Jump to content

ఎలిఫెంటా గుహలు

వికీపీడియా నుండి

ఎలిఫెంటా గుహలు మహారాష్ట్ర లోని 'ఘరాపురి ద్వీపం' లో గలవు. దీనికా పేరు పోర్చుగీసు వారు పెట్టారు. 1987లో యునెస్కో వారు దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.

దీనిని దేశవిదేశాల యాత్రికులు సందర్శించారు. ఈ మధ్యకాలంలో యాత్రికులు వీటిపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి.[1][2] 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దీనిలో గల విగ్రహాల ముఖాకృతులను మార్చివేశారు.[3]

9వ శతాబ్దం, 13వ శతాబ్దాల మధ్యకాలంలో (810-1260) సిల్హారా రాజులు దీనిని నిర్మించారు. [ఆధారం చూపాలి] కొన్ని విగ్రహాలు రాష్ట్రకూటులు నిర్మించారు. 'త్రిమూర్తి' విగ్రహం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలను పోలివుంది. నటరాజ, సదాశివుని, అర్ధనారీశ్వరుని విగ్రహాలు రాష్ట్రకూటుల కళలకు ప్రతీక. [ఆధారం చూపాలి]

ఈ రాతిలో చెక్కబడిన మందిర సముదాయం, 60, 000 చ.అ. విస్తీర్ణం కల్గివున్నది. దీనియందు ముఖ్యమైన హాలు, 2 ప్రక్క హాళ్ళు, ప్రాంగణం, 2 ఇతర క్షేత్రములు గలవు. ఇందు సుందరమైన శిల్పాలు, శివాలయం ఉన్నాయి.[4] ఈ మందిర సముదాయం శివుని నివాసమని ప్రతీతి.

త్రిమూర్తి-సదాశివుని విగ్రహం

[మార్చు]
పెద్ద హాలు: గుహ 1

ఇందులోని ప్రముఖ విగ్రహం, సదాశివుని విగ్రహం, ఉత్తర దక్షిణ అక్ష్యంలో, 20 అడుగుల ఎత్తులో, త్రిముఖంతో కూడి, పంచముఖ శివునికి పోలి ఉంది.[5]

చరిత్ర

[మార్చు]

హిందూ లేదా బౌద్ధ రికార్డులలో ఈ ద్వీపం పురాతన చరిత్ర తెలియదు. పురావస్తు అధ్యయనాలు ఈ చిన్న ద్వీపానికి చెందిన గొప్ప సాంస్కృతిక గతానికి సాక్ష్యంగా అనేక అవశేషాలను కనుగొన్నారు. బహుశా క్రీ.పూ 2 వ శతాబ్దం నాటికి మానవ స్థిరనివాసాలు ఏర్పరచుకుని జీవించారనడానికి ఆధారాలు ఉన్నాయి.[6][7] బ్రాహ్మణులు ద్వీపానికి రాకముందు ఎలిఫెంటా ప్రాంతాన్ని మొట్టమొదట హినయాన బౌద్ధులు ఆక్రమించారు. బహుశా క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దంలో ఏడు చిన్న స్థూపాలతో బుద్ధుడికి పెద్ద స్థూపాన్ని నిర్మించి దాని చుట్టూ ఏడు చిన్న స్థూపాలతో అభివృద్ధి చేసారు.[8][9] ఈ ద్వీపంలో క్రీ.పూ. 4 వ శతాబ్దం నాటి క్షత్రపాల (పశ్చిమ సాత్రపాలు) నాణేలు కనుగొనబడ్డాయి.[10] గుప్తసామ్రాజ్యం యుగంలో ప్రాంతీయ చరిత్ర గురించి మొట్టమొదట నమోదు చేయబడింది. అయితే ఇవి ఈ గుహలను స్పష్టంగా ప్రస్తావించలేదు.[7] ఇది ఎలిఫంటా గుహలను నిర్మించిన శతాబ్దం గురించిన చారిత్రాత్మక వివాదానికి దారితీసింది. అవి 5 వ శతాబ్దం చివరి నుండి 8 వ శతాబ్దం చివరి వరకు ఉన్న మద్యకాలంలో నిర్మించబడినట్లు భావించబడింది. ఎక్కువగా దక్కను ప్రాంతంలోని ఇతర గుహ దేవాలయాల డేటింగు ఆధారంగా ఈ గుహల నిర్మాణ కాలం నిర్ణయించబడింది.[7] 7 వ శతాబ్దంలో లేదా తరువాతి కాలంలో ఈ గుహలను రాష్ట్రకూటులు నిర్మించారని వలసరాజ్యాల చరిత్రకారులు సూచించారు. ఇది ఎల్లోరా గుహలతో కొన్ని సారూప్యతలు ఉన్నట్లు భావించబడుతుంది.[7] ఈ సిద్ధాంతం తరువాత కనుగొన్న ఆధారాల ద్వారా ఖండించబడింది.[11][12]

