హిందూ దేవాలయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిందూ దేవాలయాలు

భారతావని పుణ్యభూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి, వాటి పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచు కొని కొల్లగొట్టారు. దేవాలయాలు కాలగమనంలో జీర్ణించి పోతున్నా వాటిని పునర్నిర్మిస్తున్నారు. క్రొత్త వాటిని కడుతూనే ఉన్నారు. అన్ని ఆలయాలకు ఆదరణ బాగా ఉంది. ఆలయాల వల్ల వ్వక్తికి, సమాజానికి, దేశానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి వలన ప్రజల్లో భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐకమత్య భావన పెరిగి, తద్వారా దేశ భక్తి కలిగి, ప్రజల మానసికోల్లాసానికి ఉపయోగ పడుతుంది. ఈ భావన వలన అటు వ్వక్తులకు (ప్రజలకు), ఇటు దేశానికి (సమాజానికి) ఆరోగ్య కరమైన అభివృద్ధి కలుగు తుంది.

అటువంటి దేవాలయాల్లో అతి ధనవంతులైన దేవుళ్లు / ఆలయాల గురించి మొదటగా తెలిపి, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని ఆలయాల గురించి ఆ పై ఇతర ప్రదేశాలలోని ఆలయాల గురించి విషయం సేకరించి వ్రాయడం జరిగింది. అత్యంత ప్రాముఖ్యత కలిగి, అతి పురాతనమైన ఆలయాల గురించి మాత్రమే వ్రాయడం జరిగింది. ఈ ఆలయాలను ఒక పద్ధతి ప్రకారం వర్గీకరించ వలసి ఉంది. ఇంకొన్ని ఆలయాలున్నాయి. అవి గతంలో అత్యంత వైభవోపేతంగా వెలుగొంది, పరమతస్థుల దాడిలో కొల్ల గొట్టబడి, వాటి అస్థిత్వం కోల్పోయి, పూజా పునస్కారాలు లేక, కేవలం తమ పూర్వపు ఔన్నత్యాన్ని చూపడానికే సాక్షీభూతంగా అవి నిలబడి ఉన్నాయి. అలాంటి దేవాలయాలను, వాటి యొక్క గత వైభవం దృష్ట్యా, వాటిలో శిల్ప కళా వైభవం దృష్ట్యా ...... ప్రస్తుతం అయా ఆలయాలలో పూజాదికార్యక్రమాలు జరుగక పోయినా ... పర్యటకులు అధికంగా వస్తున్నందున, వాటిని కూడా ఈ వర్గంలో చేర్చడము జరిగింది. ఆ విధంగా ఈ వ్యాసము ఒక సమగ్రమైన వ్యాసంగా అవసరమయిన వారికి ఉపయోగ కరంగా ఉంటుందని భావించ బడుతున్నది.

భారతదేశంలోని ఆలయాలు[మార్చు]

భారతదేశంలోని ఆలయాలు రాష్ట్రాల వారీగా చూపబడినది

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలు[మార్చు]

తెలంగాణలోని ఆలయాలు[మార్చు]

కేరళలోని ఆలయాలు[మార్చు]

మహారాష్ట్రలోని ఆలయాలు[మార్చు]

కర్ణాటకలోని ఆలయాలు[మార్చు]

  • విరూ పాక్షాలయం.,హంపి, కర్ణాటక
  • హళేబీడు : ఈ హాలేబీడు 12 - 13 శతాబ్ది మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది.
  • పావగడ : మన దేశంలో శనీశ్వరాలయాలు అరుదుగా వుంటాయి. అలాంటిది ఒక శనీశ్వరాలయం కర్ణాటక రాష్ట్రంలోని పావగడలో ఉంది. ఇక్కడున్న శనీశ్వరాలయం అత్యంత ప్రసిద్ధి నొందినది. అతి పెద్దదైన ఈ ఆలయం వృత్తాకారంలో వుండి అన్ని ఆలయాల వలేకాకుండ చాల భిన్నంగా వుంటుంది. ఇక్కడి పూజా విధానం కూడా కొంత వైవిధ్యంగా వుంటుంది. శనీశ్వరుని పూజకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి.. ఎత్తైన గోపురాలు లేకున్నా శిల్ప కళా తోరణాలు లేకున్నా అత్యంత కళాత్మకంగా వున్నదీ ఆలయం. ఇక్కడ పూజలు చేసినవారికి శని దోషాలు తొలిగి పోతాయని భక్తుల నమ్మకం. ఆంధ్ర సరిహద్దులో వున్నందున ఈ ఆలయానికి తెలుగు నాట నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పావ గడ ప్రక్కనే వున్న ఒక కొండ పై ఒక పెద్ద కోట ఉంది.

