మరాఠీ భాష

వికీపీడియా నుండి
(మరాఠీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మరాఠీ
मराठी Marāṭhī 
మరాఠీ దేవనాగరి and Modi: మరాఠీ దేవనాగరి మరియు మోడి రాతలో వ్రాయుదురు. 
ఉచ్ఛారణ: /mə.'ɾa.ʈʰi/
మాట్లాడే దేశాలు: భారతదేశం మరియు మారిషస్[1]

మరాఠీ మాట్లాడు దేశములు అ.సం.రా, యు.అ.ఎ, దక్షిణ ఆఫ్రికా, ఇజ్రాయిల్, పాకిస్తాన్ సింగపూర్, జర్మనీ, యు.కె, ఆస్ట్రేలియా & న్యూజిలండ్[2] 

ప్రాంతం: మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, సింద్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, దాద్రా నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యూ
మాట్లాడేవారి సంఖ్య: మొత్తం 90 మిలియన్ మంది[3]
70 మిలియన్ మాతృభాషగా, 20 మిలియన్ రెండొ భాషగా మాట్లాడెదరు. 
ర్యాంకు: 15[4] (మాతృ)
15[3] (మొత్తం)
భాషా కుటుంబము:
 ఇండో-ఇరానియన్
  ఇండో-ఆర్యన్
   దక్షిణ ఇండో-ఆర్యన్
    మరాఠీ 
వ్రాసే పద్ధతి: దేవనాగరి, మోడి (సాంప్రదాయక) 
అధికారిక స్థాయి
అధికార భాష: రాష్ట్రాలు మహారాష్ట్ర, గోవా, కేంద్రపాలిత ప్రాంతములు డామన్ మరియు డయ్యూ మరియు దాద్రా నగర్ హవేలి భారతదేశం
నియంత్రణ: మహారాష్ట్ర సాహిత్య పరిషత్తు
భాషా సంజ్ఞలు
ISO 639-1: mr
ISO 639-2: mar
ISO 639-3: mar 
Marathispeak.png
.
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...

మరాఠీ (मराठी Marāṭhī) ఒక ఇండో-ఆర్యన్ భాష, దీనిని పశ్చిమ భారతదేశంలోని మరాఠీ ప్రజలు ఉపయోగిస్తారు. ఇది మహారాష్ట్ర యొక్క అధికార భాష. ప్రపంచంలో దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఈ భాష మాట్లాడుతారు. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో నాలుగవ స్థానంలో ఉంది.[5] మరియు ప్రపంచంలో 15వ భాష.[4]. బెంగాలీ భాషతో బాటు మరాఠీ భాష కూడా ఇండో-ఆర్యన్ భాషలలో ప్రాచీన ప్రాంతీయ భాష. ఇది క్రీ.శ్. 1000 నుండి మాట్లాడబడుచున్నది.[6] మరాఠీ 1300 సంవత్సరాల వయస్సు గలది, [7] మరియు సంస్కృతం నుండి "ప్రాకృతం" మరియు అపభ్రంశ ద్వారా ఆవిర్భవించింది. దీని గ్రామరు పాళీ భాష నుండి గ్రహించబడింది. ప్రాచీనకాలంలో మరాఠీ భాషను "మహారాష్ట్రి" అని "మర్హటీ" అని "మహ్రాట్టి" అని పిలిచెడివారు.

మరాఠీ వినియోగంకోసం హైకోర్టు[మార్చు]

ముంబై హైకోర్టు కోర్టుకు సంబంధించిన పత్రాలు, పిటిషన్ల డాక్యుమెంట్లను మరాఠీలోకి అనువదించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేసింది. మరో పక్క న్యాయవ్యవస్థలోని కింది స్థాయి సిబ్బంది నియామకం కోసం మరాఠీ మాధ్యమంలో పరీక్షలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోంది. ఎంపీఎస్సీ నిర్వహించే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ పరీక్షల్లో మరాఠీని ప్రత్యామ్నాయ భాషగా గుర్తించాలని థానేకు చెందిన 'మరాఠీ భాషా వికాస్ ఆని సంరక్షణ సంస్థ' ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రస్తుతం ఆ పరీక్షను ఆంగ్లంలో రాయాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఆంగ్లంతో పాటుగా మరాఠీపై ఉన్న పరిజ్ఞానాన్నీ తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ పరీక్షాపత్రం ఉండాలని ఆ పిటిషన్‌లో సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.'పశ్చిబెంగాల్, హర్యానా, రాజస్థాన్, ఒడిషా రాష్ట్రాల్లో స్థానిక భాషల్ని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరీక్షల్లో వినియోగిస్తున్నారు. కోర్టుల్లో రాష్ట్ర భాషల్ని ఉపయోగించుకునే వెసులుబాటును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణలు కల్పించాయి. కిందిస్థాయి కోర్టుల్లో కనీసం 50 శాతం తీర్పులు మరాఠీలోనే ఉండాలని హైకోర్టు 2005లోనే అభిప్రాయపడింది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మరాఠీ_భాష&oldid=2000875" నుండి వెలికితీశారు