ఎలిఫెంటా అనే పేరు రావడానికి కారణమైన ఏనుగు శిల్పం. అది ద్వీపం దక్షిణతీరంలో ఉండి ఉండవచ్చు.1864 లో దీనిని బ్రిటిషుకు తరలిస్తున్న తరుణంలో ఇది విరిగింది. ముక్కలను అతికించి దీనిని జిజమాతా ఉదయాను వద్ద తిరి స్థాపించారు

ఎలిఫెంటా అనే పేరు పెట్టిన రాతి ఏనుగు. ఇది ద్వీపం దక్షిణ ఒడ్డున ఉండేది, బ్రిటిషు వారు దీనిని 1864 లో ఇంగ్లాండుకు తరలించడానికి ప్రయత్నించారు, అది విరిగింది, తిరిగి కలపబడిన ముక్కలు ఇప్పుడు జిజామాతా ఉదయాన్ (పైన) వద్ద ఉన్నాయి.

"ఆర్కియాలజికలు సర్వే ఆఫ్ ఇండియా" యునెస్కో ఆధారంగా ఈ ప్రదేశం పురాతన కాలంలో మానవనివాసితంగా మారింది. గుహ దేవాలయాలు 5 - 6 వ శతాబ్దాల మధ్య నిర్మించబడ్డాయి.[6][7] సమకాలీన పరిశోధకులు సాధారణంగా దేవాలయాలను 6 వ శతాబ్దం ద్వితీయార్ధంలో గుప్తసామ్రాజ్యంలో కళలు విలసిల్లిన కాలం కొనసాగింపుగా ఉందని వీరు పేర్కొన్నారు.[7][12][13] ఈ గుహ దేవాలయాలను కలాచురి రాజవంశం రాజు కృష్ణరాజు చేత నిర్మితమై ఉండవచ్చని ఈ పరిశోధకులు ఆపాదించారు.[11][14] 6 వ శతాబ్దం మధ్య డేటింగు ఆధారంగా ఇది ప్రధానంగా హిందూ కలచురి రాజు నిర్మించిన శివ స్మారక చిహ్నం అని భావిస్తున్నారు. శాసనాలు, నిర్మాణ శైలి, అజంతా గుహలతో సహా ఇతర దక్కను గుహ దేవాలయాల మెరుగైన, దృఢమైన డేటింగు దండి విరచిత " దాసకుమారకారిత " ఈ సిద్ధాంతాన్ని దృఢపరుస్తున్నాయి.[12][15][16]

" చార్లెసు కాలిన్సు " ఆధారంగా పురాతన ప్రారంభ మధ్యయుగ హిందూ సాహిత్యం, అలాగే ఉపఖండంలోని ఇతర బౌద్ధ, హిందూ, జైన గుహ దేవాలయాల అధ్యయనం చేయడం ద్వారా ఎలిఫెంటా గుహల ప్రాముఖ్యత బాగా అర్థం అవుతుంది. 5 వ శతాబ్దంలో కూర్చబడిన హిందూ మతం పురాణాలు, భావనలు, ఆధ్యాత్మిక ఆలోచనల నుండి రుద్ర, తరువాత శివుడు, పురాణాలు, హిందూ మతం పశుపత శైవిజం సాహిత్యం ద్వారా చారిత్రాత్మక ఎలిఫెంటా కళాకృతి ప్రేరణ పొందింది. సా.శ. 525 నాటికి భారతదేశంలోని కళాకారులు, గుహ వాస్తుశిల్పులు విస్తృతంగా ఆమోదించిన కథలలో ఈ గుహల గురించిన అంశాలు ప్రతిబింబిస్తాయి. ఈ పురాణ గ్రంథాలు గణనీయంగా మారుతుంటాయి. తరువాత ఇతర అంశాలను చొప్పించడం ద్వారా ఇవి చాలా వక్రీకరించబడ్డాయి. అయినప్పటికీ ఎలిఫెంటా గుహా ప్యానెల్లు 6 వ శతాబ్దంలో చాలా ముఖ్యమైన కథన సంస్కరణను సూచిస్తాయి.[17][18] 1 వ సహస్రాబ్ది మధ్యలో హిందూ సంస్కృతి మీద వేదకాలం, వేదకాలం తరువాత మత ఆలోచనల ప్రభావం ప్యానెల్లు, కళాకృతులు వాటి పరిశీలనాత్మకత ద్వారా వ్యక్తమవుతాయి.[19]

