చంపానేర్-పావగఢ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పావగఢ్ కొండపైకి వెళ్ళడానికి వీలు కల్పించే రోప్‌వే సౌకర్యం
చంపానేర్-పావగఢ్ ప్రాంతంలోని ఒక పురాతనమైన కోట శిథిలం
పావగఢ్ ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడినట్లు తెలియజేస్తున్న ఫలకం
రోప్‌వే పైనుంచి వెళ్తున్నప్పుడు కన్పించే సుందర ప్రకృతి దృశ్యాలు

భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన చంపానేర్-పావగఢ్ ప్రదేశాలు గుజరాత్ రాష్ట్రంలోని పంచ్‌మహల్ జిల్లాలో హలోల్ వద్ద ఉన్నాయి. 2004లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం సంపాదించిన ఈ అపురూపమైన చారిత్రక ప్రదేశాలలో ఎత్తయిన పావగఢ్ కొండపై ఉన్న కాళికామాత దేవాలయం ప్రసిద్ధమైనది. ఈ ప్రాంతంలోనే ఎత్తయిన కొండపై ఉన్న కోట క్రీ.శ.16వ శతాబ్దంలో గుజరాత్‌కు రాజధానిగా విలసిల్లింది. ఈ పరిసర ప్రాంతంలోనే క్రీ.శ.8వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు నాటి ఎన్నో కోటలు, రాజప్రసాదాలు, పురాతన కట్టడాలు, మతపరమైన కట్టడాలు మన్నగినవి నేటికీ చూడవచ్చు.

చంపానేర్-పావగఢ్ చరిత్ర[మూలపాఠ్యాన్ని సవరించు]

వనరాజ్ చావడ రాజు తన భార్య చంపా పేరిట పావగఢ్ కొండ దిగువ ప్రాంతంలో చంపానేర్‌ను స్థాపించాడు. ఆ తరువాత పటాయి రావల్ కుటుంబం ఈ ప్రాంతాన్ని పాలించింది. నవరాత్రి ఉత్సవ సమయంలో కాళికామాత నృత్యం చేస్తుండగా చివరి పటాయి రాజు జైసింహ్ చెడుచూపుల వల్ల దేవత శాపానికి గురైనట్లు, తత్ఫలితంగా గుజరాత్ చక్రవర్తి ముహమ్మద్ బెగ్డా పావగఢ్‌ను ఆక్రమించినట్లు కథ ప్రచారంలో ఉంది. పటాయి రాజు ముహమ్మద్ బెగ్డా చేతిలో ఓడి చంపబడినాడు. ఆ తరువాత కొద్దికాలానికి బెగ్డా తన రాజధానిని దౌత్యకారణాల వల్ల అహ్మదాబాదు నుంచి చంపానేర్‌కు మార్పుచేశాడు. రాజధానిని చంపానేర్‌కు మార్చిన తరువాత బెగ్డా ఈ ప్రాంతంలో పలు కట్టడాలను నిర్మించాడు. అందులో ముఖ్యమైనవి చంపానేర్ కోట, ఓరా మసీదు, మాండవి, కీర్తిస్తంభము, షాల్క్ దేవాలయం, జామా మసీదు, నగీనా మసీదు, కేవ్డా మసీదు మున్నగునవి.

కాళికామాత దేవాలయం[మూలపాఠ్యాన్ని సవరించు]

చంపాగఢ్-పావనేర్ ప్రాంతంలో అతిముఖ్యమైన పర్యాటక ప్రదేశం కాళికామాత దేవాలయం. 550 మీట్లర్ల (1523 అడుగులు) ఎత్తయిన కొండపై ఉన్న ఈ దేవాలయ సందర్శనకై దూరప్రాంతాల నుంచి ఏడాది పొడవునా పర్యాటకులు వస్తుంటారు. కొండపై వెళ్ళడానికి రోప్‌వే సౌకర్యం ఉండటం మరొక ఆకర్షణ. రోప్‌వే దిగిన తరువాత మళ్ళీ 250 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. వాహనాలు వెళ్ళు గుట్తపై ఉన్న పీఠభూమి ప్రాంతాన్ని మాచి ప్రాంతంగా పిలుస్తారు.[1]

రోప్‌వే ప్రమాదం[మూలపాఠ్యాన్ని సవరించు]

2003, జనవరి 19 ఆదివారము నాడు పావగఢ్ కొండపైకి యాత్రికులను తీసుకొని వెళుతున్న రోప్‌వే రెండు వాహనాలు నేలపై పడి 9 యాత్రికులు మృతిచెందగా మరో 45 మంది గాయపడ్డారు.[2][3]

చంపానేర్-పావగఢ్ - కొన్ని విశిష్టతలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • ప్రముఖ సంగీత విద్వాంసుడు బైజూ బవ్రా పావగఢ్ ప్రాంతానికి చెందినవాడు.[4]
  • చంపానేర్-పావగఢ్ ప్రాంతం అహ్మదాబాదు నుంచి 190కిలోమీటర్లు, వదోదర నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • చంపానేర్ ప్రాంతం పచ్‌మహల్ జిల్లా ముఖద్వారంగా పరిగణించబడుతుంది.

బయటి లింకులు[మూలపాఠ్యాన్ని సవరించు]

మూలాలు[మూలపాఠ్యాన్ని సవరించు]