Jump to content

జంతువు

వికీపీడియా నుండి

జంతువులు (లాటిన్: Animalia, ఆంగ్లం: Animals) అనగా సృష్టిలో బహుకణ (Multicellular), యూకారియోటిక్ (Eukaryotic) లక్షణాలు కలిగిన జీవులు. ఇవి జీవ పరిణామక్రమంలో అత్యున్నత స్థాయిలో ఉన్న జీవులు. వృక్షాల వలె ఇవి తమ ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోలేవు, కాబట్టి వీటిని పరపోషకాలు (Heterotrophs) అంటారు. జంతువులు తమ జీవితకాలంలో ఏదో ఒక దశలో స్వతంత్రంగా చలించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

జంతువులు
Temporal range: ఎడియాకరన్ కాలం - ప్రస్తుతం
ఎడమవైపు పైనుండి సవ్యదిశలో: స్క్విడ్ (ఒక మొలస్కా), సముద్రపు నెటిల్ (ఒక నిడేరియా), ఆఫ్తోనా ఫ్లావా (ఒక ఆర్థ్రోపోడ్), యునెరీస్ లాంగిస్సిమా (ఒక అనెలిడ్), మరియు పులి (ఒక కార్డేట్).
Scientific classification
Domain:
(unranked):
Kingdom:
ఏనిమేలియా (Animalia)

వర్గాలు (Phyla)

ఉపరాజ్యం పేరాజోవా (Parazoa)

(ప్రత్యామ్నాయంగా)
Calcarea
Silicarea

ఉపరాజ్యం మెటాజోవా (Eumetazoa)

జంతువుల ముఖ్య లక్షణాలు

[మార్చు]

జంతువులు ఇతర జీవుల (మొక్కలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా) నుండి కొన్ని ప్రత్యేక లక్షణాల ద్వారా వేరుచేయబడతాయి:

  • బహుకణ నిర్మాణం: జంతువులన్నీ బహుకణ జీవులు. ఈ కణాలు కణజాలాలుగా, అవయవాలుగా మరియు అవయవ వ్యవస్థలుగా రూపాంతరం చెందుతాయి.
  • పరపోషణ (Heterotrophy): ఇవి తమకు కావలసిన శక్తి కోసం ఇతర జీవులను (మొక్కలను లేదా ఇతర జంతువులను) ఆహారంగా తీసుకుంటాయి.
  • కణ కవచం లేకపోవడం: వృక్ష కణాలు మరియు శిలీంధ్రాలకు ఉన్నట్లుగా జంతు కణాలకు కణ కవచం (Cell wall) ఉండదు.
  • చలనం (Motility): కండర మరియు నాడీ కణజాలాల సహాయంతో చాలా జంతువులు ఆహారం, ఆవాసం మరియు రక్షణ కోసం స్వతంత్రంగా చలించగలవు.
  • నాడీ వ్యవస్థ: స్పంజికలు (Sponges) మినహా మిగిలిన అన్ని జంతువులలో, బాహ్య ఉద్దీపనలను గ్రహించి ప్రతిస్పందించేందుకు నాడీ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉంటుంది.

ఏనిమేలియా వర్గీకరణ

[మార్చు]

ఏనిమేలియా రాజ్యాన్ని కణజాలాల అభివృద్ధిని బట్టి ప్రధానంగా రెండు ఉపరాజ్యాలుగా వర్గీకరించారు:

  • ఉపరాజ్యం అ - పేరాజోవా: ఇవి స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులు. ఈ రాజ్యంలో పోరిఫెరా (స్పంజికలు) అనే ఒక వర్గం చేరి ఉంది.
  • ఉపరాజ్యం ఆ - మెటాజోవా: ఇవి స్పష్టమైన కణజాలాలతో కూడిన బహుకణ జీవులు. దీన్ని మళ్ళీ రెండు శ్రేణులుగా (Grades) విభజించారు.

