అజంతా గుహలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అజంతా గుహలు

మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్దమత కళకు చెందినవి. [1] మరియు 'విశ్వజనీయ చిత్రకళలు'.[2] . ఔరంగాబాద్ జిల్లా లోని మహారాష్ట్రలో నెలకొని ఉన్న అజంతా గుహలు మనకు వారసత్వంగా అందిన అపురూపమైన చారిత్రక సంపద. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దం నాటివని చెబుతారు. ఇక్కడ కనబడుతున్న చిత్రకళలో ఎక్కువ భాగం బౌద్ధ మతానికి చెందినవి. గుహల లోపల అద్భుతమైన నిర్మాణ సౌందర్యం కనబడుతుంది. అజంతా గ్రామము బైట ఉన్న ఈ గుహలు 1983 నుండి యునెస్కో (UNESCO) వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా పరిగణించబడుతున్నాయి. ఔరంగాబాద్‌ జిల్లాలోని అజంతా గ్రామానికి వెలుపల ఈ గుహలు ఉన్నాయి. దట్టమైన అడవుల మధ్య గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండపై ఇవి నెలకొని ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాల మీద ఇవి పడమర నుండి తూర్పునకు వ్యాపించి ఉన్నాయి.

ఉన్న ప్రదేశం[మార్చు]

మొదటి గుహ

అజంతా గ్రామానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులతో కూడిన, గుర్రపునాడా ఆకృతిలో ఉన్న కొండ నెట్రముపై ఇవి నెలకొని ఉన్నాయి. ఈ ప్రదేశం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా పరిధిలోనికి వస్తుంది. ఇది ఔరంగాబాద్ పట్టణానికి సుమారు 106 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి దగ్గరగా ఉన్న పట్టణాలు జలగావ్ (60 కి.మీ), మరియు భుసావల్ (70 కి.మీ). దీనికి దిగువన కొండల మధ్య నుంచి ఉద్భవించే వాఘర్ నది ప్రవహిస్తుంది. భారతీయ పురాతత్వ శాఖ అధికారికంగా 29 గుహలను కనుగొన్నట్లు ప్రకటించింది. ఇవి కొండకు దక్షిణంగా క్రింది భాగం నుంచి 35 నుంచి 115 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ సన్యాసాశ్రమ సముదాయంలో చాలా విహారాలు, చైత్య గృహాలు కొండలోకి తొలచబడి ఉన్నాయి.

శిల్పకళ[మార్చు]

గుహలను బుద్ధిజానికి సంబంధించిన [శిల్పకళ]ను దాచుకున్న కళా నిలయాలుగా వర్ణించవచ్చు. కొన్ని శిల్పాలు తెరవాడ సంప్రదాయంలో కిరీటం, పాదముద్రలు మాత్రమే ఉంటాయి. మరికొన్ని మహాయాన సంప్రదాయంలో శిల్పాలుగా గోడల్లో తీర్చిదిద్దిన మురల్స్‌ రూపంలో ఉన్నాయి. ఈ చిత్రాల్లో బుద్ధుడు, ఇతర బోధిసత్వుల జీవితాలు, జాతక కథలు చిత్రించారు. రెండో గుహలో బుద్ధుని పుట్టుకకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి. దీని పైకప్పుపై ఉన్న హంసలు బారులు తీరిన చిత్రం ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆనాటి ప్రజలు వాడిన పర్సులు, మఫ్లర్లు, చెప్పులను సైతం చిత్రాల్లో చూడవచ్చు. క్రీ.పూ. 2-7 శతాబ్దాల మధ్యకాలంలో వీటిని చిత్రించినట్టుగా ఆధారాలున్నాయి. ఆనాడు వేసిన రంగులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం చూపరులకు ఆశ్చర్యచకితులను చేస్తుంది.

మొదటి గుహ[మార్చు]

మొదటి గుహ అంటే ఇది మొదటగా గుర్తించబడిన గుహ. కానీ రెండు గుహల్లో ఏది మొదట నిర్మించారన్న దానికి శాసనా పరమైన ఆధారాలేమీ లేవు. గుర్రపు నాడా ఆకారంలో ఉన్న పర్వత నెట్రముపై ఇది నెలకొని ఉంది.