తమిళనాడులోని ఆలయాలు[మార్చు]

జలకంటేస్వరాలయం, రాయ వేలూరు, కోట గోడపై నుండి తీసిన చిత్రం

ఉత్తరప్రదేశ్ లోని ఆలయాలు[మార్చు]

గుజరాత్‌లోని ఆలయాలు[మార్చు]

జమ్మూకాశ్మీర్‌లోని ఆలయాలు[మార్చు]

ఒడిషాలోని ఆలయాలు[మార్చు]

మహారాష్ట్రలోని ఆలయాలు[మార్చు]

ఉత్తరాఖండ్‌లోని ఆలయాలు[మార్చు]

నేపాల్‌లోని ఆలయాలు[మార్చు]

శుచీద్రం, త్రిమూర్తుల ఆలయం[మార్చు]

ఇది అనసూయ దేవి త్రిమూర్తులను పసిపాపలుగా చేసి లాలించిన పవిత్ర స్థలం. త్రిమూర్తులు కొలువై వున్న ఈ ఆలయానికి అర్థ రాత్రి త్రిమూర్తులు వచ్చి పూజుస్తారని భక్తుల నమ్మిక.

కైలాసనాథ ఆలయం[మార్చు]

కైలాశ పర్వతం టిబెట్ హిమాలయాల్లో భాగమైన గాంగ్డిసె పర్వతాలలో ఒక శిఖరం. ఇది ఆసియాలోని పెద్ద నదులలో కొన్ని సింధు నది, సట్లేజ్ నది (సింధు నది ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్ర నది, కర్నాలి నది (గంగా నది ఉపనది) మూలానికి దగ్గరగా ఉంటుంది. ఇది నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది, అవి:బోన్, బుద్ధిజం, హిందూ మతం, జైనిజం. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా భావించబడుతుంది. ఈ పర్వతం టిబెట్ లోని మానససరోవరానికి, రాక్షస్తల్ సరస్సుకి దగ్గరగా ఉంటుంది. కొంతమంది యాత్రికులు కైలాష పర్వత యాత్ర అంతా ఒక్కరోజు లోనే చెయ్యాలని నమ్ముతారు. అదంత సులభం కాదు. మంచి ఆకృతి గల వేగంగా నడిచే మనిషి ఈ 52 km పూర్తి చెయ్యడానికి దాదాపు 15 గంటలు పడుతుంది. అస్థిర వాతావరణం, ఎత్తువల్ల వచ్చే అస్వస్థత, ఈ ప్రక్రియలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకి కొంచెం భయపడి నప్పటికీ కొంతమంది భక్తులు ఈ సాహసాన్ని పూర్తిచేస్తారు. అలాగే ఇతర యాత్రికులు ఇంకొంచెం ఎక్కువ పథ్యాన్ని పాటిస్తూ చేస్తారు, మొత్తం ప్రదక్షిణ అంతా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చేస్తారు: యాత్రికుడు వంగి మోకాళ్ళ మీద కూర్చొని మొత్తం సాగిలపడి వేళ్ళతో గుర్తు చేసి మోకాళ్ళ మీద లేచి ప్రార్థించి చేతులతో, మోకాళ్ళతో అక్కడివరకు ప్రాకి మళ్లీ మళ్లీ ఈ పద్ధతిని పునరావృతం చేస్తారు. ఈ పథ్యాన్ని పాటిస్తూ ప్రదక్షిణ పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాల శారీరక ఓరిమి అవసరమవుతుంది. ఈ పర్వతం టిబెటన్ హిమాలయాలలో . యాత్రికుల సౌకర్యార్థం కొన్ని ఆధునిక వసతులైన బెంచీలు, విశ్రాంతి ప్రదేశాలు, ఉపాహార కేంద్రాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలు పెట్టటం మహా పాపం. ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెపుతారు

1950లో చైనిస్ సైన్యం టిబెట్ లో అడుగు పెట్టిన తరువాత, చైనిస్-ఇండియన్ సరిహద్దులలో నెలకొన్న రాజకీయ, సరిహద్దు అనిశ్చితి వలన శివ భగవానుడి నివాసానికి చేసే తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేయబడింది. దానితరువాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది, వీరు చైనిస్, భారతీయ ప్రభుత్వాల పర్యవేక్షణలో సుదీర్ఘమైన, క్లిష్టమైన హిమాలయాల అధిరోహణ చేస్తారు, భూమార్గం గుండా కాట్మండు నుండి లేదా లాసా నుండి విమానాల ద్వారా టిబెట్ చేరుకొని అక్కడినుండి గొప్ప టిబెటన్ పీఠభూమిని కారులో చుడతారు. ఈ ప్రయాణం నాలుగు రాత్రులు పడుతుంది, చివరికి దార్చేన్ చేరతారు,>

ఇక్కడి చిన్న అవుట్ పోస్ట్ ప్రతి సంవత్సరం ప్రత్యేక సమయంలో తీర్థయాత్రికులతో నిండిపోతుంది. కనిష్ఠ సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ విదేశీ తీర్థ యాత్రికుల కోసం ఆధునిక గెస్ట్ హౌసులు అందుబాటులో ఉన్నాయి, అదే టిబెటన్ తీర్థ యాత్రికులయితే సాధారణంగా వారి సొంత టెంట్లలో నిద్రపోతారు. సుదూర-తూర్పు టిబెట్ లోని స్విస్ కోర్సం ఫౌండేషన్ నిదులన్దించే చిన్న ప్రాంతీయ వైద్య కేంద్రం 1997లో ఇక్కడ స్థాపించబడింది.

అమర్ నాథ్ యాత్ర[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]