భీమా శంకరం

వికీపీడియా నుండి
(భీమశంకర లింగము - భీమా శంకరం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Bhimashankar Temple
Bhimashankar (Maharashtra, India)
Bhimashankar (Maharashtra, India)
Bhimashankar Temple is located in Maharashtra
Bhimashankar Temple
భౌగోళికాంశాలు : 19°04′19″N 73°32′10″E / 19.072°N 73.536°E / 19.072; 73.536Coordinates: 19°04′19″N 73°32′10″E / 19.072°N 73.536°E / 19.072; 73.536
పేరు
ఇతర పేర్లు: Moteshwar Mahadev
ప్రధాన పేరు : Bhimashankar Shiva Mandir
దేవనాగరి : भिमाशंकर
Sanskrit transliteration: भिमाशंकर
తమిళం: பீமாஷங்கர் சிவாலயம்
మరాఠీ: भिमाशंकर
ప్రదేశము
దేశము: భారత దేశము
రాష్ట్రం: Maharashtra
జిల్లా: Pune
ప్రదేశము: Bhimashankar
నిర్మాణ శైలి మరియు సంస్కృతి
వాస్తు శిల్ప శైలి : Nagara

భీమా శంకరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం. ఇది భీమా నది జన్మస్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది.

స్థల పురాణం[మార్చు]

కుంభకర్ణుడి భార్య ఐనా కర్కాతి కుమారుడు భీమాసురుడు. ఇతను తల్లితో కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉండేవాడు. తల్లి మాటలతో ప్రభావితుడైన భీమాసురుడు విష్ణువు మీద కోపోద్రిక్తుడై బ్రహ్మ కోసం తపమాచరించి వర గర్వముతో అనేకమంది దేవతలను హింషించడం వంటివి చెయ్యడం జరిగేది. ఇంద్రాది దేవతలను శివుడుతో మొరపెట్టుకోమని సలహా నిచ్చిన నారదుడు భీమసురుని వద్దకు వెళ్ళి కామరూప మహారాజు శివుడికి పూజలు చేస్తున్నాడు అని చెప్పటం జరిగినది. అందుకు స్పందించిన అసురుడు శివ భక్తుడైన కామరూప మహారాజు పైకి యుద్దానికి వెళ్ళి జయించి, ఇకపై తనకు పూజలు చెయ్యమని ఆజ్ఞాపించాడు. అందుకు తిరస్కరించిన కామరూప మహారాజు పై కత్తి ఎత్తగా మహారాజు శివలింగమును గట్టిగా పట్టుకొని రక్షించమని ప్రార్ధించగా లింగమునుండి శివుడు ప్రత్యక్షమై భీమాసురుడిని చంపడం జరిగినది. విషయము తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూప దేశంపై దండెత్తగా సహ్యాద్రి పర్వతములో జరిగిన పోరులో శివుడు చెమటోడ్చి అసుర సంహారము చేశారని పురాణ గాధ. ఈ విధముగా రాలిన చెమట బొట్లే భీమా నదిగా గుర్తింపునందుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినది. అపుడు దేవతలు ప్రార్ధించగా శివుడు లింగ రూపములో అవతరించినట్లు చెప్పుకుంటారు.

పర్యాటకం[మార్చు]

పూర్తిగా అడవి, కొండలలోని ఈ ప్రాంతములోని ఆలయం ప్రకృతి సౌందర్యమునకు మారుపేరుగా ఉంటుంది. ఇప్పటికీ కనపడే కామరూప దేశపు రక్షణ గోడలు, అనేక రకములైన వృక్ష జాతులతో నయనాందకారకముగా ఉంటుంది. దగ్గర్లో గల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, సహ్యాద్రి వన్యప్రాణ రక్షణ నిలయంలో గల పెద్ద సైజు ఉడుతలు, Trekkingకు గల అనేక అవకాశములతో ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఐతే అనువైన కాలము ఆగష్టు, ఫిబ్రవరి నెలలు. వేసవిలో, వర్షాకాలములో అక్కడి వాతావరణము యాత్రలకు అనుకూలముగా ఉండదు.

ముంబై, పుణె, ఔరంగాబాద్, అహమదాగర్ల నుండి అనే విధములైన వాహన సౌకర్యములు కలవు. ముంబై, పుణె ల నుండి బస్ సౌకర్యములున్నాయి, రోజుకు అనేకమైన ట్రిప్పులతో యాత్రికులకు సౌకర్యములు కలిగిస్తున్నవి. 100 కి"మీ"ల దూరములో ఉండే పుణె రైల్వే సౌకర్యముకూడా అందుబాటులో ఉన్న నగరము. 200 కి"మీ"ల దూరములోని ముంబై రైల్వే తో పాటు విమాన సౌకర్యము కూడా కలిగియున్నది. దేశం నలుమూలల నుండి వచ్చే యాత్రికులకు కావలసిన సౌకర్యములు ఆలయ పురోహితులు ధర్మ శాలలు అందిస్తున్నవి.

"https://te.wikipedia.org/w/index.php?title=భీమా_శంకరం&oldid=1723724" నుండి వెలికితీశారు