పావగడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పావగడ

పాముకొండ
పట్టణం
పావగడ is located in Karnataka
పావగడ
పావగడ
Location in Tumakur, Karnataka, India
నిర్దేశాంకాలు: 14°06′N 77°17′E / 14.10°N 77.28°E / 14.10; 77.28Coordinates: 14°06′N 77°17′E / 14.10°N 77.28°E / 14.10; 77.28
దేశం India
రాష్ట్రంమూస:Country data Karnataka
జిల్లాతుముకూరు జిల్లా
ప్రభుత్వం
 • నిర్వహణమునిసిపల్ కౌన్సిల్
సముద్రమట్టం నుండి ఎత్తు
846 మీ (2,776 అ.)
జనాభా
(2011)[1]
 • మొత్తం28,486
భాషలు
 • Officialకన్నడ
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
561 202
Telephone code08136
వాహనాల నమోదు కోడ్KA-64
జాలస్థలిhttp://www.pavagadatown.mrc.gov.in/

పావగడ, కర్ణాటక తుముకూరు జిల్లా పావగడ తాలూకా లోని1 పట్టణం.[2] చారిత్రికంగా ఇది మైసూరు రాజ్యంలో భాగంగా ఉండేది. రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి ఇది 158 కి.మీ. దూరంలో ఉంది.

పావగడలో ఉన్న శనీశ్వరాలయం అత్యంత ప్రసిద్ధి నొందినది. ఈ ఆలయం వృత్తాకారంలో వుండి అన్ని ఆలయాల వలే కాకుండా చాల భిన్నంగా వుంటుంది. ఇక్కడి పూజా విధానం కూడా కొంత వైవిధ్యంగా వుంటుంది. శనీశ్వరుని పూజకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి.. ఎత్తైన గోపురాలు లేకున్నా శిల్ప కళా తోరణాలు లేకున్నా అత్యంత కళాత్మకంగా వున్నదీ ఆలయం. ఇక్కడ పూజలు చేసినవారికి శని దోషాలు తొలిగి పోతాయని భక్తుల నమ్మకం. ఆంధ్ర సరిహద్దులో వున్నందున ఈ ఆలయానికి తెలుగు నాట నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పావ గడ ప్రక్కనే వున్న ఒక కొండ పై ఒక పెద్ద కోట ఉంది. ఈ కొండ పాదం వద్ద కోటె ఆంజనేయస్వామి ఆలయం ఉంది.

ఈ పట్టణంలో కన్నడతో పాటు, తెలుగు కూడా ఎక్కువగా మాట్లాడుతారు.

జనాభా[మార్చు]

2011నాటి జనగణన ప్రకారం పావగడ జనాభా 28,486. [3] అక్షరాస్యత 81.33%: పురుషుల అక్షరాస్యత 88.33%, = ఉండగా స్త్రీలలో 75.36% ఉంది. 6 ఏళ్ళ లోపు వయసు గలవారు మొత్తం జనాభాలో 10.65%.


మూలాలు[మార్చు]

  1. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-05-28. Retrieved 2020-06-13.
  3. "Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
"https://te.wikipedia.org/w/index.php?title=పావగడ&oldid=3026977" నుండి వెలికితీశారు