Jump to content

సిద్ధివినాయక దేవాలయం (సిద్ధాటెక్‌)

వికీపీడియా నుండి
సిద్ధివినాయక దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:మహారాష్ట్ర
జిల్లా:అహ్మద్‌నగర్ జిల్లా
ప్రదేశం:సిద్ధాటెక్
భౌగోళికాంశాలు:18°26′38.81″N 74°43′34.53″E / 18.4441139°N 74.7262583°E / 18.4441139; 74.7262583
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:దేవాలయ శైలీ
చరిత్ర
నిర్మాత:అహల్యా బాయి హోల్కర్

సిద్ధివినాయక దేవాలయం, మహారాష్ట్ర, అహ్మద్‌నగర్ జిల్లా, సిద్ధాటెక్ ప్రాంతంలోని భీమా నది ఉత్తర ఒడ్డున ఉన్న వినాయకుడి దేవాలయం.[1] మహారాష్ట్రలో అష్టవినాయక అని పిలువబడే ఎనిమిది వినాయక దేవాలయాలలో ఇదీ ఒకటి. అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న ఏకైక అష్టవినాయక క్షేత్రమిది.[2]

ప్రదేశం

[మార్చు]

కొండపై ఉన్న ఈ దేవాలయం చుట్టూ బాబుల్ చెట్ల మందపాటి ఆకులు ఉన్నాయి. పూణె జిల్లాలోని షిరాపూర్ అనే చిన్న గ్రామం నుండి ఈ దేవాలయానికి చేరుకోవచ్చు, ఇక్కడ నుండి పడవ లేదా కొత్తగా నిర్మించిన వంతెన ద్వారా చేరుకోవచ్చు.[1] దేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు, భక్తులు తరచూ కొండపైకి ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు.

చరిత్ర

[మార్చు]

ఈ దేవాలయం విష్ణువుచే నిర్మించబడిందని ఇక్కడి భక్తుల నమ్మకం. కాలక్రమేణా ఈ దేవాలయం నాశనం చేయబడింది. తరువాత, ఒక ఆవుల కాపరి ఈ పురాతన దేవాలయాన్ని దర్శించి సిద్ధి-వినాయకుని విగ్రహాన్ని కనుగొని పూజించగా, ఇతరులు కూడా ఈ మందిరం గురించి తెలుసుకున్నారు.[1]

ప్రస్తుతమున్న ఈ దేవాలయాన్ని 18వ శతాబ్దం చివరలో ఇండోర్ తత్వవేత్త రాణి అహల్యా బాయి హోల్కర్ నిర్మించింది.[3] పేష్వా పాలకుల అధికారి సర్దార్ హరిపంత్ ఫడ్కే నాగర్‌ఖానాను నిర్మించాడు. హరిపంత్ ఫడ్కే 21 రోజులపాటు గుడిని సందర్శించి ప్రతిరోజూ 21 సార్లు దేవాలయ ప్రదక్షిణచేసి, దేవుడిని ప్రార్థించిన తర్వాత తిరిగి కమాండర్-ఇన్-చీఫ్‌గా తన పదవిని పొందాడు.[1] బయటి సభ-మండపాన్ని గతంలో బరోడాకు చెందిన భూస్వామి మైరాల్ నిర్మించాడు. ఇది 1939లో విచ్ఛిన్నమై 1970 పునర్నిర్మించబడింది.

ప్రస్తుతం, ఈ దేవాలయం చించ్వాడ్ దేవస్థాన్ ట్రస్ట్ నిర్వహణలో ఉంది. ఇది మోర్గావ్, తేర్ అష్టవినాయక దేవాలయాలను కూడా పర్యవేక్షిస్తోంది.[4][5]

ఆర్కిటెక్చర్

[మార్చు]

ఈ దేవాలయం నల్ల రాతితో నిర్మించబడింది. నల్లరాతితో కూడిన సభామండపం, మరొక సభామండపం ఉన్నాయి. ప్రధాన మందిర ప్రవేశద్వారం చిన్న రాక్షస శిరస్సు శిల్పాన్ని కలిగి ఉంది. ఈ దేవాలయంలో నాగర్‌ఖానా కూడా ఉంది.

గర్భగృహ 15 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పులో ఉంది. ఇందులో విష్ణువు నివాస ద్వారపాలకులైన జయ-విజయల విగ్రహాలు ఉన్నారు. గోపురం ఆకారపు రాతి పైకప్పును కలిగి ఉంది.[4] అన్ని అష్టవినాయక పుణ్యక్షేత్రాల మాదిరిగానే, స్వయంభు వినాయకుడిగా నమ్ముతారు.[6] సిద్ధి-వినాయకుని భార్య సిద్ధి పక్కనే కూర్చొని ఉంది. గర్భగుడిలో శివుడు, గణేశుడు, విష్ణువు, సూర్యుడు, శివాయ్ దేవత మందిరం కూడా ఉన్నాయి.

పండుగలు

[మార్చు]

ఈ దేవాలయంలో మూడు ప్రధాన పండుగలు జరుగుతాయి. వినాయక చవితి పండుగను హిందూ మాసం భాద్రపద మొదటి నుండి ఐదవ రోజు వరకు జరుపుకుంటారు. వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని వినాయక జయంతి పండుగను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో వినాయకుడి పల్లకి సేవ ఉంటుంది. విజయదశమి, సోమవతి అమావాస్య, సోమవారం నాడు వచ్చే అమావాస్య రోజు ఇక్కడ జాతర జరుగుతుంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Siddhatek". The Official Website of Ahmednagar District. National Informatics Centre, District –Ahmednagar. 2009. Retrieved 26 August 2011.
  2. Anne Feldhaus (2003). "Connected places: region, pilgrimage, and geographical imagination in India". Palgrave Macmillan. pp. 142, 145–6. ISBN 978-1-4039-6324-6.
  3. Grimes pp. 117-8
  4. 4.0 4.1 "SHREE SIDDHIVINAYAK - SIDDHATEK". Ashtavinayaka Darshan Online. Archived from the original on 2011-09-04. Retrieved 2022-07-05.
  5. As per the official receipt of donation, provided by the Morgaon temple
  6. Grimes pp. 110–1