రెండవ గుహ[మార్చు]

ఇది మొదటి గుహను ఆనుకునే ఉంటుంది.

ajanta గుహలు[మార్చు]

 • మొదటి గుహ- ఇది అజంతా గుహల్లో అత్యంత ప్రాచుర్యం పొందినది. గుహలోని ప్రతి అంగుళానికి రంగులు వేసి ఉంటుంది. కాలగతిలో ఈ రంగులు కాస్త చెదిరినట్టుగా తెలుస్తుంది. ప్రధాన ద్వారానికి రెండువైపులా గోడకు చెక్కిన వజ్రపాణి, పద్మపాణిల చిత్రాలుంటాయి.
 • 2వ గుహ- ఇందులో సర్పరాజులు, వారి పరివారం కనబడుతుంటారు. పైకప్పులో పూలు, పళ్లు, పక్షులు మరికొన్ని అర్థరహితమైన డిజైన్లు ఉన్నాయి. ఒక చీరపైన వేసిన డిజైన్లలా అనిపిస్తాయి.
 • 4వ గుహ- ఇది సంపూర్ణంగా కనిపించదు. కానీ అజంతా బౌద్ధ ఆరామాల్లో ఇది అతి పెద్దది.
 • 9వ గుహ-ఇది కూడా తొలి ప్రార్థనా స్థలాల్లో ఒకటి. దీని కిటికీలు ఆర్చీలుగా అందంగా కనబడుతుంటాయి. వీటినుండి సూర్యుని వెలుతురు లోపల పడుతుంటుంది. ఇందులో అతి పెద్ద బౌద్ధ స్తూపం ఉంది.
 • 10వ గుహ- ఇది తెరవాడ ప్రార్థనా హాలు. అజంతాలోని అతి పురాతన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటిది.
 • 15, 13, 12,8 గుహలు తెరవాడ సంప్రదాయ మఠాలు
 • 16వ గుహ- ఇది కూడా ఒక బౌద్ధ మఠం. దీనిలో స్పృహ కోల్పోయిన రాకుమారి సుందరి చిత్రాలుంటాయి. బుద్దుని సోదరుడు నందుడు సన్యాసిగా మారినట్టు తెలుసుకుని ఆయన భార్య స్పృహ కోల్పోయిన దృశ్యాలవి.
 • 17వ గుహ- గోడలు, పైకప్పు చిత్రకళతో నిండి ఉన్న బౌద్ధ ఆరామం ఇది. దివ్యకన్యలు, గాన గంధర్వులు పైకప్పుమీద కనబడుతుంటారు. గోడలు, తలుపులకు బౌద్ధ గురువులు, దేవతలు, పద్మం రేకుల చిత్రణ ఉంటుంది.
 • 26వ గుహ- ఇందులో మహాయాన ప్రార్థనా మందిరము ఉంది. బుద్దుని నిర్యాణాన్ని తెలిపే బౌద్ధ విగ్రహం విశ్రాంతిగా పడుకుని ఉన్నట్టుగా కనబడుతుంది. ఆయన అనుచరులు దు:ఖించడం, పైన దేవతలు ఆనందంగా స్వాగతాలు పలకటం కూడా చిత్రించి ఉంది.

మహాయాన బుద్ధిజంలో వీరిరువురు అత్యంత ముఖ్యమైన బోధిసత్వులు. మొదటి గుహలోని మొదటి గది గోడలపై బుద్ధుని జీవితానికి సంబంధించిన రెండు దృశ్యాలు చిత్రించి ఉంటాయి.

మూలాలు[మార్చు]

 1. UNESCO World Heritage Site. Ajanta Caves, India: Brief Description. Retrieved 27 October 2006.
 2. UNESCO International Council on Monuments and Sites. 1982. Ajanta Caves: Advisory Body Evaluation. Retrieved 27 October 2006.

యితర లింకులు[మార్చు]