6 వ శతాబ్దంలో గుహలు పూర్తయిన తరువాత, ఎలిఫాంటా ప్రాంతీయంగా ఘరపురి (గుహల గ్రామం) గా ప్రాచుర్యం పొందింది. ఈ పేరు ఇప్పటికీ స్థానిక మరాఠీ భాషలో ఉపయోగించబడింది.[20] ఇది గుజరాతు సుల్తానేటులో ఒక భాగంగా మారింది. వారు దీనిని 1534 లో పోర్చుగీసు వ్యాపారులకు అప్పగించారు. పోర్చుగీసువారు ఈ ద్వీపానికి "ఎలిఫెంటా ద్వీపం" అని పేరు పెట్టారు. భారీ రాతితో చెక్కబడిన రాతి ఏనుగు విగ్రహం వద్ద పోర్చుగీసువారు తమ పడవలను నిలపడానికి ఉపయోగించారు. ముంబైకి సమీపంలో ఉన్న ఇతర ద్వీపాల నుండి వేరు చేయడానికి ఈ ద్వీపానికి ఇది ఒక మైలురాయిగా ఉంది. ఏనుగు విగ్రహాన్ని ఇంగ్లాండుకు మార్చడానికి చేసిన ప్రయత్నాలలో అది దెబ్బతింది. 1864 లో విక్టోరియా గార్డెనుకు తరలించబడింది. 1914 లో కాడెలు, హ్యూవెటు చేత తిరిగి తీసుకుని వచ్చి ముంబైలోని జిజామాతా ఉదయానులో భద్రపరాబడింది.[21][22][23]

19 వ శతాబ్ధం ఎలిఫెంటా గుహల చాయాచిత్రం.[24]

ఎలిఫెంటా గుహలను ఎక్కువగా నిర్వీర్యం చేసిన వారి విషయంలో పరిశీలకులి విభేదిస్తున్నారు.. మాక్నీలు అభిప్రాయం ఆధారంగా సుల్తానేటు పాలనలో స్మారక చిహ్నాలు, గుహలు అపవిత్రం అయ్యాయి. గ్రాండు కేవు ద్వారం మీద ఉన్న పర్షియా శాసనం మీద పరిశోధనలు దీనిని దృఢపరుస్తున్నాయి.[20] దీనికి విరుద్ధంగా పోర్చుగీసు వారి గ్రంథాల ఆధారంగా పోర్చుగీసు క్రైస్తవ సైనికులు కాల్పుల శిక్షణలో లక్ష్య సాధనగా చేసుకున్నందున అధిక నష్టం సంభవించిందని ఓవింగ్టను, పైకు వంటి ఇతరులు భావిస్తున్నారు.[20][25][26] వలసరాజ్యాల కాలంలో ఎలిఫెంటా గుహలు దెబ్బతిని లోపభూయిష్టంగా మారాయని మాక్నీలు అంగీకరించాడు ఇది సంభవించడానికి సైనికులను కాకుండా పోర్చుగీసు అధికారులకు ఆపాదించాలని ఆయన అభిప్రాయపడ్డాడు.[20] వలసరాజ్యాల యుగం బ్రిటిషు ప్రచురణలు వారు " మహమ్మదీయుల పట్టుదల, పోర్చుగీసుల ఉత్సాహం ఈ విధ్వంశానికి కారకులని " అని పేర్కొంది.[21] మూడవ సిద్ధాంతం ప్రకారం ముస్లిం పాలకులు లేదా పోర్చుగీసు క్రైస్తవులు ఈ స్థలాన్ని దెబ్బతీశారు. ఎందుకంటే వారు ఇద్దరూ కళాకృతులు, గుహలను ప్లాస్టరు చేశారు. 17 వ శతాబ్దంలో కళాకృతికి మరాఠాలు ఈ ప్లాస్టరును తొలగించడానికి ప్రయత్నించచిన తరువాత వెండి డోనిగరు పేర్కొన్న ఈ సిద్ధాంతం "బహుశా నిజం" అని భావిస్తున్నారు.[20]

