వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
ప్రదేశం | ఉత్తరాఖండ్ |
సమీప నగరం | చమోలి |
విస్తీర్ణం | 87.50 చ. కి.మీ. |
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర చంపోలి అనే ప్రాంతంలో ఉంది.[1] ఈ ఉద్యానవనాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
చరిత్ర
[మార్చు]1931 లో ఫ్రాంక్ ఎస్. స్మిత్, ఎరిక్ షిప్టన్, ఆర్.ఎల్. హోల్డ్‌స్వర్త్ అనే బ్రిటిష్ పర్వతారోహకులు కామెట్ అనే పర్వతాన్ని అధిరోహించి తిరిగి వచ్చేటప్పుడు దారి తప్పిపోయి పువ్వులతో నిండిన ఒక లోయ ప్రాంతాన్ని చూసి ఆకర్షితులై ఆ లోయ ప్రాంతానికి "పువ్వుల లోయ" అని పేరు పెట్టారు. ఈ ఉద్యానవనం పేరుతో ఫ్రాంక్ స్మిత్ ఒక పుస్తకాన్ని రచించాడు. 1939 లో ఒక వృక్షశాస్త్రజ్ఞుడు జోన్ మార్గరెట్ లెగ్గే ఈ ప్రాంతంలో ఉన్న పువ్వులపై అధ్యయనం చేయడానికి లోయ వద్దకు వచ్చినప్పుడు పువ్వులు సేకరించడానికి వెళ్ళినపుడు ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయింది. ఆమె మరణతరం తన సోదరి ఈ లోయను సందర్శించి తన సోదరి స్మారకర్దాన్ని నిర్మించింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేత నియమించబడిన వృక్షశాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ చంద్ర ప్రకాష్ కాలా 1993 నుండి ఒక దశాబ్దం పాటు లోయ యొక్క పూల, పరిరక్షణపై అధ్యయనం చేశాడు. ఈ ఉద్యానవనంలో పెరుగుతున్న 520 ఆల్పైన్ మొక్కల జాబితాను తయారు చేశాడు. అదేకాక ఈ ఉద్యనవనంపై అధ్యయనం గురించి "ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ - మిత్ అండ్ రియాలిటీ", "ఎకాలజీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ పేర్లతో రెండు పుస్తకాలను రచించాడు.[2]
-
పువ్వుల లోయ; ఎడమ చేతి ముందు లోయ.
-
లోయ ప్రవాహాలలో ఒకటి.
-
హిమాలయ లోయలో పువ్వులు, కాంపనులా లాటిఫోలియా
-
జెరానియం అనే గులాబీ పువ్వుపై ఉదయం మంచు
-
లోయలో పువ్వులు, మోరినా లాంగిఫోలియా.
పువ్వుల వివరాలు
[మార్చు]ఈ ఉద్యానవనాన్ని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం స్థాపించబడింది.[3] దీని ప్రవేశద్వారం వద్ద ఉన్న అరుదైన మొక్కలను, ఔషధ మొక్కలను, మూలికలను పరిశోధన చేయడానికి ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పరిచారు. 1993 నుంచి ఈ ఉద్యానవనంలో ఉన్న పువ్వుల గురించి ప్రొఫెసర్ సి. పి. కాలా అధ్యయనం చేసి ఇక్కడ 520 జాతుల ఎత్తైన మొక్కలు ఉన్నాయని వీటిలో 498 పుష్పించే మొక్కలని తేల్చిచెప్పాడు. ఈ ఉద్యానవనంలో డాక్టిలోర్హిజా హటాగిరియా, పిక్రోహిజా కుర్రూవా, పాలిగోనాటం మల్టీఫ్లోరం, ఫ్రిటిల్లారియా రోయిలీ, పోడోఫిలమ్ హెక్సాండ్రం వంటి అనేక రకాల ఔషద మొక్కలు ఉన్నాయి.[4]
మరిన్ని విశేషాలు
[మార్చు]1862 : పుష్పవతి లోయను కల్నల్ ఎడ్మండ్ స్మిత్ కనుగొన్నాడు.
1931 : అధిరోహకుడు ఫ్రాంక్ ఎస్. స్మిత్ సందర్శించిన లోయ "పువ్వుల లోయ" ను ప్రచారం చేస్తూ ఒక పుస్తకం రాసారు.
1936 : పర్వతారోహకులు బిల్ టిల్మాన్ & నోయెల్ ఓడెల్ నందా దేవి అనే పర్వతాన్ని అధిరోహించారు.
1939 : నందా దేవి గేమ్ అభయారణ్యంగా ప్రకటించారు.
1974-82 : ఈ ఉద్యానవనం పర్వతారోహణకు అనుమతినివ్వబడింది. కాని తరువాత కాలంలో పర్వత రోహకుల నుంచి స్పందన కరువడంతో ఈ పర్వతరోహణను మూసివేశారు.
1980: ఈ పార్కును సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ గా స్థాపించారు.
1980 : 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం యొక్క నిబంధనల ప్రకారం లోయలో ఉన్న పువ్వుల పరిరక్షణకు ఈ వనాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు.
1982 : ఈ ఉద్యనవనాన్ని నందా దేవి న జాతీయ ఉద్యనవనంగా గా పేరు మార్చారు.
2000 : ఈ ఉద్యనవనాన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యనవనంగా పేరు మార్చారు.
2004 : రెండు కోర్ జోన్లు, బఫర్ జోన్ యునెస్కో మాబ్ రిజర్వ్‌గా గుర్తింపునించింది.
మూలాలు
[మార్చు]- ↑ N. Ulysses and Tabish, Thingnam Girija. "Trek to Valley of Flowers". Flowers of India. Archived from the original on 27 సెప్టెంబరు 2019. Retrieved 29 September 2019.
- ↑ Chandra Prakash Kala. "How Valley of Flowers got World Heritage Site tag". Down to Earth. Archived from the original on 22 సెప్టెంబరు 2013. Retrieved 30 September 2019.
- ↑ Kala, C.P. (2005). "The Valley of Flowers; A newly declared World Heritage Site" (PDF). Current Science. 89 (6): 919–920. Archived from the original (PDF) on 2018-10-17. Retrieved 2019-09-30.
- ↑ Kala, C.P. 2004. The Valley of Flowers; Myth and Reality. International Book Distributors, Dehradun, India