జర్మన్ భాష

వికీపీడియా నుండి
(జర్మన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జర్మన్
డాయచ్ (Deutsch)
మాట్లాడే దేశాలు: క్రింది ప్రపంచ పటములో చూపబడినది 
ప్రాంతం: ప్రధానంగా జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మున్నగు ఐరోపా దేశాలు
మాట్లాడేవారి సంఖ్య: 18.5 కోట్ల మంది
భాషా కుటుంబము:
 జర్మన్
భాషా సంజ్ఞలు
ISO 639-1: de
ISO 639-2: ger (B)  deu (T)
ISO 639-3: — 
జర్మను భాష మాట్లాడు ప్రదేశాల చిత్రపటము.

Information:

  జర్మను అధికార భాషగా గుర్తించబడినది.
  జర్మను జనబాహుళ్యంలో ప్రచారమై ఉన్నది.
  జర్మను ప్రాంతీయ లేక అల్పసంఖ్యాక భాష.

జర్మన్ భాష ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల మందిచే మొదటి భాషగా మాట్లాడబడు ఒక భాష. ఈ భాష డచ్, ఆంగ్ల భాషలతో సారూప్యం కలిగి ఉంది. జర్మను భాష ఐరోపా సమాఖ్యలోని 23 అధికార భాషలలో ఒకటి. ఐరోపా సమాఖ్యలోని అత్యధికుల మాతృభాష కావడం వలన జర్మన్ లేక జర్మను భాష ప్రపంచ భాషలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలో ఎక్కువగా మాట్లాడబడు భాషలలో జర్మను భాష ఆంగ్ల భాష తర్వాత రెండవ స్థానంలో ఉంది (ఆంగ్ల భాష ఎక్కువమంది పరభాషగా వాడటం వలన). జర్మనీలో 95% మంది, ఆస్ట్రియాలో 89% మంది, స్విట్జర్లాండ్లో 65% మంది ఈ భాషను మాతృభాషగా కలిగియున్నారు. పైపెచ్చు రమారమి 8 కోట్ల మంది ఈ భాషను పరభాషగా ప్రయోగిస్తున్నారు. ఐరోపా సమాఖ్య మాత్రమే కాక ఐరోపా ఖండం మొత్తాన్ని పరిశీలించినట్లయితే రష్యన్ భాష తర్వాత ఇది రెండవ అతిపెద్ద మాతృభాష.

జర్మన్ ఆల్ఫాబెట్లు[మార్చు]

ఆంగ్లములో ఉన్న 26 అక్షరాలతో బాటు అదనంగా వాటిలోనే మూడు అక్షరాలకి ఉమ్లావ్ట్ (umlauts, తెలుగులో ఒత్తులకి వలె) గలవు. ఉమ్లావ్ట్ అనగా అక్షరం పై వచ్చే రెండు చుక్కలు, ఇవి A/a, O/o, U/u లకి Ä/ä, Ö/ö, Ü/üలుగా వస్తాయి. S, T మధ్యన ఎస్జెట్ట్ (ß) అనబడు మరొక అక్షరము గలదు. ఇది రెండు S లతో సమానము (ss).

  • A: ఆ
  • Ä: ఏ
  • B: బే
  • C: ట్సే
  • D: డే
  • E: ఏ
  • F: ఎఫ్
  • G: గే
  • H: హా
  • I: ఈ
  • J: యోట్
  • K: కా
  • L: ఎల్
  • M: ఎమ్
  • N: ఎన్
  • O: ఓ
  • Ö:
  • P: పే
  • Q: కూ, (ఆస్ట్రియాలో క్వే)
  • R: ఎర్
  • S: ఎస్
  • ß: ఎస్జెట్
  • T: టే
  • U: ఊ
  • Ü:
  • V: ఫౌ
  • W: వే
  • X: ఇక్స్
  • Y: ఎప్సిలన్
  • Z: ట్సెట్

లింగాలు[మార్చు]

జర్మను భాషలో లింగం వాడుక ఎక్కువ. ప్రతి వస్తువు, జీవికి తప్పని సరిగా లింగం వాడతారు. పదాన్ని బట్టి లింగనిర్ధారణ కాకుండా ప్రత్యేకించి లింగాన్ని వాడతారు.

  • పుంలింగం - డెర్ (der)

ఉదా: der Mann - the man (ఆ పురుషుడు)

  • స్త్రీలింగం - డీ (die)

ఉదా: die Frau - the woman (ఆ స్త్రీ)

  • నపుంసక లింగం - డస్ (das)

ఉదా: das Auto - the car (ఆ కారు)

వాడుక భాష[మార్చు]

  • Guten Morgen= శుభోదయం
  • Guten Abend = శుభ సంధ్య
  • Gute Nacht = శుభ రాత్రి
  • Hallo = నమస్కారం (ఆంగ్ల hello)
  • Wie geht es Ihnen? = ఎలా ఉన్నారు?
  • Wie geht es dir? = ఎలా ఉన్నావు?
  • Auf Weidersehen = ఇక సెలవు