1661 లో పోర్చుగీసువారు ఈ ద్వీపాన్ని వలసరాజ్యాల బ్రిటిషు వారికి అప్పగించారు. కాని అప్పటికి గుహలు గణనీయమైన నష్టాన్ని చూశాయి. పోర్చుగీసువారు గుహల నుండి ఒక శాసనం రాయిని తొలగించి పోయారు.[27][28] బ్రిటీషు పాలనలో, చాలామంది ఐరోపియన్లు బొంబాయి సందర్శనలో భాగంగా గుహలను సందర్శించారు. తరువాత వారి జ్ఞాపకాలను ప్రచురించారు. కొందరు దీనిలో "అందం లేదా కళ ఏమీ లేదని" విమర్శించారు. మరికొందరు దీనిని "అపారమైన కళాకృతులు, అసాధారణ మేధాతత్వం కలిగి ఉన్నాయని" అని పేర్కొన్నారు.[26] బ్రిటిషు వారు నౌకాశ్రయ నగరం అయిన బొంబాయి (ఇప్పుడు ముంబై) మిద ఆధారపడ్డారు. తరువాత ఇది ఒక ప్రధాన పట్టణ కేంద్రంగా మారింది. ఆర్థిక అవకాశాల కోసం అన్వేషిస్తున్న హిందువుల వలసలకు ఇది దారితీసింది. ఎలిఫెంటా గుహలు హిందూ ఆరాధన కేంద్రంగా తిరిగి ఉద్భవించాయి. బ్రిటిషు పరిపాలన రికార్డుల ఆధారంగా ప్రభుత్వం 1872 నుండి యాత్రికులకు ఆలయ పన్ను వసూలు చేసింది. 1903 లో హిందువులు హిందువుల శివ ఆధారిత 3 పండుగ రోజులలో ఈ రుసుమును మాఫీ చేయాలని బ్రిటిషు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. బ్రిటిషు ప్రభుత్వం దీనిని అంగీకరించింది. పన్నును రద్దు చేసారు. ఏలిఫెంటా గుహలు విధ్వశకర స్థితిలో మిగిలిపోయాయి.[29]

1970 ల చివరలో భారత ప్రభుత్వం ప్రధాన గుహను పర్యాటక వారసత్వ ప్రదేశంగా మార్చే ప్రయత్నంలో పునరుద్ధరించింది. ఈ గుహలను యునెస్కో సాంస్కృతిక ప్రమాణాల ప్రకారం 1987 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నియమించారు: గుహలు "మానవ సృజనాత్మక మేధతత్వ ఉత్తమ రూపకల్పనను సూచిస్తాయి". "సాంస్కృతిక సంప్రదాయానికి, నాగరికతకు ప్రత్యేకంగా అసాధారణమైన సాక్ష్యాలను కలిగి ఉన్నాయి. ఇక్కడ మానవ నివాసాలు కనుమరుగైయ్యయి ".[6]

