దేవత దేవి యొక్క ఉగ్ర అవతారం. ఈమె సప్తమాతృకలు లో ఒకరు. ఈమె దుర్గాదేవి యొక్క సైన్యంలోని 81-మంది తాంత్రిక దేవతలలో ఒక ముఖ్యమైన యోగిని. [1] చాముండ పేరు ఆమె సంహరించిన చండ, ముండ అనే ఇద్దరు రాక్షసుల కలయికతో ఏర్పడినది. ఈమెను కాళికాదేవి కి దగ్గరగా పోలుస్తారు.[2] ఈమెను కొన్నిసార్లు పార్వతి దేవిగా కొలుస్తారు. కొంతమంది జంతుబలిని ఇచ్చి, మద్యంతో సహా రావి/మర్రి చెట్టు మూలంలో పూజిస్తారు. ఈమె ప్రాథమికంగా ఆదిమవాసుల దేవతగా ప్రాచీనకాలం నుండి భక్తుల పూజలందుకొంటున్నది. చాముండి మధ్య భారతదేశంలోని వింధ్య పర్వతాలలో నివసించే ముండ ప్రజల ఆరాధ్య దేవత.

సప్తమాతృకలు[మార్చు]

చాముండి ప్రాచీన విగ్రహం, వైఎస్ఆర్ రాష్ట్ర పురావస్తు మ్యూజియం
Chamunda, British Museum. Orissa, 8th - 9th century AD India.

సప్తమాతృకలు లేదా ఏడుగురు తల్లులు లో ఒకరుగా మహాభారతం (వన పర్వం), దేవీ పురాణం, విష్ణుధర్మోత్తర పురాణం మొదలైన హిందూ గ్రంథాలలో ప్రస్థావించబడినది. సప్తమాతృకల శిల్పాలలో ఈమెను ఎల్లోరా, ఎలిఫెంటా గుహలలో చూడవచ్చును. ఈమెను ఏడుగురికి అధిపతిగా కుడివైపు చివరగా ఉంటుంది.[3] మాతృకలలో మిగిలిన వారిని వారివారి భర్తల శక్తి స్వరూపాలుగా కొలువగా ఒక్క చాముండిని మాత్రం ప్రత్యేకంగా కొలుస్తారు.[4]

దేవీ పురాణంలో మాతృకలు రాక్షస సంహారంలో వినాయకునికి సహాయం చేసినట్లు పేర్కొన్నది.[5] మాండవ్య మహాముని పంచమాతృకలో ఒకరిగా చాముండిని పూజించాడు. వీరిని బ్రహ్మ హరిశ్చంద్రుడు పడుతున్న కష్టాలను చూచి వాటినుండి అతనిని రక్షించడానికి సృష్టించాడని చెబుతారు.[6]

దేవాలయాలు[మార్చు]

మైసూరులోని చాముండేశ్వరి దేవాలయం.
  • మధ్యప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా లో పాలంపూర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ దేవి రుద్ర చాముండగా కొలువబడుచున్నది.
  • కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో చాముండేశ్వరి కొండ మీద చాముండేశ్వరి దేవాలయం ప్రసిద్ధిచెందినది. ఇది మైసూర్ రాజ్యం వంశీకుల కులదేవతగా పూజలందుకున్నది.
  • * తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా లో జోగిపేట వైపు నుండి 5 కిలోమీటర్ల దూరంలోను, మెదక్ వైపు నుండి 30 కిలోమీటర్ల దూరంలోను చిటుకుల అనే గ్రామంలో ఉన్నది. ఇక్కడ చాముండేశ్వరి దేవిగా కొలువబడుచున్నది.

http://chamundi.org/

మూలాలు[మార్చు]

  1. Wangu p.114
  2. Wangu p.72
  3. Handelman p.118
  4. Kinsley p.241 Footnotes
  5. Pal in Singh p.1840, Chapters 111-116
  6. Pal in Singh p.1840, Chapter 116(82-86)

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=చాముండి&oldid=3338993" నుండి వెలికితీశారు