Jump to content

ఛత్రపతి శివాజీ టెర్మినస్

వికీపీడియా నుండి

ఛత్రపతి శివాజీ టెర్మినస్ Chhatrapati Shivaji Terminus (మరాఠీ: छत्रपती शिवाजी टर्मिनस), క్రితం పేరు విక్టోరియా టెర్మినస్, సాధారణంగా దీని సంక్షిప్త నామం 'సి.ఎస్.టీ' లేదా 'బాంబే వీ.టీ. (CST or Bombay VT). ఇది కేంద్ర రైల్వేకు ప్రధాన కేంద్రంగా సేవలందిస్తుంది. భారతదేశంలోని రద్దీగల రైల్వేస్టేషన్లలో ఒకటి. ఇది కేంద్ర రైల్వే కేంద్రంగానే గాక 'ముంబై సబర్బన్ రైల్వే' కేంద్రంగానూ సేవలందిస్తోంది.

చరిత్ర

[మార్చు]

1887-1888లో కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్ అయిన "ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్", దీని డిజైన్ రూపొందించి, 16.14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించాడు. 10 సంవత్సరాల కాలంలో నిర్మించి విక్టోరియా రాణి గౌరవార్థం దీనికి "విక్టోరియా టెర్మినస్" అనే పేరు పెట్టాడు.

1996 లో, శివసేన డిమాండ్ పై దీనికి "ఛత్రపతి శివాజీ" పేరును నిశ్చయించారు. జూలై 2, 2004 న ఈ స్టేషనుకు యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేశారు.

నిర్మాణాకృతి

[మార్చు]

ఈ నిర్మాణం 'విక్టోరియన్ గోథిక్' లేదా 'వెనీషియన్ గోథిక్' శైలిలో నిర్మింపబడింది. 19 వ శతాబ్దపు నిర్మాణాలకు ఆదర్శంth

సబర్బన్ నెట్ వర్క్

[మార్చు]

సబర్బన్ రైళ్ళు, (ప్రాదేశికంగా వీటిని 'లోకల్స్' అని సంబోధిస్తారు) ముంబై నగరాన్నీ, ముంబై వాసులనూ పరిగెత్తేలా చేస్తాయి. ఈ రైళ్ళు 'సెంట్రల్ లైన్' , 'హార్బర్ లైన్' లో నడుస్తాయి. లోకల్ రైళ్ళు కర్జత్, కసారా, పన్వేల్, ఖోపోలీ, చర్చిగేట్ , దహానూ ల వరకూ ప్రయాణిస్తాయి.

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]