మూలాలు

[మార్చు]
  1. "Save the Caves". south-asian.com. Archived from the original on 2006-11-11. Retrieved 2006-10-14.
  2. "Elephanta Caves". Bolography. Archived from the original on 2007-01-08. Retrieved 2006-10-14.
  3. HT Cafe, Mumbai, Monday, June,4,2007 pg.31 - Article 'Lord of the Islands" by Jerry Pinto
  4. "Elephanta Caves". Mumbai Net. Archived from the original on 2005-08-10. Retrieved 2006-10-14.
  5. Duffer's Guide to Elephanta, Mid-Day, Tinaz Nooshan, Feb 22, 2007, pg A14
  6. 6.0 6.1 6.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; unesco అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; historic_places అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. "Long before the Brahmans selected Elephanta for their temple to the Great God, the Hinayana Buddhists came to the island for more or less the same purpose, to raise a monument to the Buddha. To the early Buddhists a stupa was an object of supreme veneration..." in Kail, Owen C. (1984). Elephanta, the island of mystery (in ఇంగ్లీష్). Taraporevala. p. 19.
  9. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; archive.org అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  10. Archeological Survey of India on-site notice
  11. 11.0 11.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; berkson3 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  12. 12.0 12.1 12.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Spink2005p182 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  13. George Michell (2015). Elephanta. Jaico. pp. 1–4, 30–33, 96–98. ISBN 978-8-184-95603-0.
  14. Stella Kramrisch (1988). The Presence of Siva. Motilal Banarsidass. pp. 443–445. ISBN 978-81-208-0491-3.
  15. Carmel Berkson; Wendy Doniger; George Michell (1999). Elephanta: The Cave of Shiva. Princeton University Press (Motilal Banarsidass, Reprint). pp. 3–6, 47–48. ISBN 978-81-208-1284-0.
  16. Sara L. Schastok (1985). The Śāmalājī Sculptures and 6th Century Art in Western India. BRILL Academic. pp. 43–44. ISBN 90-04-06941-0.
  17. Charles Dillard Collins (1988). The Iconography and Ritual of Siva at Elephanta: On Life, Illumination, and Being. State University of New York Press. pp. 31–39. ISBN 978-0-88706-773-0.
  18. Collins, Charles D. (1982). "Elephanta and the Ritual of the Lakulīśa-Pāśupatas". Journal of the American Oriental Society. 102 (4). American Oriental Society: 605–609. doi:10.2307/601969. JSTOR 601969.
  19. Carmel Berkson; Wendy Doniger; George Michell (1999). Elephanta: The Cave of Shiva. Princeton University Press (Motilal Banarsidass, Reprint). pp. 38–39. ISBN 978-81-208-1284-0.
  20. 20.0 20.1 20.2 20.3 20.4 Carmel Berkson; Wendy Doniger; George Michell (1999). Elephanta: The Cave of Shiva. Princeton University Press (Motilal Banarsidass, Reprint). pp. 41–45. ISBN 978-81-208-1284-0.
  21. 21.0 21.1 Chisholm, Hugh, ed. (1911). "Elephanta Isle" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 9 (11th ed.). Cambridge University Press. p. 261.
  22. Trudy Ring; Robert M. Salkin; Sharon La Boda. "Elephanta Island". International Dictionary of Historic Places: Asia and Oceania. Taylor & Francis. pp. 252–5. ISBN 978-1-884964-04-6.
  23. Sir William Foster; Sir Evan Cotton; L.M. Anstey (2017). Bombay in the Days of Queen Anne. Taylor & Francis. pp. 86, 157, note 3. ISBN 978-1-317-17337-3.
  24. Digital Image Archive: Leiden University Archived 2017-11-07 at the Wayback Machine, The Netherlands
  25. James Campbell (1882). Gazetteer of the Bombay Presidency. Government Central Press. pp. 84–85.
  26. 26.0 26.1 N. S. Ramaswami (1971). Indian Monuments. Abhinav. pp. 42–54. ISBN 978-0-89684-091-1.
  27. Collins, Charles D. (1982). "Elephanta and the Ritual of the Lakulīśa-Pāśupatas". Journal of the American Oriental Society. 102 (4). American Oriental Society: 605–617. doi:10.2307/601969. JSTOR 601969.
  28. Benoy K. Behl. "Simply grand". Frontline. 24 (23). the publishers of The Hindu. Archived from the original on 16 February 2010. Retrieved 16 February 2010.
  29. Preeti Chopra (2011). A Joint Enterprise: Indian Elites and the Making of British Bombay. University of Minnesota Press. pp. 200–201. ISBN 978-0-8166-7036-9.
ప్రవేశం

బయటి లింకులు

[మార్చు]
గుహ బయట