మెటాజోవా శ్రేణులు

[మార్చు]
  • శ్రేణి 1 - రేడియేటా లేదా డిప్లోబ్లాస్టికా: ఇవి వలయ సౌష్టవం కలిగిన ద్విస్తరిత (Diploblastic) జీవులు. ఉదాహరణకు నిడేరియా వర్గం.
  • శ్రేణి 2 - బైలటీరియా లేదా ట్రిప్లోబ్లాస్టికా: ఇవి ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన త్రిస్తరిత (Triploblastic) జీవులు. ఈ శ్రేణిని రెండు డివిజన్లుగా విభజించారు.

డివిజన్ ఎ: ప్రోటోస్టోమియా (ప్రోటో = ముందు; స్టోమం = నోరు): ఇవి ఆది ఆంత్రరంధ్రం (Blastopore) నోరుగా మారిన బహుకణ జీవులు. వీటిని మూడు సబ్ డివిజన్లుగా వర్గీకరించారు:

డివిజన్ బి: డ్యూటిరోస్టోమియా (డ్యూటిరో = ద్వితీయ; స్టోమం = నోరు): వీటిలో ఆది ఆంత్ర రంధ్రం పాయువుగా మారుతుంది. తరువాత నోరు దానికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది.

వర్గీకరణ చరిత్ర

[మార్చు]

ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ మొట్టమొదట జీవ ప్రపంచాన్ని జంతువులు, మొక్కలుగా వర్గీకరించాడు. ఆయన జంతువులను రక్తం ఉన్నవి మరియు రక్తం లేనివి (అకశేరుకాలు) గా విభజించాడు. ఆ తరువాత కరోలస్ లిన్నేయస్ 1758లో తొలిసారిగా ఒక క్రమానుసారంగా జీవులను వర్గీకరించి ద్వినామి విధానాన్ని ప్రవేశపెట్టాడు.

లిన్నేయస్ ప్రతిపాదనలోని మూడు సామ్రాజ్యాలలో జంతు సామ్రాజ్యము ఒకటి. జంతువులను ఆయన వెర్మిస్ (పురుగులు), ఇన్సెక్టా (కీటకాలు), పిసెస్ (చేపలు), ఆంఫీబియా (ఉభయచరాలు), ఏవ్స్ (పక్షులు), మమ్మేలియా (క్షీరదాలు) తరగతులుగా విభజించాడు. అప్పటినుండి జీవశాస్త్రజ్ఞులు వర్గీకరణలో జీవపరిణామ సంబంధాలకు పెద్దపీట వేయడం వల్ల ఈ వర్గాల విస్తృతి ఆధునిక కాలంలో మరింత శాస్త్రీయంగా కుదించబడింది (ఉదాహరణకు ప్రోటోజోవాలను ఇప్పుడు ప్రత్యేక వర్గంగా భావిస్తున్నారు).

ఆధునిక జీవశాస్త్ర వర్గీకరణ పితామహుడు కరోలస్ లిన్నేయస్.

ప్రత్యేకతలు గల జంతువులు

[మార్చు]
  • ఎగిరే జంతువులు: గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా గాలిలోకి ఎగిరే శక్తిని సాధించిన జంతువులు. వీటిలో కీటకాలు, పక్షులు, మరియు గబ్బిలాలు (క్షీరదాలు) ముఖ్యమైనవి. అరుదుగా కొన్ని రకాల ఉడుతలు, పాములు, చేపలు కూడా గాలిలో తేలియాడే (Gliding) లక్షణాన్ని అభివృద్ధి చేసుకున్నాయి.
  • విలుప్త జంతువులు: భూమిపై ఒకప్పుడు జీవించి, వాతావరణ మార్పుల వల్ల గానీ లేదా ఇతర కారణాల వల్ల గానీ పూర్తిగా అంతరించిపోయిన జంతువులు. ఉదాహరణ: డైనోసార్లు, డోడో పక్షి. (చూడండి: విలుప్తమైన జంతువుల జాబితా)

ఇవి కూడా చూడండి

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=జంతువు&oldid=4938371" నుండి వెలికితీశారు